ఒకటి తినదామని మొదలెట్టి ఎన్ని తింటారో లెక్కపెట్టలేనట్లుగా తినిపించే క్విక్ & సింపుల్ హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ ఎగ్ బోండా.

ఎగ్ బోండానే ఎగ్ బజ్జీ అని కూడా అంటుంటారు. ఎగ్ బజ్జీ స్ట్రీట్ ఫుడ్ గా ఆంధ్రా తెలంగాణాలో ఎక్కువగా దొరుకుతుంది. కానీ ఆంధ్రులు తెలంగాణాలో మిగిలిన ప్రాంతాల్లో చాట్ మసాలా కొత్తిమీర తరుగు ఇవేవి వాడారు పిండిలో, కేవలం సెనగపిండిలో ఉప్పు వాము నీళ్లు కలిపి గుడ్డు ముంచి వేస్తార . హైదరాబాద్లో దొరికే ఎగ్ బోండాలోనే ఇవన్నీ వేస్తారు.

హైదరాబాద్లో అయితే ఇరానీ కేప్స్లో కూడా లుక్మీ, సమోసా, ఖజూర్తూ పాటు ఎక్కువగా దొరుకుతుంది.

నేను చేస్తున్నది హైదరాబాదీ స్టైల్. ఎగ్ బోండా అన్ని రోజులూ బండ్ల మీద దొరికినా రంజాన్ మాసంలో ప్రేత్యేకించి ఎక్కువగా తింటుంటారు ముస్లింస్. ఇంకా ఉపవాసం అయిపోయిన తరువాత ముస్లిమ్స్ చాలా ఇష్టంగా తింటారు, ఇంకా ఇఫ్తార్ పార్టీల్లో కూడా ఎగ్ బోండా స్టారర్గా సర్వ్ చేస్తారు.

ఈ సింపుల్ రెసిపీకి బోండా నూనెలో వేపే తీరులో చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, పర్ఫెక్ట్ బోండా చేసేస్తారు.

టిప్స్

పిండి చిక్కదనం:

పిండిలో నీరు పోసి కలిపాక వెలికి ఏ మందాన పిండి అంటుతుందో ఆ మందాన గుడ్డుని పట్టి ఉంచుతుంది అని అర్ధం. నేను బియ్యం పిండి వాడట్లేదు నచ్చితే 2 tsp బియ్యం పిండి వేసుకోండి, అప్పుడు బోండా ఇంకా కరకరలాడుతూ ఉంటుంది

ఎగ్ నూనెలో వేస్తే పేలుతుంది:

ఎగ్ పైన కోటింగ్ సరిగా పట్టి ఉండాలి అప్పుడే ఎగ్ నూనెలో వేసాక పేలదు. పిండి ఎగ్కి పూర్తిగా పట్టనట్లైతే నూనెలో వేగేప్పుడు గుడ్డు చిట్లుతుంది.

ఎగ్ బోండా - రెసిపీ వీడియో

Crispy Egg Bonda | Egg Bajji | Egg Pakoda

Street Food | nonvegetarian|eggetarian
  • Prep Time 10 mins
  • Cook Time 10 mins
  • Total Time 20 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 6 ఉడికించిన గుడ్లు
  • బజ్జీ పిండి కోసం
  • 3/4 cup సెనగపిండి
  • 1/8 tsp పసుపు
  • ఉప్పు
  • 2 చిటికెళ్ళు వంట సోడా
  • 1/4 tsp జీలకర్ర
  • 1 tsp సన్నని పచ్చిమిర్చి తురుము
  • 1 tsp కొత్తిమీర తరుగు
  • 1/2 tsp కారం
  • 1/8 tsp చాట్ మసాలా
  • 1/4 tsp గరం మసాలా
  • 1/4 tsp వేయించిన జీలకర్ర పొడి
  • నీళ్లు - తగినన్ని

విధానం

  1. ఉడికించిన గుడ్లని సగానికి కట్ చేసి పక్కనుంచుకోండి.
  2. సెనగపిండిలో పిండి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి చిక్కగా పిండి కలుపుకోవాలి.
  3. కట్ చేసిన గుడ్డు లోపలి పచ్చ సోన చిదిరిపోకుండా పిండిలో ముంచి తీసి మరిగే వేడి నూనె వేసి మీడియం - హై -ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోండి.
  4. సర్వ్ చేసే ముందు చాట్ మసాలా చల్లి ఉల్లిపాయ తరుగుతో వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Whole family 6 members enjoyed its taste.
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    I enjoyed its crispyness by following your tips and my family members also tasted the yummy yum
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Trupti gaa undi
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Trupti gaa undi