పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా పొడిపొడిగా కారం కారంగా ఉండే సింపుల్ ఆలూ వేపుడు గురుంచి ఎంత చెప్పినా తక్కువే!!! అసలు ఆలూ ఫ్రై తినని వారు ఇష్టపడని వారుంటారా? అని అనిపిస్తుంది.

వేడి అన్నం నెయ్యి ఆలూ వేపుడు ఉంటె చాలు ఎంత తింటున్నామో కూడా తెలియనంత తృప్తిగా తింటూనే ఉంటాము. నెయ్యి వేసిన అన్నంతోనే కాదండి, పప్పు అన్నంతో నంజుడుగా, పెరుగన్నంతో కూడా అంతే రుచిగా ఉంటుంది.

ఆలూ వేపుడులు మీరు చాలానే తినుంటారు, కానీ ఈ తీరు మీకు ఆలూ ముద్దగా అవ్వదు, పొడి పొడిగా ఉంటుంది. గంటల తరువాత కరకరలాడుతూ ఉంటాయి. ఈ సింపుల్ ఆలూ ఫ్రై యేపొపుడు చేసుకునే తీరు కాకుండా కొంచెం భిన్నంగా మరింత రుచిగా చేశాను.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు చెట్టినాడు ఆలూ ఫ్రై

పర్ఫెక్ట్ రెసిపీ కోసం కింద టిప్స్ చుడండి.

టిప్స్

ఆలూ:****

  1. ఎప్పుడు కొత్త ఆలూ తీసుకోండి. ఒకవేళ కొత్త ఆలూ దొరకకపోతే మీరు గట్టిగా ఉండే ఆలూ అయినా వాడుకోండి.

  2. చెక్కు తీసుకున్న ఆలూ ముక్కలు ఎప్పుడు సమానంగా కోసుకుంటే అన్ని ఒకే తీరుగా వేగుతాయ్. లేదంటే కొన్ని ఎక్కువగా కొన్ని తక్కువగా వేగుతాయ్.

  3. ముక్కలు కోసిన ఆలూని నీళ్లలో వేసి 3-4 సార్లు నీళ్లు మార్చుకుంటూ బాగా కడిగి ఇంకొన్ని నీరు పోసి కనీసం 15 నిమిషాలు వదిలేస్తే ఆలూలోని పిండి పదార్ధం తగ్గుతుంది, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఆలూ వేపుడు.

ఆలూ ఉడికించే తీరు:

  1. ఆలూ ముక్కలని నీళ్లలో వేసి కేవలం అంచుల వెంట పొంగు వచ్చేదాకా ఉడికించి నీటిని ఒంపేసుకోవాలి. అంత కంటే ఎక్కువగా ఉడకనవసరం లేదు. ఎక్కువగా ఉడికితే చిదిరిపోతుంది ఆలూ.

మినుములు కారం పొడి:

  1. మినుములు ఎండుమిర్చి జీలకర్ర సన్నని సెగ మీద కలుపుతూ మాంచి సువాసన వచ్చే దాక వేపుకోవాలి. అప్పుడే పప్పు లోపలిదాకా వేగి సువాసనతో పాటు మాంచి రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే ఈ పొడి ఎక్కువగా చేసుకుని దాచుకోవచ్చు, అవసరమైనప్పుడు ½ కిలో ఆలూకి మూడు tbsp పొడి వేసుకోండి.

ఆలూ ఫ్రై - రెసిపీ వీడియో

Crispy Aloo Fry | Aloo Fry

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Total Time 35 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • పొడి కోసం:
  • 3 tbsp మినుములు/పొట్టు లేని మినపప్పు
  • ఎండుమిర్చి
  • 1/2 tbsp జీలకర్ర
  • వేపుడు కోసం:
  • 1/2 Kg ఆలూ
  • 6 tbsp నూనె
  • 1/2 tbsp ఆవాలు
  • 1/2 tbsp జీలకర్ర
  • 3 వెల్లులి
  • 2 Pinches ఇంగువ
  • 2 Sprigs కరివేపాకు
  • 1/8 tbsp పసుపు
  • 1/2-1 tbsp కారం
  • ఉప్పు (రుచికి సరిపడా)

విధానం

  1. ఆలూని చెక్కు తీసి సమానంగా ముక్కలు కోసి నీళ్లలో వేసి మూడు నుండి నాలుగు సార్లు నీళ్లు మార్చి కడిగి కొత్త నీళ్లలో వేసి ఉంచండి.
  2. పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద వేపి మాంచి సువాసన వస్తున్నప్పుడు దింపి చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి
  3. నీళ్లలో నానబెట్టిన ఆలూని వడకట్టి మరిగే నీళ్లలో వేసి అంచుల వెంట పొంగు వచ్చే దాకా మరిగించండి. పొంగు రాగానే దింపి నీటిని వాడకట్టేసి పూర్తిగా చల్లార్చండి.
  4. నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వెల్లులి ఇంగువ కరివేపాకు వేసి తాలింపు మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి
  5. వేగిన తాలింపులో చల్లారిన ఆలూని వేసి ముందు నూనె పట్టించండి, తరువాత మీడియం ఫ్లేమ్ మీద ఆలూ కారకరలాడేట్టు వేపుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.
  6. ఆలూ బంగారు రంగులోకి మారి పైన కారకరలాడుతున్నప్పుడు పసుపు కారం వేసి వేపుకోవాలి.
  7. దింపే ముందు మినుములు కారం పొడి ఉప్పు వేసి టాస్ చేసి ఒక నిమిషం వేపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.