Sweets
5.0 AVERAGE
4 Comments

ఎర్రగా వేపిన సేమియా నానబెట్టిన సగ్గుబియ్యంని పంచదార పాకంలో ఉడికించి కాచిన పాలు పోసి చేసే సేమియా సగ్గుబియ్యం పాయసం ఏదో ఒక రెసిపీ కాదు భారతీయులకి ఎన్నో అనుభందాలు కలబోత!!!

పండుగకి, పుట్టిన రోజుకి లేదా త్వరగా అయిపోయే స్వీట్ చేద్దామనుకున్నా అందరికి వెంటనే గుర్తొచ్చే రెసిపీ సేమియా పాయసం! నిజానికి రెసిపీ చాలా సులభం కానీ వేసే కొలతలు చేసే తీరులో పొరపాట్ల వల్లే పాయసం చల్లారాక గట్టిగా ముద్దగా అయిపోతుంది.

నా తీరు సేమియా పాయసం మీకు ఎంతో రుచిగా ఉండటంతో పాటు చల్లారినా ముద్దగా అవ్వదు. ఈ సింపుల్ సేమియా పాయసం చేయడానికి ముందు కింద వివరంగా ఉన్న టిప్స్ని ఒక్కసారి చూసి చేస్తే ఏ పొరపాటు లేకుండా పక్కాగా కుదురుతుంది పాయసం.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుపనీర్ పాయసం

టిప్స్

సేమియా:

  1. సేమియాని నేతిలో లేత బంగారు రంగు వచ్చేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి, ఏ మాత్రం ఎక్కువగా వేపినా సేమియా చేదుగా అయిపోతుంది. మార్కెట్స్లో వేపిన సేమియా కూడా దొరుకుతుంది, అది నాకు నచ్చదు అందుకే వాడలేదు. మీకు నచ్చితే మీరు కొద్దిగా నెయ్యి ఒక నిమిషం వేపి తీసుకోండి.

పంచదార&పటికబెల్లం

  1. సేమియా పాయసం పంచదార వేసి కాచుకోవడం అందరికి తెలిసినదే, ఒక సారి కొంత పటికబెల్లం వేసి కాచి చుడండి, కచ్చితంగా నచ్చుతుంది మీకు. అందుబాటులో లేని వారు వదిలేయండి, ఉన్నప్పుడు వాడుకోండి.

సగ్గుబియ్యం:

  1. సగ్గుబియ్యం కనీసం అర గంటైనా నానితే మెత్తగా ఉడుకుతుంది.

ఉప్పు:

  1. పాయసం అంతా తయారై స్టవ్ ఆపేశాక ఒక్క చిన్న పలుకు ఉప్పు వేస్తే పాయసం తీపి మొహంమొత్తదు ఇంకా రుచిగా ఉంటుంది పాయసం.

డ్రై ఫ్రూట్స్:

  1. పాయసంలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేయలేదు, దానికి బదులు బాదాం వేశాను. మీరు నానబెట్టిన ఛిరొంజి కూడా వేసుకోవచ్చు.

పాలు:

  1. చిక్కని గేదె పాలతో చేసే పాయసం రుచి చాలా బాగుంటుందిపాలు మరిగేప్పుడు కొద్దిగా నీళ్లు కలిపితే పాలు అడుగుపట్టవు

సేమియాపాయసం - రెసిపీ వీడియో

Semiya Payasam | Vermicelli Kheer | How to make Semiya Payasam

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 30 mins
  • Cook Time 20 mins
  • Total Time 51 mins
  • Serves 8

కావాల్సిన పదార్ధాలు

  • 2 tbsp నెయ్యి
  • 1 Cup సేమియా
  • 1/4 Cup సగ్గుబియ్యం
  • 1 litre పాలు
  • 3/4 Cup పంచదార
  • 1/4 Cup పటికబెల్లం
  • 2 tbsp బాదం పలుకులు
  • 2 tbsp ఎండు ద్రాక్ష
  • 2 tbsp ఎండు ఖర్జూరం
  • 2 tbsp పిస్తా పలుకులు
  • 1/2 tbsp యాలకల పొడి
  • 1 1/4 litre నీళ్లు

విధానం

  1. నెయ్యిలో సేమియా వేసి ఎర్రగా వేపి తీసుకోండి
  2. మిగిలిన నెయ్యి వేసి ఖర్జూరం పిస్తా పలుకులు కాస్త వేపుకోండి. కొద్దిగా వేగిన ఖర్జూరంలో ద్రాక్ష, బాదాం పలుకులు వేసి ఎర్రగా వేపి వేపుకున్న సేమియాలో వేసుకోండి
  3. చిక్కని పాలల్లో పావు కప్పు నీళ్లు పోసి రెండు పొంగులు రానిచ్చి దింపేసుకోండి
  4. మిగిలిన లీటర్ నీళ్లు మరిగించి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా మరిగించాలి.
  5. సగ్గుబియ్యం రంగు మారాక పంచదార పటికబెల్లం యాలకుల పొడి వేసి మరించండి
  6. పంచదార కరిగాక వేపుకున్న సేమియా డ్రై ఫ్రూట్స్ వేసి 2 నిమిషాలు మరిగించుకోండి
  7. రెండు నిమిషాలకి సేమియా కాస్త మెత్తబడుతుంది అప్పుడు స్టవ్ ఆపేసి కాచుకుని ఉంచుకున్న పాలు పోసి కలుపుకోండి, ఇంకా నచ్చితే చిన్న ఉప్పు పలుకు వేసి కలుపుకోండి. ఈ తీరులో చేసే పాయసం మీకు గట్టిపడదు, ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • N
    Nanda Kishore
    If you say its a cup of vermicelli , can you please tell the dimensions of the cup ? how big a cup is it ?
  • K
    Kalpana
    Recipe Rating:
    Ya I really like this method ..every time I prepared like this ...thank you so much for ur videos...and the way of ur explaing is amazing.
    • N
      Nanda Kishore
      If you say its a cup of vermicelli , can you please tell the dimensions of the cup ? how big a cup is it ?