నీళ్ల చారు
చిటికెలో అయిపోయే రెసిపీస్ అని అంటుంటాము అలాంటి ఎంతో రుచిగా ఉండే రెసిపీనే ఆంధ్రా స్టైల్ నీళ్ల చారు. చేయడానికి తేలికగా తిన్నాకా హాయిగా అనిపించే సూపర్ సింపుల్ రెసిపీ నీళ్ల చారు.
పేరు ఉన్నట్లుగానే నీళ్లుగా ఉండే చారు. అంటే అచ్చంగా ఏమి ఉండదు తాలింపులు తప్ప. కేవలం చారుకి కావలసిన పదార్ధాలన్నీ వేసి మరిగించి తాలింపు వేయడమే, ఇంకేమి లేదు ఈ చారులో.
ఈ చారు ఒక్క సారి తిన్నారంటే రోజూ భోజనానికి ఉండాలి అనేంతగా నచ్చేస్తుంది. ఈ నీళ్ల చారు ఆలూ ఫ్రై, అరటికాయ వేపుడు ఇంకా నాన్ వెజ్తో నంజుకోడానికి ఇంకా నాన్ వెజ్ తిన్నాక పొట్ట తేలికగా అనిపించేందుకు ఈ చారు చేసుకోండి.
ఈ చారు నేను ఎక్కువగా ఆంధ్రాలోని రాయలసీమ ఇంకా గుంటూరు పలనాడు ప్రాంతాల్లో ఎక్కువగా చేయడం చూసాను. ఈ నీళ్ల చారు అన్నంతో పాటు ఇడ్లీతో చాలా రుచిగా ఉంటుంది. జ్వరమొచ్చినప్పుడు మా ఇంట్లో ఈ నీళ్ల చారుతో భోజనం పెడతారు తేలికగా తిరగాలని నోటికి రుచి తెలియాలని.
Try this: Ajwain Rasam and Pepper Rasam

టిప్స్
ఎప్పుడు చారు కాచిన ఇవి పాటించాలి:
-
చారు చూడాలని చేయడానికి చాలా తేలిక, కానీ చారులో వేసే పదార్ధాలు సమపాళ్లలో ఉండాలి. అప్పుడే చారు రుచి. లేదంటే రుచిగా అనిపించదు.
-
పలుచని చింతపండు పులుసులో వేసే దినుసులు బాగా మరగాలి అప్పుడే వాటిలోని సారం అంత పులుసులోకి దిగుతుంది, లేదంటే వేడి నీళ్ళకి తాలింపు పెట్టినట్లే ఉంటుంది.
-
కావాలంటే చారు మరిగేప్పుడు ఒక్క సారి రుచి చుడండి దినుసుల సారం దిగింది లేనిది.
-
నచ్చితే వెల్లులి చారు మరిగేప్పుడు తాలింపులో దంచి వేసుకోవచ్చు నేను వేయలేదు.
నీళ్ల చారు - రెసిపీ వీడియో
Charu | Rasam | Neella charu | How to Make Charu
Prep Time 1 min
Cook Time 15 mins
Total Time 16 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 750 ml పలుచని చింతపండు నీళ్లు (75 gm చింతపండు నుండి తీసినది)
- 3 tbsp ధనియాలు
- 5 - 6 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 1 tsp మిరియాల పొడి
- 2 కరివేపాకు కాడలతో సహా
- ఉప్పు
- 1/2 tsp పసుపు
- 4 పచ్చిమిర్చి చీలికలు
-
తాలింపు కోసం
- 1.5 tsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 1/2 tsp ఇంగువ
- 1 ఎండుమిర్చి
విధానం
-
చారు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మరగనివ్వాలి.
-
15 నిమిషాల తరువాత రుచి చుడండి చారులోకి దినుసుల సారం దిగింది లేనిది. అవసరమైతే ఇంకాసేపు మరగనివ్వాలి. ఆ తరువాత దింపేసుకోవాలి.
-
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామాగ్రీ అంతా వేసి వేపి మరిగిన చారుని వడకట్టి తాలింపులో పోయండి. ఆ తరువాత చారుని ఒక్క పొంగు రానిచ్చి దింపేసుకోండి. (చారు చేసే ముందు ఒక్క సారి టిప్స్ చుడండి) .

Leave a comment ×
3 comments