పాలక్ గార్లిక్ మష్రూమ్
పాలకూర వెల్లులి గుభాళింపుతో ఎంతో రుచిగా ఉండే స్పెషల్ రెసిపీ పాలక్ గార్లిక్ మష్రూంస్. చూడానికి పాలక్ పనీర్కి చిన్న మార్పులా అనిపిస్తుంది కానీ రుచి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రోటీ నాన్తో చాలా రుచిగా ఉంటుంది పాలక్ గార్లిక్ మష్రూమ్ కర్రీ.
పాలకూర తో ఎంతో ఫేమస్ అందరికీ నచ్చిన రెసిపీ అంటే అది పాలక పనీరే, ఈ పాలక్ గార్లిక్ మష్రూమ్ కర్రీ కూడా అంతే రుచితో ఉంటుంది.
నేను మొదటిసారి పాలక్ మష్రూమ్ కర్రీ హైవే మీద ఒక పంజాబీ ధాబాలో తిన్నాను, ఆ రోజు ఈ కర్రీతో పాటు దాల్ తడకా ప్లేట్లో సర్వ చేసుకుని నాన్తో తింటూనప్పుడు తడకాలో వెల్లులి పాలక్ కర్రీలోకి చేరి చాలా రుచిగా అనిపించింది. అప్పుడు పాలక్లో మష్రూమ్స్తో పాటు వెల్లులి ఫ్లేవర్తో కలిపి చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాతో చేసిన రెసిపీ ఇది.

టిప్స్
పాలకూర:
-
పాలకూర రంగు మారకుండా కూర ఆకు పచ్చగా ఉండాలంటే పాలకూర ఆకు మరిగే నీళ్ళలో వేసి ఒక పొంగురానిచ్చి వెంటనే తీసి చల్లని నీళ్ళలో వేస్తే ఆకు నల్లబడదు. ఇంకా ఆకు ఉడికెప్పుడు కొద్దిగా పంచదార వేస్తే కూడా ఆకు రంగు నిలిచి ఉంటుంది. మష్రూమ్స్ :
-
పుట్టగొడుగులు సగానికి కోసి రెండు ముక్కలు చేసుకుంటే చాలు. ఇంకా మరిగే నీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది, మిగిలినది కూరలో మగ్గిపోతుంది. వెంటనే తీసి చల్లని నీళ్ళలో ఉంచితే మరీ మెత్తగా ఉడకవు.
వెల్లులి :
- ఈ రెసిపీలో వెల్లులి దట్టించి వేస్తేనే పరిమళం రుచి. కానీ వెల్లులి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేగితే చెదవుతుంది కూర.
ఉప్పు కారం మసాలాలు:
- పాలకూర రెసిపీస్కి ఉప్పు తక్కువగానే పడుతుంది. కాబట్టి ఉప్పు కొద్దిగా వేసుకోండి. అవసరమైతే ఆఖరున కలుపుకోవచ్చు.
ఇంకొన్ని టిప్స్:
-
పాలకూర నూనె పైకి తేలేదాక నిదానంగా ఉడికితేనే రుచిగా ఉంటుంది, లేదంటే పసరు వాసనవస్తుంది.
-
నేను ఆఖరున ఫ్రెష్ క్రీమ్ వేశాను, నచ్చని వారు లేని వారు చిలికిన పెరుగు మష్రూమ్స్తో పాటు వేసి కలుపుకోవచ్చు.
పాలక్ గార్లిక్ మష్రూమ్ - రెసిపీ వీడియో
Garlic Palak Mushroom | Dabha Style Lasooni / Garlic Palak Mushroom Curry | Palak Mushroom Curry
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 250 gms పాలకూర ఆకు
- 3 పచ్చిమిర్చి
- ఉప్పు
- 1 tsp పంచదార
- 2 liters నీళ్ళు
-
కూర కోసం
- 200 gms మష్రూమ్స్
- 2 tbsp నూనె
- 2 ఎండు మిర్చి
- 1 tsp జీలకర్ర
- 2 tbsp వెల్లులి తరుగు (10 చిన్న వెల్లులి తరుగు)
- 1/4 cup ఉల్లిపాయ తరుగు
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- 1/2 tsp గరం మసాలా
- 1/2 tsp కారం
- 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
- 1 tsp కసూరి మేథి
- 2 tbsp ఫ్రెష్ క్రీమ్
- 125 ml నీళ్ళు
-
తాలింపు కోసం
- 1 tbsp నెయ్యి
- 2 ఎండు మిర్చి
- 1 tbsp వెల్లులి
విధానం
-
మరిగే నీళ్ళలో పాలకూర ఆకులు, పచ్చిమిర్చి ఉప్పు పంచదార వేసి ఒక పొంగురాగానే తీసి చల్లని నీళ్ళలో వేసి ఉంచండి.
-
మరో గిన్నెలో మరిగే నీళ్ళలో ఉప్పు మష్రూమ్స్ వేసి 2 నిమిషాలు ఉడికించి తీసి చల్లని నీళ్ళలో వేసి ఉంచండి.
-
పాన్లో నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి వేసి వేపి జీలకర్ర చిటచిట అనేదాక వేపుకోవాలి
-
వేగి జీలకర్రలో వెల్లులి తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకుని ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి
-
వేగిన ఉల్లిలో ఉప్పు, పసుపు వేసి వేపుకోవాలి తరువాత పాలకూర పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మగ్గించాలి
-
నూనె పైకి తేలాక కారం, గరం మసాలా, కసూరి మేథీ వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
-
నీళ్ళు పోసి ఒక పొంగు రానివ్వాలి. తరువాత మష్రూమ్స్ వేసి నూనె పైకి తెలనివ్వాలి
-
ఆఖరుగా క్రీమ్ వేసి కలిపి దింపేయండి
-
పాన్లో నెయ్యి కరిగించి ఎండుమిర్చి వెల్లులి తరుగు వేసి ఎర్రగా వేపి కూర పైన పోసుకోవాలి
-
ఈ పాలక్ మష్రూమ్స్ కర్రీ నాన్ రొటీలతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×