పెసర బెల్లం కుడుములు
వినాయక చవితి అంటేనే ఎన్ని ప్రసాదాలో!!! అన్నీ రుచి, ఆరోగ్యంతో కూడుకుని ఉన్నవే. అలాంటిదే ఈ పెసర కుడుములు. విస్తారకులో చుట్టి ఆవిరి మీద ఉడికించే ఈ కుడుములు మామూలుగా కొబ్బరి బెల్లం పెట్టి చేసి చేసే కుడుముల కంటే ఎంతో రుచి ఆరోగ్యం!
గ్రామీణ ప్రాంతాలలో పసుపు ఆకులో చుట్టి ఆవిరి మీద ఉడికించి చేస్తారు ఈ కుడుములు. మేము చిన్నతనం నుండి విస్తరాకులో చుట్టి కుడుములు ఆవిరి మీద ఉడికిస్తాము. ఆకులో చుట్టి ఆవిరి మీద ఉడికిస్తే వచ్చే పరిమళం చాలా బాగుటుంది.
సాధారణంగా వినాయక చవితికి దక్షిణ భారత దేశం వారు బియ్యం పిండితో చేసే వాటిని ఎక్కువగా ప్రసాదంగా నివేదిస్తారు! వీటినే తెలుగు వారు కుడుములు అని తమిళ వారు కొలుకట్టయి అని అంటారు. అంతా ఒక్కటే కానీ లోపల స్టఫ్ఫింగ్ మార్పు అంతే!!!

టిప్స్
స్టఫ్ఫింగ్ :
-
ముడి పెసలు మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్ మీదే మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికితేనే పప్పు మెత్తగా ఉడుకుతుంది.
-
సాధారణంగా బెల్లం తురుము వేడి మీద కలిపితే ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. నేను మరింత రుచి కోసం బెల్లం కరిగి పూర్తిగా దగ్గర పడే దాకా కలుపుతూ ఉడికిచ్చాను దీనివల్ల చాలా రుచిగా ఉంటుంది స్టఫ్ఫింగ్.
-
స్టఫ్ఫింగ్ లో నేను కేవలం యాలకలపొడి మాత్రమే వేశాను పరిమళం కోసం, నచ్చితే దాల్చిన చెక్కపొడి జాజికాయ పొడి వేసినా చాలా రుచిగా ఉంటుంది.
పైపిండి:
-
పై పిండి మీడియం ఫ్లేమ్ మీద బియ్యం పిండి గట్టి ముద్ద అయ్యేదాక కలుపుతూ ఉడికించుకోవాలి.
-
నచ్చితే బ్రౌన్ రైస్ పిండి కూడా వాడుకోవచ్చు.
విస్తారకు:
-
ఉంటే విస్తరాకు లేదంటే అరటిఆకు కూడా వాడుకోవచ్చు. విస్తరకు పరిమళం చాలా బాగుంటుంది స్టీమ్ అయ్యాక. ఇంకా పసుపు ఆకులు, తమలపాకులు కూడా వాడుకోవచ్చు.
-
విస్తరాకు నీళ్ళలో ఒక నిమిషం ఉంచితే ఆకు మధ్యకి మాడిచినా చిరగదు
పెసర బెల్లం కుడుములు - రెసిపీ వీడియో
Green Gram Jaggery Rice Balls | Pesara Bellam Kudumulu | Sweet Kudumulu
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 12
కావాల్సిన పదార్ధాలు
-
స్టఫ్ఫింగ్ కోసం
- 1 cup ముడి పెసలు
- 3 1/4 cup నీళ్ళు
- 1 cup పచ్చి కొబ్బరి తురుము
- 1 cup బెల్లం తురుము
- 1 tsp యాలకపోడి
- 1 tsp నెయ్యి
-
పై పిండి కోసం
- 1 cup బియ్యం పిండి
- ఉప్పు – చిటికెడు
- నీళ్ళు – దోశల పిండి జారుకి సరిపడినంత
విధానం
-
పెసలని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి. మాచి సువాసన రాగానే నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద అయిదు కూతలు వచ్చేదాక ఉడికిస్తే మెత్తగా ఉడుకుతుంది.
-
ఉడికిన పప్పులో మిగిలిన పదార్ధాలు అన్నీ వేసి కలుపుతూ బెల్లం కరిగి ముద్దగా అయ్యేదాక ఉడికించండి.
-
బాగా దగ్గర పడిన ముద్దని తీసి పూర్తిగా చల్లారచాలి.
-
బియ్యం పిండిలో ఉప్పు నీళ్ళు పోసి జారుగా కలుపుకోవాలి.
-
కలుపుకున్న పిండిని గట్టి ముద్ద అయ్యేదాక కలుపుతూ దగ్గర పడానివ్వాలి. దగ్గర పడ్డాక పూర్తిగా చల్లారచాలి.
-
విస్తరి ఆకులని నీళ్ళలో ఒక నిమిషం ఉంచి తీసుకోండి.
-
ఆకు పైన బొట్టు నెయ్యి రాసి నిమ్మకాయ సైజు బియ్యం పిండి ముద్ద తీసి పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆకు మీద. పిండి మధ్య ఉసిరికాయంత పప్పు ముద్ద ఉంచి ఆకు ఒక అంచును పట్టి మడిచి అంచులని నెమ్మదిగా తట్టాలి.
-
తరువాత మిగిలిన ఆకుని మరో మడత వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద 4 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోవాలి.
-
వడ్డించే ముందు పైన నెయ్యి వేసి వడ్డించుకోవాలి.

Leave a comment ×