ప్రతీ రోజూ రాత్రి రేపు టిఫిన్కి ఏంటి? అనే ప్రశ్నతోనే పడుకుంటారు. అలాంటప్పుడు ఈ టమాటో ఓట్స్ గుర్తొస్తే చాలు 10 నిమిషాల్లో ముగ్గురికి సరిపోయే టమాటో మసాలా ఓట్స్ తయారు!

ఈ ఓట్స్ పుల్లపుల్లగా కారంగా ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. పాలల్లో ఉడికించి బోరింగ్ ఓట్స్ తినలేనప్పుడు ఈ టమాటో ఓట్స్ బెస్ట్ చాయిస్ అవుతుంది. ఈ ఓట్స్ పిల్లల లంచ్ బాక్సులకి, డైటింగ్లోని వారికి చాలా హెల్ప్ అవుతుంది.

నాకు ఈ రెసిపీ చాలా ఇష్టం. నేను మా ఇంట్లో లైట్గా ఏదైనా డిన్నర్కి తినాలనిపించినా, నోరు బాగాలేనప్పుడైనా ఈ టమాటో ఓట్స్ చేసేస్తుంటాను.

మసాలా ఘుమఘుమలతో అందరికీ నచ్చేలా ఉంటుంది. నేను ఈ రెసిపీ చాలా సింపుల్గా తక్కువ పదార్ధాలు వాడు చేశాను, కాబట్టి బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. నచ్చితే ఇంకే విధానాలతో చేసుకోవచ్చో వివరంగా కింద టిప్స్లో ఉంచాను చుడండి.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఓట్స్ మసాలా వడ

టిప్స్

టమాటో:

  1. పుల్లనివి బాగా పండిన టమాటో అయితే రుచి చాలా బాగుంటుంది. టమాటో పుల్లగా లేనట్లయితే ఆఖరున కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు.

ఇంకొన్ని విషయాలు:

  1. ఈ ఓట్స్ వేడి వేడిగా తినాలనుకుంటే చిక్కగా దగ్గరగా ఉడికించుకోండి. అదే లంచ్ బాక్సులకి అయితే మాత్రం కాస్త పలుచగా చేసుకోండి లేదంటే గట్టిగా ముద్దగా అయిపోతుంది.

ఇంకొన్ని తీరులు:

  1. ఒక రోజు నేను చేసిన సింపుల్ తీరులో చేసుకోండి. ఇంకో రోజు ఉల్లిపాయ మగ్గిన తరువాత కేరట్ స్వీట్ కార్న్ వేసి మెత్తగా ఉడికించి టమాటో ముక్కలు వేసి చేసుకోవచ్చు

  2. నేను ఆఖరున కొద్దిగా మిరియాల పొడి గరం మసాలా వేసాను, మీరు వీటికి బదులు సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది.

  3. లేదా కుక్కర్లో కందిపప్పు టమాటో ముక్కలు ఉప్పు కారం ఇంగువా అన్ని వేసి మెత్తగా ఉడికించి, ఉడికించిన ఓట్స్లో చింతపండు పులుసు కొద్దిగా రసం పొడి పసుపు వేసి ఉడికించండి. తరువాత మెత్తగా ఉడికిన పప్పు చారు పొడి కరివేపాకు కాసిని నీళ్లు పోసి మరిగిస్తే ఓట్స్ రసం రైస్ అవుతుంది. ఇంకా పరిమళం కావాలనుకునే వారు నెయ్యి తాలింపు పెట్టుకోవచ్చు ఆఖరున.

టమాటో ఓట్స్ - రెసిపీ వీడియో

Instant Tomato Masala Oats | Masala Oats | How to make Instant Tomato Masala Oats with Tips

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 10 mins
  • Total Time 11 mins
  • serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 tbsp నూనె
  • 3 టమాటో (ముక్కలు)
  • 1 ఉల్లిపాయ (సన్నని తరుగు)
  • 2 Twing కరివేపాకు
  • 1 Cup వేపుకున్న ఓట్స్
  • 250-300 ml నీళ్లు
  • ఉప్పు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tbsp కారం
  • 1/4 tbsp పసుపు
  • 1/4 tbsp మిరియాల పొడి
  • 1/4 tbsp గరం మాసాలా
  • కొత్తిమీర (చిన్న కట్ట)

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ సన్నని తరుగు కరివేపాకు వేసి ఉల్లిపాయ రంగు మారే దాకా వేపుకోండి
  2. ఉల్లిపాయ మెత్తబడిన తరువాత ఉప్పు పసుపు అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి
  3. వేగిన అల్లం వెల్లులి పేస్ట్ లో పండిన టమాటో ముక్కలు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా ఉడికించుకోవాలి
  4. మగ్గిన టొమాటోలో నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. బాగా మరుతున్న ఎసరులో కారం ఓట్స్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి
  5. తరువాత ఓట్స్ని మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడనివ్వాలి. (ఓట్స్ని ఎలా వండుకోవాలో ఒక్క సారి టిప్స్ చుడండి) దింపే ముందు మిరియాల పొడి, గరం మసాలా కొత్తిమీర తరుగు చాలి దింపేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.