బాచిలర్స్ దాల్ కిచిడీ
“దాల్ కిచిడీ” తయారు చేయాలనుకున్న తినాలనుకున్న మనసుకి హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే చేయడం అంత సులభం కాబట్టి. భారత దేశంలో కిచిడీలు చాలా రకాలుగా చేస్తారు. అందులో నా పద్ధతిలో చేసే ఈ దాల్ కిచిడీ ఒకటి. ఈ కిచిడీ కమ్మగా తక్కువ మసాలాలు కారాలతో ఉంటుంది.
కిచిడీ కావాల్సిన పదార్ధాలన్నీ కలిపి కుక్కర్లో వేసి తాలింపు పెట్టేస్తే కమ్మని దాల్ కిచిడీ తయారు. బాచిలర్స్కి బెస్ట్ ఈ రెసిపీ. దాల్ కిచిడీ మా ఇంట్లో ఏమి వండాలో తోచనప్పుడైనా, డిన్నర్కి లైట్గా తిన్నలనుకున్నప్పుడైనా చాలా ఎక్కువగా చేస్తుంటాము. మీకు తప్పక నచ్చుతుంది. ఇంకా లంచ్ బాక్సులకి కూడా పర్ఫెక్ట్.

టిప్స్
-
పప్పులు, బియ్యం కచ్చితంగా గంట సేపు నానాబెట్టాలి. అప్పుడే పప్పు మెత్తగా ఉడికి క్రీమీగా ఉంటుంది కిచిడీ
-
దాల్ కిచిడీ కాస్త పలుచగా చేసుకుంటే చల్లారాక గట్టిగా ముద్దగా అవ్వదు. ముద్దగా అనిపిస్తే ఎప్పుడైనా వేడి నీళ్ళు కలిపి పలుచన చేసుకోవచ్చు.
-
ఆలూ పైన చెక్కు తీయకుండా వేస్తేనే రుచిగా ఉంటుంది కిచిడీ. ఆలూ ఉడికాక కిచిడీలో కలిసిపోయి చాలా రుచిగా అనిపిస్తుంది.
-
నచ్చితే ఇంకా ఇందులో ఫ్రెంచ్ బీన్స్ అంగుళం సైజు ముక్కలు కూడా వేసుకోవచ్చు.
బాచిలర్స్ దాల్ కిచిడీ - రెసిపీ వీడియో
Dal Khichidi Recipe | Khichdi Recipe | How to make Simple Dal Khichdi
Prep Time 5 mins
Soaking Time 1 hr
Cook Time 25 mins
Total Time 1 hr 30 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బియ్యం
- 1 పెసరపప్పు
- 3/4 cup కంది పప్పు
- 1 బంగాళా దుంప
- 1 ఉల్లిపాయ
- 1/2 cup తాజా బటానీ
- 3 పచ్చిమిర్చి
- 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
- 1/2 tsp పసుపు
- ఉప్పు – రుచికి సరిపడా
- 8 cups నీళ్ళు
- 3 tbsp నూనె
-
తాలింపు కోసం
- 4 tbsp నెయ్యి
- 2 చిటికెళ్ళు ఇంగువ
- 3 ఎండు మిర్చి
- 1 tbsp జీలకర్ర
- 2 టొమాటో ముక్కలు
- 1 1/2 tsp కారం
- 1 కొత్తిమీర – చిన్న కట్ట
విధానం
-
కుక్కర్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయాల్లో అల్లం వెల్లులి ముద్ద పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి.
-
తరువాత బంగాళాదుంప ముక్కలు, గంట సేపు నానిన కందిపప్పు పెసరపప్పు, బియ్యం, పసుపు, ఉప్పు వేసి బియ్యంలోని చెమ్మారి పోయే దాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
-
వేగిన బియ్యంలో ½ కప్పు బటానీ, 6 కప్పుల నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
-
ఉడికిన కిచిడీలో 2 కప్పుల నీళ్ళు పోసి బాగా ఉడుకుపట్టనిచ్చి దింపేసుకోవాలి.
-
తాలింపు కోసం నెయ్యి కరిగించి అందులో ఇంగువ ఎండుమిర్చి జీలకర్ర వేసి వేపి టొమాటో ముక్కలు వేసి టొమాటో మెత్తబడేదాక వేపుకోవాలి.
-
ఆఖరుగా స్టవ్ ఆపేసి తాలింపులో కారం వేసి కలిపి కిచిడీలో తాలింపు కలుపుకోవాలి. ఆ పైన కొత్తిమీర చల్లి కలిపి వేడిగా అప్పడాలతో సర్వ చేసుకోండి.

Leave a comment ×
1 comments