ఎగ్ కిచిడి | బెంగాలీ స్పెషల్ డిమెర్ ఖిచురి.

వినడానికి కాస్త కొట్తగా ఉండొచ్చేమో గాని తిణాదీనికి అమృతంలా ఉంటుంది బెంగాలీ స్పెషల్ డిమెర్ ఖిచురి. డిమెర్ అంటే గుడ్డు ఖిచురి అంటే కిచిడి అని బెంగాలీ భాషలో.

పెసరపప్పు బియ్యం ఆలూ గడ్డలు వేసి మెత్తగా ఉడికించి వేపిన కోడిగ్గుడుని గుభాళించే తాలింపులో కలిపి ఉడికించిన కిచిడిలో కలుపుకుంటే తిన్నకొద్దీ తినాలనిపించే ఎగ్ కిచిడి తయారు.

బెంగాలీలకి ఎన్నో రకాల కిచిడీలు ఉన్నాయ్ అన్నీ వేటికవే ప్రేత్యేకం!!! ఈ కిచిడి కూడా చాలా ప్రేత్యేకం. నిజానికి మొదటగా నేను ఈ కిచిడి గురించి విన్నప్పుడు ఏంటో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ, రుచి చూశాక లాగించేశా అంతే!!!

నిజంగా చెప్తున్నాను, కచ్చితంగా ఎవ్వరైనా తినాల్సిన దానికంటే ఎక్కువ తింటారు ఈ కిచిడి చేసిన రోజున అంత రుచిగా ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఎగ్ పులావు

కింద టిప్స్ ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ కిచిడిని ఆస్వాదించండి!!!

టిప్స్

పెసరపప్పు:

  1. పెసరపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోండి చాలు అంత కంటే అవసరం లేదు.

బియ్యం:

  1. బియ్యం కూడా సన్నని సెగ మీద కలుపుతూ రంగు మారే దాకా వేపుకుంటే చాలు.

గుడ్డు:

  1. గుడ్డుని బాగా బీట్ చేసి ఎక్కువ నూనెలో వేపితే ఆమ్లెట్ చక్కగా పొంగుతుంది. ఇంకా గుడ్డుని ఎక్కువగా వేపితే రబ్బరులా అయిపోతుంది అని గుర్తుంచుకోండి.

తాలింపు:

  1. కిచిడికి తాలింపు ఊపిరిలాంటిది, కాబట్టి నిదానంగా ఒక్కోటి వేసుకుంటూ ఎర్రగా వేపుకోండి తాలింపుని.

వేడి నీళ్లు:

  1. కిచిడి పెసరపప్పు కారణంగా చిక్కబడి ముద్దగా అవుతుంది చల్లారుతున్న కొద్దీ. అందుకే వేడి నీళ్లతో పలుచన చేసుకోండి

ఎగ్ కిచిడి | బెంగాలీ స్పెషల్ డిమెర్ ఖిచురి. - రెసిపీ వీడియో

Egg Kichidi | Egg Soya Khichidi | Bengali Style Dimer Khichuri

Bachelors Recipes | nonvegetarian
  • Prep Time 1 min
  • Cook Time 30 mins
  • Total Time 31 mins
  • Serves 7

కావాల్సిన పదార్ధాలు

  • కిచిడి కోసం:
  • 1 cup పెసరపప్పు
  • 1 cup బియ్యం
  • 1/2 tbsp పసుపు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 6 cups నీళ్లు
  • 1.5 cup వేడి నీళ్లు
  • 1/4 cup సోయా
  • 1 ఆలూ
  • 2 గుడ్లు
  • తాలింపు కోసం:
  • 8 tbsp నూనె
  • 5 ఎండుమిర్చి
  • 2 బిర్యానీ ఆకులు
  • 1/2 tbsp సోంపు
  • 1 tbsp జీలకర్ర
  • 11/2 tbsp అల్లం సన్నని తురుము
  • 3 పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1 fistful కొత్తిమీర

విధానం

  1. సొయా చంక్స్ని వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి . ఆలూ ని చెక్కు తీసి నాలుగు సగాలుగా కోసుకోండి
  2. పెసరపప్పుని బియ్యాన్ని ఒక్కోటి విడివిడిగా వేపుకుని తీసుకుని నీళ్లు పోసి కడగండి.
  3. కడిగిన పప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోండి, ఇంకా ఆలూ ఉప్పు పసుపు కొద్దిగా నూనె ఆరు కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ రానివ్వాలి
  4. స్టీమ్ పోయాక మెత్తగా ఉడికిన కిచిడీలోంచి ఆలూ ముక్కలు పక్కకు తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్లు పోసి అన్నని మెత్తగా మెదపండి
  5. రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి రెండు గుడ్లు బాగా బీట్ చేసి నూనె లో పోసేయండి పైన చిటికెడు ఉప్పు వేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. (గుడ్డుని మరీ ఎర్రగా వేపకండి)
  6. అదే మూకుడులో నూనే వేడి చేసి అందులో ఎండుమిర్చి బిర్యానీ ఆకులు సోంపు జీలకర్ర వేసి వేపుకోండి
  7. వేగిన తాలింపులో అల్లం పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోండి.
  8. తరువాత నీరు పిండేసి నానబెట్టుకున్న సోయా వేసి రెండు నిమిషాలు వేపుకోండి. వేగిన సోయాలో వేపుపుకున్న గుడ్డు వేసి 30 సెకన్లు టాస్ చేసి కిచిడిలో కలిపేసుకోండి.
  9. ఆఖరుగా చిన్న పిడికెడు కొత్తిమీర కిచిడీలోంచి పక్కకు తీసుకున్న ఆలూ ముక్కలు వేసి కలుపుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • S
    Sai SRI
    Recipe Rating:
    Super Sir nennu mi recipes chustannu prathii roju... Meru cheypinaa laddu recipe nennu cheysannu bagaa vachindhii ma family vallu bagundhiii anntuuu thinaruu.... Thank you so much sir.
  • S
    Sanjai
    Recipe Rating:
    Sir, Why don't you post Brown Rice recipes. Like Brown Rice Pulao, Kichidi etc.