సేమియా కట్లెట్స్

అటుకులు ఉడికించిన ఆలూ ఇంకొన్ని కాయకూరల ముక్కాల తరుగు వేసి సేమియా అద్ది నూనెలో ఎర్రగా వేపిన వెజ్ కట్లెట్స్ ఒకటి తిని ఆపడం తరం కాదు, అంత రుచిగా ఉంటాయి.

ఈ సేమియా కట్లెట్స్ బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఎంతో రుచిగా ఉంటాయి, ఇవి పార్టీ స్టార్టర్ లేదా ముందే చేసి ఫ్రిజ్లో ఉంచుకుంటే సాయంత్రాలు టీ టైం స్నాక్గా పర్ఫెక్ట్!!!

ఈ సేమియా కట్లెట్స్ వెడ్డింగ్స్ స్పెషల్గా కేటరర్స్ మెన్యులో చేర్చేసారు, ఇంకా స్వీట్ హౌస్లో కూడా దొరుకుతుంది. నేను స్వీట్ హౌస్లో చేసే తీరు లేదా వెడ్డింగ్స్లో చేసే తీరు కాకుండా చాలా సులభంగా అందరూ ఇంట్లో చేసుకునే తీరులో మార్చాను

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు. పనీర్ పాప్ కార్న్

మీకు స్వీట్ హౌస్ తీరు కావాలనుకుంటే కింద టిప్స్ చుడండి.

టిప్స్

కట్లెట్స్:

  1. షేప్ మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. నేను బుల్లెట్స్ చేసాను. మీరు హార్ట్ షేప్, ఒవెల్ షేప్ లేదా చతుర్భుజం ఆకారం ఎలాగైనా చేసుకోవచ్చు.

కట్లెట్స్ మిశ్రమం:

  1. నేను మెత్తగా నానబెట్టిన అతుకుల్లో ఉడికించిన ఆలూ తురుము ఇంకొన్ని కయ కూరలు వేసి చేశాను. మీరు ఇక్కడ అటుకులకి బదులు ఎక్కువగా ఆలూ ఇంకా కొంచెం పనీర్ ముక్కలు లేదా తురుము వేసి కూడా చేసుకోవచ్చు.

సేమియా:

  1. ఈ కట్లెట్స్ పైన అద్దడానికి సన్నని సేమియా వాడుకోవాలి. ముస్లిమ్స్ షీర్ కుర్మాకి వాడే సన్నని వేపని సేమియా దొరుకుతుంది అది అయితే పర్ఫెక్ట్.

  2. ఒక వేళ అలాంటి సన్నని సేమియా దొరకనట్లైతే మాములు సేమియా వేపనిది వాడుకోండి.

  3. సేమియా ¼ ఇంచ్ ముక్కలుగా నలుపుకొండి. అంత కంటే సన్ననివి అయితే వేగాక నోటికి తెలియదు.

వేపే తీరు:

  1. బుల్లెట్స్ చేశాక వేడెక్కిన నూనెలో వేసి కదపకుండా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వదిలేయండి. అప్పుడు సేమియా వేగి కట్లెట్స్కి అంటుకుంటుంది.

  2. కట్లెట్స్ లేత బంగారు రంగు వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి ఆ తరువాత హై ఫ్లేమ్ మీద వేపుకుంటే క్రిస్ప్గా మాంచి ఎర్రటి రంగులో వేగుతాయ్.

ఇలా చేసి ఉంచుకోవచ్చు:

  1. కట్లెట్స్ అంతా తయారుచేసి జిప్ లాక్ లేదా ఎయిర్టైట్ డబ్బాల్లో పెట్టి ఫ్రీజర్లో ఉంచుకుంటే కనీసం 15 రోజులు నిల్వవుంటాయ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి చల్లనివే నూనెలో వేపి తీసుకోవచ్చు.

ఆఖరుగా:

  1. ఈ కట్లెట్స్ వేడి మీద చాలా రుచిగా ఉంటాయి, అని గుర్తుంచుకోండి.

సేమియా కట్లెట్స్ - రెసిపీ వీడియో

Crispy Semiya Veg Cutlets | Semiya Cutlets | Vegetable Cutlets

Snacks | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 25 mins
  • Total Time 35 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • కట్లెట్స్ కోసం:
  • 1 Cup మందం అటుకులు
  • 2 మీడియం సైజు ఉడికించిన ఆలూ
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 3 tbsp ఫ్రోజెన్ కార్న్
  • 3 tbsp సన్నని కేరట్ తురుము
  • 2 tbsp కాప్సికం తరుగు
  • 1/4 tbsp చాట్ మసాలా
  • 1/2 tbsp మిరియాల పొడి
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/2 tbsp కారం
  • 2 tbsp కొత్తిమీర తరుగు
  • 1 tbsp నిమ్మరసం
  • నూనె (వేపుకోడానికి)
  • కోటింగ్ కోసం:
  • 1/4 Cup మైదా
  • 1/3 Cup నీరు
  • 1/2 Cup సెనగపిండి
  • 150 gm సన్నని సేమియా

విధానం

  1. అటుకులని జల్లించి నీళ్లతో బాగా తడిపి 15 నిమిషాలు వదిలేస్తే అటుకులు బాగా మెత్తబడతాయ్. తరువాత చేత్తో బాగా మెత్తగా నిలపాలి.
  2. తరువాత మెత్తగా ఉడికించిన ఆలూని తురుము వేసుకుంటే గడ్డలు ఉండవు.
  3. కట్లెట్స్ కోసం ఉంచిన మిగిలిన సామాగ్రీ అంతా వేసి గట్టిగా పిండుతూ కలుపుకోండి
  4. మైదాలో నీరు, కొద్దిగా ఉప్పు వేసి పలుచని మజ్జిగ మాదిరి చేసుకోండి, సెనగపిండిలో ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకోండి. సేమియాని నలిపి పక్కనుంచుకోండి
  5. కలుపుకున్న కట్లెట్స్ మిశ్రమంని నచ్చిన ఆకారంలో తట్టుకొండి.
  6. తరువాత ముందు మైదాలో కట్లెట్ తడిచేలా ముంచి ఆ తరువాత సెనగపిండిలో రోల్ చేయండి అప్పుడు తడిపొడిగా ఉంటుంది కట్లెట్, ఆ సమయంలో సేమియాలో రోల్ చేసి అవసరమైతే సేమియాని అంటించండి కట్లెట్కి
  7. మరిగే వేడి నూనె మంట తగ్గించి తయారు చేసుకున్న కట్లెట్స్ కొన్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా 2 నిమిషాలు వదిలేయండి, ఆ తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ వేపుకోవాలి
  8. ఈ కట్లెట్స్ వేడి పుదీనా పచ్చడి టమాటో సాస్తో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments