హెల్తీ ఫ్రూట్ సలాడ్

ఈ సింపుల్ ఫ్రూట్ & నట్ సలాడ్ సలాడ్ అనుకోవచ్చు లేదా హెల్తీ డేసర్ట్ అని కూడా అనవచ్చు. తింటూనప్పుడు రకరకాల రుచులు ఒకేసారి నోటికంది భలేగా ఉంటుంది. కొన్ని తియ్యగా కొన్ని పుల్లగా చప్పగా ఉప్పగా క్రీమీగా ఇలా సహజమైన రుచూలు ఫ్లేవర్స్తో ఒక సరికొత్త అనుభూతి ఈ ఫ్రూట్ & నట సలాడ్ తినడం.

ఈ సింపుల్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ తినడానికి ఒక సమయం అవసరం లేదు. భోజనానికి ముందు భోజనానికి తరువాత లేదా బ్రేకఫాస్ట్గా, సాయంత్రాలు స్నాక్గా ఎప్పుడు ఎలా అయినా పర్ఫెక్ట్ రెసిపీ.

ఈ సింపుల్ ఫ్రూట్ & నట్ సలాడ్ ఒక సింపుల్ టేస్టీ డ్రెస్సింగ్తో ఇంకా రుచిగా ఉంటుంది. సాధారణంగా సలాడ్స్ రుచి అంతా వాటి డ్రెస్సింగ్ ఇంకా సలాడ్ తాజాదనంలో ఉంటుంది. అందుకే సలాడ్లో వాడే ప్రతీ పదార్ధం తాజాగా ఉంచడం అవసరం. కాబట్టి ఏ విధంగా చేస్తే సలాడ్ తాజాగా ఉంటుందో కూడా టిప్స్లో చాలా వివరంగా ఉంది చూడండి.

ఫ్రూట్ సలాడ్లు చాలా తీరుల్లో చేస్తారు , మనందరికీ బాగా తెలిసినది నచ్చినది ఫ్రూట్స్ ఇన్ కస్టర్డ్. ఆ ఫ్రూట్ కస్టర్డ్ నేను ఇది వరకే చేశాను చూడండి. ఈ సింపుల్ హెల్తీ టేస్టీ సలాడ్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో ఎన్నో టిప్స్తో ఉంది చూడండి.

Fruit & Nut Salad Recipe | Healthy Salad with fruit and nut

టిప్స్

ఫ్రూట్స్ క్రిస్పీగా క్రంచీగా ఉండడానికి:

  1. ఈ సాలాడ్లో వాడే ప్రతీ పదార్ధం తాజాగా చల్లగా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది సలాడ్

  2. ఆపిల్స్ లెట్యూస్ పైన్ఆపిల్స్ ఇంకా కొన్ని బెర్రీస్ ఇలాంటివి తరిగిన వెంటనే చల్లని ఐస్ నీళ్ళలో వేస్తే బిగుసుకుని తింటూనప్పుడు చాలా రుచిగా ఉంటుంది

  3. ఫ్రూట్స్ నీళ్ళలో 10 నిమిషాలు ఉంచి వెంటనే వడకట్టి జలలేడెలో వేస్తే నీరంతా దిగిపోతుంది. నీరు పూర్తిగా దిగిన తరువాతే సలాడ్ తయారు చేయాలి లేదంటే సలాడ్లోకి నీరు వదిలి చిక్కని డ్రెస్సింగ్ నీరుగా అయిపోతుంది.

  4. ఈ సాలాడ్లో నేను వేసిన ఫ్రూట్స్ కాదు మీకు నచ్చిన మరింకేదైనా ఫ్రూట్స్ కూడా వాడుకోవచ్చు. ఫ్రిజ్లోంచి తీసిన అరటి పండు వెంటనే తొక్క తీసి వాడితే సరిపోతుంది. నీళ్ళలో వేయనవసరం లేదు.

సలాడ్ డ్రెస్సింగ్:

  1. నేను క్రీమీ సాలాడ్ కోసం చల్లని ఫ్రెష్ క్రీమ్ వాడాను. మీరు వీగన్ అయితే కోకోనట్ క్రీమ్ వాడుకోవచ్చు.

  2. సలాడ్ డ్రెస్సింగ్ గ్రైండ్ చేసి ఫ్రిజ్లో ఉంచితే చక్కగా బిగుసుకుంటుంది. అప్పుడు చిక్కని క్రీమీ డ్రెస్సింగ్ వస్తుంది.

ఫ్రూట్స్ & నట్స్:

  1. ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్&నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. పుల్లని కాకుండా ఉంటే చాలు.

ఇంకా కొన్ని టిప్స్:

  1. సాలాడ్ ఎప్పుడు చేసిన వెంటనే తినేయాలి అప్పుడే అసలైన సాలాడ్ తాజాదనాన్ని ఆశ్వాదించగలుగుతారు.

  2. డ్రెస్సింగ్లో నచ్చితే పంచడారకి బదులు తేనె కూడా వాడుకోవచ్చు

Fruit & Nut Salad Recipe | Healthy Salad with fruit and nut

హెల్తీ ఫ్రూట్ సలాడ్ - రెసిపీ వీడియో

Fruit & Nut Salad Recipe | Healthy Salad with fruit and nut

Healthy Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Resting Time 10 mins
  • Total Time 15 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • డ్రెస్సింగ్ కోసం
  • 1/2 cup చల్లని ఫ్రెష్ క్రీమ్
  • 2 tsp పంచదార
  • 7- 8 నానబెట్టిన బాదాం
  • 1/2 tsp మిరియాల పొడి
  • ఉప్పు – చిటికెడు
  • సలాడ్ కోసం
  • 1 ఆపిల్
  • 1 cup పైనాపిల్ ముక్కలు
  • 1 cup కర్భూజా ముక్కలు
  • 20 ద్రాక్షా
  • 6 - 7 ఆరెంజ్
  • ఐస్ బర్గ్ లెట్టస్ – కొద్దిగా

విధానం

  1. ముందుగా సాలాడ డ్రెస్సింగ్ కోసం మిక్సీ జార్లో ఫరశ క్రీమ్, పంచదార, నానబెట్టిన బాదం, మిరియాల పొడి చిటికెడు ఉప్పు వేసి క్రీమ్లా పేస్ట్ చేసుకోవాలి.
  2. పేస్ట్లా చేసుకున్న డ్రస్సింగ్ని ఫ్రిజ్లో 30 నిమిషాలు ఉంచండి.
  3. ఒక గిన్నెలో ఐస్ ముక్కలు, ఫ్రీజలోని చల్లని నీరు పోసుకోండి. అందులో పంచదార నిమ్మరసం వేసి కలిపి పక్కనుంచుకోండి.
  4. గట్టిగా తాజాగా ఉన్న ఆపిల్ని ముక్కలుగా తరిగి నీళ్ళలో వేసుకోండి అలాగే పైనాపిల్, కర్బూజా కూడా.
  5. ఫ్రిజ్లోని చల్లని ద్రాక్షని ముక్కలుగా చేసుకోండి.
  6. పది నిమిషాల తరువాత ఆపిల్తో మిగిలిన ఫ్రూట్స్ని వడకట్టి పక్కనుంచుకోండి.
  7. మిక్సింగ్ బౌల్లో చల్లని దానిమ్మ గింజలు, ఆరెంజ్ ముక్కలు, ద్రాక్ష ముక్కలు, వాడకట్టుకున్న ఫ్రూట్స్, ఐసబర్గ్ లెట్టస్ ఇంకా చల్లని సలాడ్ డ్రెస్సింగ్ వేసి నెమ్మదిగా టాస్ చేయండి.
  8. పైన వాల్నట్స్, ఎండు ద్రాక్ష, నానబెట్టిన బాదాం ముక్కలు, ఖర్ఝూరం ముక్కలు వేసి వెంటనే సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Fruit & Nut Salad Recipe | Healthy Salad with fruit and nut