దాల్ ముడి మిక్స్చర్
ముడి మసూర్ కందిపప్పుని రాత్రంతా నానబెట్టి వేపి చేసే దాల్ ముడి టైంపాస్ చేయడానికి సాయంత్రం స్నాక్గా పర్ఫెక్టుగా ఉంటుంది. సన్న కారప్పూస వేపిన దాల్ ఉప్పు కారం జీలకర్ర పొడి కలిపి చేసే ఈ మిక్స్చర్ ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది.
ఉత్తర భారతదేశం వారు దాల్ మోత్/దాల్ ముడి అని పిలిచే దీన్ని తెలుగు వారు ఆగ్రా మిక్స్చర్ అంటారు. పేరు ఏదైనా చేసే తీరు ఒక్కటే! నిజానికి తెలుగు వారికి దక్షిణ భారత వారికి ఈ పప్పు ఉత్తర భారత దేశం వారికి దొరికినంత విరివిగా దొరకదు, తెలియదు కూడా. కానీ ఇప్పుడు ముడి కిచిడి పప్పు పేరుతో దొరికేస్తోంది.
రెసిపీ చేయడం చాలా తేలిక, నానబెట్టిన పప్పుని వేపి వేపుకున్న సన్న కారప్పూస కలపడమే!!! కానీ ఈ సింపుల్ రెసిపీకి పప్పు వెప్పేప్పుడు కారప్పూస కరకరలాడుతూ రావడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ ఎంతో అవసరం.
రెసిపీ చేసే ముందు కింద టిప్స్ ఒక్క సారి చుడండి.

టిప్స్
మసూర్ దాల్ :
కందిపప్పు ఫామిలీకె చెందినవే ఈ ముడి ఎర్ర కందిపప్పు. ఇవి సాధారణంగా పప్పు తీసి కిచిడి వాడతారు. చూడ్డానికి ఉలవలులా ఉంటాయి.
పప్పుని బాగా కడిగి రాత్రంతా లేదా కనీసం 10 గంటలు నానబెట్టుకోవాలి. నానినపప్పుని వడకట్టి 30 నిమిషాలు జల్లెడలో వేసి ఉంచాలి, అప్పుడు పప్పులోని నీరంతా దిగిపోతుంది, నూనెలో వేసినా చిట్లదు.
దాల్ వేపే తీరు:
పప్పు ఎర్రగా కారకరలాడేట్టు వేగడానికి సమయం పడుతుంది. కాబట్టి ముందు మీడియం ఫ్లేమ్ మీద పప్పు చిట్లేదాకా వేపుకుంటే పప్పు లోపలి దాకా వేగుతుంది ఆ తరువాత హై ఫ్లేమ్ మీద వేపితే పప్పు గుల్ల తిరిగి కరకరలాడుతూ వస్తుంది. ఈ టిప్స్ పాటించకపోతే కచ్చితంగా పప్పు మెత్తగా ఉంటుంది.
దాల్ ముడి మిక్స్చర్ - రెసిపీ వీడియో
Dal Mudi Mixture | Dal Moth
Prep Time 5 mins
Soaking Time 12 hrs
Cook Time 30 mins
Total Time 12 hrs 35 mins
కావాల్సిన పదార్ధాలు
- 1 cup మసూర్ దాల్
- నూనె - వేపుకోడానికి
- ఉప్పు
- 1/2 tsp బ్లాక్ సాల్ట్
- 3/4 tsp కారం
- 1/2 tsp జీలకర్ర పొడి
-
కారప్పూస కోసం
- 200 gms సెనగపిండి -
- 250 ml నీళ్లు
- ఉప్పు
- 2 చిటికెళ్ళు ఎల్లో కలర్ /పసుపు
విధానం
-
కారప్పూస కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి పిండిని మెత్తగా తడుపుకోవాలి.
-
మరిగే వేడి నూనెలో సన్న రంధ్రాలు ఉన్న మౌల్డ్లో పిండి పెట్టి వత్తి కారప్పూస ఎర్రగా వేపి తీసుకోవాలి.
-
రాత్రంతా నానిన పప్పుని వడకట్టి మరిగె వేడి నూనెలో కొద్దిగా వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద పప్పుని మగ్గనిచ్చి తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోవాలి.
-
వేపుకున్న పప్పులో వేపిన కారప్పూస నలిపి వేసుకోండి, ఇంకా ఉప్పు, బ్లాక్ సాల్ట్, కారం, జీలకర్ర పొడి వేసి కలిపి గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే కనీసం నెల పైన నిల్వ ఉంటాయి.

Leave a comment ×