డైమండ్ చిప్స్ | నమక్ పారే
సాయంత్రాలు వేడిగా టీ తాగుతున్నప్పుడు, లేదా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు పక్కనే ఉండాల్సిన స్నాక్ డైమండ్ చిప్స్. వీటినే నమక్ పారే అని కూడా అంటారు. తెలగు రాష్ట్రాలలో డీమోనడ చిప్స్ అంటుంటారు. పేరు ఎలా ఉన్నా అంతా ఒక్కటే తీరు. డైమండ్ చిప్స్ తినడం మొదలెడితే అలా తింటూనే ఉంటారు, కరకరలాడుతూ నోటికి కమ్మగా చాలా రుచిగా ఉంటాయ్.
నమక్ పారే\డైమండ్ చిప్స్ రెసిపీ చాలా సింపుల్ కానీ పిండిని కలిపి వత్తుకునే తీరు ఇంకా చిప్స్ వేపే తీరులో ఉంది. ఆ వివరాలన్నీ టిప్స్లో వివరంగా ఉన్నాయి చూడండి.

టిప్స్
పిండి:
-
నమక్ పారే | డైమండ్ చిప్స్ అంటే మైదా పిండే వాడి చేస్తారు. మైదా వద్దనుకుంటే గోధుమ పిండి వాడుకోవచ్చు.
-
పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండి నానిన తరువాత కాస్త మెత్తబడుతుంది కాబట్టి. ముందే మృదువుగా పిండి కలిపితే నానిన పిండి ఇంకా పలుచన అవుతుంది.
-
పిండిని ఎంత పలుచగా సాధ్యమైతే అంత పల్చగా వత్తుకోవాలి, అలా వత్తితేనే చిప్స్ రుచి.
-
పిండిని ఎక్కువ పొడి పిండి చల్లి పలుచగా వత్తుకోవాలి అప్పుడు చిప్స్ సులభంగా వచ్చేస్తాయ్
-
పలుచగా చిప్స్ వత్తాక కత్తితో పిండి కింది నుండి లాగితే చిప్స్ సులభంగా ఊడివచ్చేస్తాయ్
డాల్డా | నెయ్యి :
- నమక్ పారే మరింత కరకరలాడుతూ ఉండాలంటే కచ్చితంగా కొవ్వు ఎక్కువగా ఉండే డాల్డా అంత కంటే కాస్త తక్కువగా ఉండే నెయ్యి అయినా వాడితే మరింత గుల్లగా వస్తాయ్
వేపే తీరు:
- చిప్స్ వేడి నూనెలో కొన్ని వేసి హై ఫ్లేమ్ మీద లేత గోధుమ రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేపిన వెంటనే తీసి జల్లెడలో వేసి ఉంచాలి అప్పుడు చల్లారే కొద్దీ మరింత కరకరలాడుతుంటాయ్.
డైమండ్ చిప్స్ | నమక్ పారే - రెసిపీ వీడియో
Diamond Nimki | Crispy Nimki Tea Time Snacks Recipe | Namak Pare
Prep Time 1 min
Cook Time 25 mins
Resting Time 30 mins
Total Time 56 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 250 gms మైదా
- 1/4 cup బియ్యం పిండి
- 1 tsp వాము
- ఉప్పు
- 60 ml కరిగించిన డాల్డా / నెయ్యి
- నీళ్ళు తగినన్ని
- నూనె వేపుకోడానికి
విధానం
-
మైదా పిండిలో బియ్యం పిండి వాము ఉప్పు డాల్డా వేసి బాగా కలుపుకోవాలి.
-
తరువాత తగినన్ని నీళ్ళు పోసి పిండిని గట్టిగా కలుపుకోవాలి. తరువాత 30 నిమిషాలు రెస్ట్ ఇవాలి.
-
30 నిమిషాల తరువాత ఎక్కువ పొడి చల్లి పిండి ముద్దని సాధ్యమైనంత పలుచగా వత్తుకోవాలి.
-
వత్తుకున్నాక పైన మళ్ళీ కొంచెం పొడి పిండి చల్లి చిన్న డైమండ్స్లా కట్ చేసుకోండి. తరువాత చాకుతో డైమండ్స్ కింది నుండి లాగితే సులభంగా ఊడి వచ్చేస్తాయ్.
-
డైమండ్స్ ని జల్లెడలో వేసి నెమ్మదిగా జల్లిస్తే పొడి పిండి కిందికి దిగుతుంది దీని వల్ల డైమండ్స్ ఎర్ర బడవు.
-
డైమండ్స్ ని వేడి నూనె లో వేసి హై ఫ్లేమ్ మీద ఎర్రగా లేదా లేత గోధుమ రంగు వచ్చేదాకా వేపి తీసి జల్లెడలో వేసి 2-3 గంటలు వదిలేయండి.
-
3 గంటల తరువాత గాలి చోరని డబ్బాలో ఉంచుకోండి. 15 రోజులు తాజాగా ఉంటాయ్.

Leave a comment ×
2 comments