మునగాకు రైస్
మునగాకు ధనియాలు నువ్వులు ఎండుమిర్చి వేపి పొడి చేసి అన్నంతో కలిపి కమ్మని తాలింపు పెట్టి చేసే మునగాకు అన్నం నోటికి కమ్మగా పొట్టకి హాయిగా అనిపిస్తుంది.
రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం. మునగాకులోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయ్, డైయాబెటిక్స్ ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపు సమస్య ఉన్నా, విటమిన్స్ లోపాలున్నా తరచూ మునగాకు తినడం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మునగాకుని అన్నంలోకి పొడిగా, పప్పుగా, చారుగా, కూరగా కూటుగా, లేదా రోటీలలో వేసి తినొచ్చు. పొడిగా చేసి ఉంచుకుని కారం పొడులకి బదులుగా ఇడ్లీ అట్టులోకి మునగాకు పొడి కొద్దిగా నెయ్యి వేసి తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
ఈ సింపుల్ మునగాకు రైస్ లంచ్ బాక్సులకి ఇంకా అన్నం మిగిలిపోయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ మునగాకు రైస్ ఎంత తిన్నా పొట్టకి హాయిగా అనిపిస్తుంది.

టిప్స్
అన్నం:
తెల్ల అన్నానికి బదులుగా మీరు బ్రౌన్ రైస్ ఇంకా మిల్లెట్స్ కూడా వాడుకోవచ్చు.
మునగాకు పొడి:
-
మునగ ఆకులని కాడలు తీసేసి బాగా కడిగి నీడన ఆరబెట్టిన ఆకు వాడుకోవాలి.
-
నచ్చితే మీరు రెండు రెబ్బలు చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. లేదా ఆఖరున నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. ఇంకా పొడి గ్రైండింగ్ లో నచ్చితే ¼ త్స్ప్ బెల్లం కూడా వేసుకోవచ్చు.
-
మునగాకు పొడిలో నేను కారం కోసం కేవలం ఒకే ఒక ఎండు మిరపకాయ వాడాను. ఆఖరున మిరియాల పొడి తాలింపులో ఎండుమిర్చి వేసి కారాన్ని బాలన్స్ చేసాను. మీరు కావాలనుకుంటే ఎండుమిర్చి పెంచుకోండి.
-
మునగాకు పొడి ముందే చేసి ఉంచుకుని కూడా ఈ అన్నని తయారు చేసుకోవచ్చు.
తాలింపు:
తాలింపులో ఎండుమిర్చికి బదులు చల్ల మిరపకాయలు, జీడిపప్పు కి బదులు వేరుశెనగ గుళ్ళు వాడుకోండి.
మునగాకు రైస్ - రెసిపీ వీడియో
Healthy Drumstick Leaves Powder rice | Munagakau Rice
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
-
మునగాకు పొడి కోసం
- 1 tbsp ధనియాలు
- 1 tbsp నువ్వులు
- 1 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 5 వెల్లులి
- 50 gm మునగాకు
-
తాలింపు కోసం
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 2 ఎండుమిర్చి
- 1 tsp సెనగపప్పు
- 1 tsp మినపప్పు
- 10 జీడిపప్పు
- 4 దంచిన వెల్లులి
- ఉప్పు
- 1/4 cup పొడి పొడిగా వండుకున్న అన్నం (1 కప్ అంటే 185 గ్రాములు)
- 1 tsp మిరియాల పొడి
విధానం
-
మూకుడులో తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపుకోవాలి.
-
వేగిన పప్పులలో మునగాకు వేసి ఆకులోని చెమ్మ ఆరిపోయేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఆకులో చెమ్మ ఆరిన తరువాత వెల్లులి వేసి వేపుకోవాలి.
-
వేగిన పప్పులు ఆకు అన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి.
-
తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి ఎర్రగా వేపి ఉడికించిని అన్నం ఉప్పు మునగాకు పొడి వేసి హాయ్ ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవాలి.
-
దింపే ముందు మిరియాల పొడి వేసి టాస్ చేసి దింపేసుకోవాలి.

Leave a comment ×
4 comments