కొబ్బరి హల్వా | కమ్మగా రుచిగా తిన్నకొద్ది తిన్నలనిపిస్తుంది
తీపి తినాలిపించినప్పుడు వెంటనే చేసుకోగలిగిన టేస్టీ సింపుల్ రెసిపీ ఈ కొబ్బరి హల్వా! ఈ టేస్టీ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
కొబ్బరి హల్వా కమ్మగా రుచిగా తిన్నకొద్ది తిన్నలనిపిస్తుంది బెల్లం వేసి చేసే ఈ హల్వా ఆరోగ్యం కూడా.
కొబ్బరితో చేసే స్వీట్లు చాలానే ఉన్నాయి, పచ్చి కొబ్బరితో లడ్డూలు, లౌజులూ ఇంకా చాలానే చేస్తారు. ఈ సింపుల్ రెసిపి నేను చెన్నైలోని మాంబలం ప్రాంతం లో ఉండే ఒక అయ్యంగార్ కుంటుంబం నుండి తెలుసుకున్నాను. ఈ హల్వా వారు ధనుర్మాసంలో చేసి శ్రీ మహా విష్ణువుకి నివేదిస్తారు.
నిజజనికి ఈ హల్వా నేను నెయ్యి వేసి కాల్చిన బ్రెడ్ మధ్యన్ జామ్లా స్ప్రేడ్ చేసి తింటాను. చాలా బాగుంటుంది ఒక సారి ట్రై చేసి చెప్పండి. ఈ హల్వాని జీడిపప్పు వేయకుండా ఇంకొంచెం ముద్దగా చేసి బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు.
ఈ సింపుల్ హల్వా ఎవ్వరైన చేసేంత సులభం, 4 పదార్ధాలతో అయిపోతుంది. కొలతలు కూడా చాలా సులభం. ఇంకా ఈ కొబ్బరి హల్వా 3-4 రోజులు పైనే నిలవ ఉంటుంది.

టిప్స్
హల్వా మరీ తీగ పాకం వచ్చేదాకా ఉడికించకూడదు. దగ్గరపడ్డాక దింపేసుకోవాలి.
కొబ్బరి హల్వా | కమ్మగా రుచిగా తిన్నకొద్ది తిన్నలనిపిస్తుంది - రెసిపీ వీడియో
Coconut halwa recipe | Nariyal ka halwa recipe | Thengai halwa | How to make Kobbari Halwa
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 2 cup పచ్చి కొబ్బరి
- 1 cup బెల్లం
- 3 - 4 spoon నీళ్ళు
- 1/2 tsp యాలకలపొడి
- 3 tbsp నెయ్యి
- 10 జీడిపప్పు
విధానం
-
పచ్చికొబ్బరి తురుము, బెల్లం తరుగు కొద్దిగా నీళ్ళు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి
-
ముకుడులో నెయ్యి కరిగించి జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి
-
అదే నెయ్యిలో గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దగ్గరపడనివ్వాలి
-
20 నిమిషాలకి హల్వాలా దగ్గరపడుతుంది. అప్పుడు యాలకలపొడి , మరో tsp నెయ్యి, వేపుకున్న జీడిపప్పు వేసి కలిపి దింపేసుకోవాలి

Leave a comment ×
4 comments