తాటి ముంజల పాయసం

తాటిముంజలని ముక్కలుగా చేసి పంచదార వేసి మరిగించిన పాలల్లో వేసి చల్లార్చి అందించే తమిళనాడు స్పెషల్ పాయసం రెసిపీ ఒక్క గ్లాసు తాగి ఆపితే ఒట్టు!!! నిజమండి అంత రుచి ఈ సింపుల్ తాటి ముంజలు పాయసం.

నేను కొన్ని నెలల క్రితం స్నేహితుడి పెళ్ళికి చెన్నై వెళ్ళాను అక్కడ వెల్కమ్ డ్రింక్గా ఈ నుంగు పాయసం అందించారు. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అక్కడ కేటరర్ని వివారాలు అడిగి తెలుసుకున్నాను. ఆ తరువాత మిగిలిన వారిని ఈ రెసిపీ గురుంచి అసలైన రెసిపీని తెలుసుకుని మీకు చెబుతున్నాను.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చసేమియాపాయసం

టిప్స్

తాటి ముంజలు:

  1. ఈ రెసిపీకి లేత తాటిముంజలు వాడుకుంటేనే రుచి. ముదిరిన తాటిముంజలు వాడితే రబ్బరుగా ఉంటాయి పాయసం అంత రుచిగా ఉండవు.

  2. తాటిముంజలు కోస్తున్నప్పుడు వచ్చే నీరు కూడా పాయసంలో కలుపుకోవచ్చు.

పాలు:

  1. తీసుకున్న పాలని సగం అయ్యేదాకా మరిగించుకోవాలి.

డ్రై ఫ్రూట్స్:

  1. ఏదో అక్కడక్కడా తగిలితే రుచిగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన డ్రై ఫ్యూస్ వేసుకోవచ్చు. నేను బాదాం వేశాను మీరు మరింకేదైనా వాడుకోవచ్చు.

తాటి ముంజల పాయసం - రెసిపీ వీడియో

Ice Apple Payasam | Taati Munjala Payasam

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 21 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 5 లేత తాటి ముంజలు
  • 750 ml పాలు
  • 1/4-1/3 Cup పంచదార
  • 2 Pinches యాలకల గింజల పొడి
  • 2 tbsp బాదం పలుకులు

విధానం

  1. పాలని రెండు పొంగులు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ రానివ్వాలి.
  2. పాలు పొంగిన తరువాత పంచదార వేసి కాస్త చిక్కబరచాలి. పాలు కాస్త చిక్కబడిన తరువాత దింపి చల్లార్చండి
  3. పాలు చల్లారేలోగా తాటిముంజల పైన చెక్కు తీసుకోండి. ఆ తరువాత చిన్న పల్లీ సైజు ముక్కలుగా కోసుకోండి.
  4. చల్లారిన పాలల్లో తరుక్కున్న తాటిముంజల ముక్కలు యాలకుల గింజల పొడి బాదం ముక్కలు వేసి కలిపి ఫ్రిడ్జ్లో కనీసం గంటసేపు ఐన ఉంచి సర్వ్ చేసుకోండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.