ఇన్స్టంట్ నూడుల్స్ ఇన్ వైట్ సాస్

ఇన్స్టంట్ నూడుల్స్ని ఇటాలియన్ సాసులతో క్రీమీగా చేసిన రెసిపీ నూడుల్స్ ఇన్ వైట్ సాస్. ఎప్పుడు చేసినా అందరూ ఎంతో ఇష్టంగా తినే రెసిపీ నూడుల్స్ ఇన్ వైట్ సాస్.

ఇష్టంగా తినేదే అయినా ఎప్పుడూ ఒకేలా తింటే బొరుగా అనిపిస్తుంది నాకు అందుకే ఇన్స్టంట్ నూడుల్స్తో ఈ రెసిపీ చేశాను. ఈ రెసిపీలో ప్రేత్యేకంగా సృష్టించింది ఏమి లేదు, వైట్ సాస్ పాస్తా సాస్లో పాస్తాకి బదులు ఇన్స్టంట్ నూడుల్స్ వాడాను అంతే. కానీ పాస్తాకి బదులు ఇన్స్టంట్ నూడుల్స్ వాడినప్పుడు కొన్ని టిప్స్ అవసరం అవి పాటిస్తూ చేస్తే ఇన్స్టంట్గా నూడుల్స్తో ఇది చేసుకోవచ్చు.

Instant Noodles in White Sauce | White sauce Maggi noodles

టిప్స్

నూడుల్స్:

  1. ఇన్స్టంట్ నూడుల్స్ ఏవైనా వాడుకోవచ్చు.

  2. నూడుల్స్ ని మరీ ఎక్కువగా మెత్తగా ఉడికించ కూడదు.

  3. నూడుల్స్ సాసులో వేసేప్పుడు నూడుల్స్ వేడిగా ఉండాలి. లేదంటే సాసులు నూడుల్స్కి అస్సలు పట్టవు

వైట్ సాస్:

  1. వైట్ సాస్ ఎంత క్రీమీగా ఉంటే అంత రుచిగా ఉంటుంది.

  2. వైట్ సాస్లో నేను వేసినవే కాదు మీకు నచ్చిన ఇంకెవైన వెజ్జీస్ వేసుకోవచ్చు. మష్రూమ్, బ్రొకోలీ, ఆలీవ్స్ ఇలా ఏవైనా

  3. వెజ్జీస్ ఏవైనా 60-70% వేగితే చాలు బటర్లో, మిగిలినవి పాలల్లో ఉడుకుతాయ్.

  4. సాస్లో మైదా వేగి మాంచి సువాసన వచ్చి రాగానే, పాలు పోసి చిక్కబడనివ్వాలి. మైదాకి బదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు.

  5. సాస్ కాస్త పలుచగా ఉండగానే నూడుల్స్ వేసి కుక్ చేసుకోవాలి.

  6. వైట్ సాస్లో ఫ్రెష్ క్రీమ్ చీస్ వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. లేనప్పడు వదిలేయండి.

  7. ఈ నూడుల్స్ వేడి వేడిగా తింటేనే రుచి. ఏ కారణం చేతనైనా నూడుల్స్ చిక్కబడితే కాసిని కాచిన పాలు నూడుల్స్లో పోసి ఉడికించి పలుచన చేసుకోవచ్చు.

ఇన్స్టంట్ నూడుల్స్ ఇన్ వైట్ సాస్ - రెసిపీ వీడియో

Instant Noodles in White Sauce | White sauce Maggi noodles

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 2

కావాల్సిన పదార్ధాలు

  • నూడుల్స్ వండుకోడానికి
  • 2 Pack ఇన్స్టంట్ నూడుల్స్
  • 1 నూడుల్స్ మేకర్
  • 1.5 cup నీళ్ళు
  • వైట్ సాస్ కోసం
  • 1 tsp బటర్
  • 1/2 tsp ఆలివ్ నూనె
  • 1 tsp వెల్లులి
  • 7 - 8 Pieces రెడ్ కాప్సికం
  • 7 - 8 Pieces ఎల్లో కాప్సికం
  • 7 -8 Pieces గ్రీన్ కాప్సికం
  • 7 - 8 Pieces కేరట్ ముక్కలు
  • 2 tsp ఫ్రొజెన్ బటానీ
  • 2 tsp ఫ్రొజెన్ కార్న్
  • 1 tsp మైదా
  • 3/4 cup పాలు
  • ఉప్పు – కొద్దిగా
  • 1/2 tsp పిజ్జా సీసనింగ్
  • 1/4 tsp మిరియాల పొడి
  • 1/2 tsp చిల్లీ ఫ్లేక్స్
  • 1 tbsp ఫ్రెష్ క్రీమ్

విధానం

  1. మరిగే నీళ్ళలో ఇన్స్టంట్ నూడుల్స్ నూడుల్స్తో పాటు వచ్చే నూడుల్స్ టేస్ట్ మేకర్ వేసి ఉడికించి తీసి పక్కనుంచుకోవాలి. నూడుల్స్ ఉడుకుతుండగానే సాస్ కోసం మొదలెట్టుకోవాలి.
  2. పాన్లో బటర్ ఆలివ్ నూనె వేసి కరిగించాలి. బటర్ కరుగుతుండగా వెల్లులి వేసి లేత బంగారు రంగు వచ్చేదాక ఫ్రై చేసుకోవాలి.
  3. వెల్లులి వేగిన తరువాత మిగిలిన కూరగాయ ముక్కలు అన్నే వేసి హై ఫ్లేమ్ 3-4 నిమిషాలు వేపుకోవాలి.
  4. వేగిన కూరగాయాల్లో మైదా వేసి వేపుకోవాలి. మైదా వేగి నురగ వస్తుండగా పాలు పోసి ఒక పొంగు రానివ్వాలి.
  5. పాలు పొంగాక మిగిలిన స్పైసెస్ అన్నీ వేసి కాస్త చిక్కబడనివ్వాలి.
  6. ఉడికిన వేడి నూడుల్స్ సాస్లో వేసి కలిపి ఒక నిమిషం ఉడికించుకోవాలి. దింపే ముందు ఫ్రెష్ క్రీమ్ ఉంటే కాస్త చీస్ తురిమి వేసుకుని వేడి వేడిగా సర్వ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Instant Noodles in White Sauce | White sauce Maggi noodles