స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్

ఒక్క సారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్. చైనీస్ సాసుల సువాసన దేశీ మిరప ఘాటు కరివేపాకు గుబాళింపు కారకరాలేడే కాలీఫ్గ్లవర్ ముక్కలతో ఉండే ఈ సింపుల్ కాలీఫ్లవర్ రైస్ ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది.

నిజానికి నాకు ఇండో-చైనీస్ స్టైల్ ఫ్రైడ్ రైస్ కంటే స్ట్రీట్ ఫుడ్గా దొరికే మన ఫ్రైడ్ రైస్ ఎంతో ఇష్టం. మన రుచిని వదిలేసి ఏదో తింటున్నాం అనిపించదు, పైగా చైనీస్ సాసులతో మన మసాలాల కలయిక భలేగా ఉంటుంది.

ఈ గోబీ ఫ్రైడ్ రైస్ చాలా సులభం, నిజానికి అన్ని ఫ్రైడ్ రైసులు ఒకేలా ఉంటాయి చిన్న మార్పులతో. ఈ ఫ్రైడ్ రైస్ కూడా అంతే, కాకపోతే కరకరలాడే కాలీఫ్లవర్ ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాల రుచిగా ఉంటుంది.

రెసిపీ చేయడం చాలా తేలిక, కానీ కాలీఫ్లవర్ వేపడంలో కొన్ని టిప్స్ అవసరం ఆ టిప్స్ తెలిస్తే మిగిలిన ఫ్రైడ్ రైస్ల లాగే ఈ రెసిపీ కూడా. నిజానికి స్ట్రీట్ ఫుడ్ అంటే ఒక కచ్చితమైన పద్దతి ఏమి ఉండదు. ఇది నా పద్ధతి.

Gobi Fried Rice | Street Food Style Gobi Fried Rice

టిప్స్

కాలీఫ్లవర్:

  1. కాలీఫ్లవర్ కి ఇచ్చే కోటింగ్ కాస్త చిక్కగా గట్టిగా ఉండాలి అప్పడు కాలీఫ్లవర్ని కోటింగ్ పట్టుకుంటుంది

  2. కోటింగ్ ఇచ్చిన కాలీఫ్లవర్ బాగా వేడెక్కిన నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద 6-7 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు కాలీఫ్లవర్ లోపలి దాకా ఉడుకుతుంది, ఆ తరువాత కారకరలాడేట్టు వేగుతుంది. హై -ఫ్లేమ్ మీద వేపితే కాలీఫ్లవర్ లోపల పచ్చిగా ఉంటుంది.

  3. కాలీఫ్లవర్ కోటింగ్కి కాస్త కలర్ వాడను నచ్చని వారు వదిలేయండి.

ఇంకొన్ని టిప్స్:

  1. ఫ్రైడ్ రైస్ హాయ్ ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే ఫ్లేవర్ అని గుర్తుంచుకోండి

  2. నేను అజినొమొటో వాడాను మీ దగ్గర ఉంటె వేసుకోండి లేదంటే వదిలేయండి

స్ట్రీట్ ఫుడ్ స్టైల్ గోబీ ఫ్రైడ్ రైస్ - రెసిపీ వీడియో

Gobi Fried Rice | Street Food Style Gobi Fried Rice

Street Food | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 10 mins
  • Total Time 25 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • కాలీఫ్లవర్ ఫ్రై కోసం
  • 250 gms కాలీఫ్లవర్ ముక్కలు
  • ఉప్పు
  • 1 tsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 2 చిటికెళ్లు రెడ్ ఫుడ్ కలర్
  • కరివేపాకు తరుగు కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నీళ్లు చిక్కని పేస్ట్ కోసం
  • నూనె వేపుకోడానికి
  • ఫ్రైడ్ రైస్ కోసం
  • 1 tsp కారం
  • 3 tbsp నూనె
  • 2 ఎండు మిర్చి
  • 1 రెబ్బ కరివేపాకు
  • 2 tsp వెల్లులి తరుగు
  • 1/4 cup ఉల్లిపాయ తరుగు
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • 1 cup పొడి పొడిగా వండుకున్న అన్నం (185gm బియ్యం)
  • 1 tsp మిరియాల పొడి
  • ఉప్పు
  • 1/2 tsp అజినొమొటో
  • 1/2 tsp డార్క్ సోయా సాస్
  • 1 tsp నిమ్మరసం
  • 1 tsp వెనిగర్
  • ఉల్లికాడల తరుగు - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

విధానం

  1. కాలీఫ్లవర్ కోటింగ్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో చిక్కని ముద్ద చేసుకోండి.
  2. చిక్కని పేస్ట్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసి నెమ్మదిగా కోటింగ్ పట్టించండి
  3. కోట్ చేసుకున్న ముక్కలని మరిగె నూనెలో వేసి కేవలం మీడియం మంట మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే హాయ్ ఫ్లేమ్లోకి పెట్టి కారకరలాడేట్టు వేపుకుని తీసుకోవాలి (పర్ఫెక్ట్గా కాలీఫ్లవర్ ఎలా వేపాలి టిప్స్ చుడండి).
  4. నూనె వేడి చేసి అందులో ఎండుమిర్చి, కరివేపాకు వెల్లులి వేసి వేపుకోవాలి
  5. వేగిన వెల్లులిలో ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడేదాకా వేపుకోవాలి
  6. మెత్తబడిన ఉల్లిపాయలో అన్నం వేసి మిగిలిన సామానంతా వేసి హాయ్ ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి
  7. దింపే ముందు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి
  8. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

96 comments

Gobi Fried Rice | Street Food Style Gobi Fried Rice