కర్ణాటక స్పెషల్ కేబేజీ కుర్మా | కర్ణాటక స్పెషల్ కేబేజీ సాగు

కుర్మా అంటే ఘాటుగా ఎక్కువెక్కువ నూనె మసాలాలు ఉండవసరం లేదు నోటికి కమ్మగా పొట్టకి హాయినిచ్చేవి కూడా బెస్ట్గా ఉంటాయి అనిపించే గొప్ప రెసిపీ కర్ణాటక స్పెషల్ కేబేజీ కుర్మా లేదా కేబేజీ సాగు. సాగు అంటే కూర అని కన్నడంలో.

ఈ కేబేజీ సాగు అన్నంతో కంటే పూరి చపాతీ, పరోటాలతో చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి కమ్మదనం మితంగా వేసే మసాలాలు కారం కుర్మకి గొప్ప రుచిని చేకూరుస్తాయి.

ఈ సాగు నేను బెంగళూరులోని ఫ్రెండ్ వాళ్ళింట్లో తిన్నాను, అప్పుడు వారిని ఈ రెసిపీ వివరాలు అడిగి తెలుసుకుని హైదరాబాద్ వచ్చాక మా ఇంట్లో చేసుకోవడం మొదలైంది. మా కుటుంబం ఫెవరెట్ రెసిపీ ఇది.

ఆఖరుగా ఒక్క మాట… కేబేజీ అంటే ఇష్టంలేని వారు కూడా ఈ కూర చేసిన రోజున వేళ్ళు జుర్రుకుని తింటారు. ఇది మా ఇంట్లో, మా స్నేహితుల ఇళ్లలో జరిగిన విషయం చెబుతున్నాను.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చ బొప్పాయి క్యాబేజీ సలాడ్

టిప్స్

ఈ కూరకి కొన్ని టిప్స్:

  1. ఈ కూర|సాగు రుచంతా మసాలాలు మితంగా వేయడంలోనే ఉంది. ఈ కుర్మా కమ్మగా ఉంటుంది. ఇంకా కొందరు కన్నడిగులు ఆఖరున కాస్త పంచదార కూడా వేస్తారు అంటే అర్ధం చేసుకోండి, ఈ కుర్మా ఎంత కమ్మగా ఉంటుందో, ఉండాలో.

కేబేజీ:

  1. సన్నని కేబేజీ తరుగు ఉంటె బాగుంటుంది. పెద్ద ముక్కాల తరుగు కంటే.
    ఇంకా వీటితో కూడా చేసుకోవచ్చు:
  2. ఉప్పేసిన నీళ్లలో ఉడికించిన కాలిఫ్లవర్, బీన్స్, ఆలుగడ్డతో కూడా చేసుకోవచ్చు.

కర్ణాటక స్పెషల్ కేబేజీ కుర్మా | కర్ణాటక స్పెషల్ కేబేజీ సాగు - రెసిపీ వీడియో

Karnataka special Cabbage Kurma|Cabbage Saagu | Cabbage Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం:
  • 1 Cup పచ్చి కొబ్బరి తురుము
  • 2 tbsp పుట్నాల పప్పు
  • 2 tbsp జీడిపప్పు
  • 3 పచ్చిమిర్చి
  • 1 Inch దాల్చిన చెక్క
  • 6. నీళ్లు మెత్తగా గ్రైండ్ చేసుకోడానికి
  • కుర్మా|సాగు కోసం:
  • 350 gms కేబేజీ
  • 3 tbsp నూనె
  • 1 tbsp జీలకర్ర
  • 2 Sprigs కరివేపాకు
  • 1 Cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 Cup టమాటో
  • 1/250 Cup/ml నీళ్లు
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 1/2 tbsp గరం మసాలా
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్

విధానం

  1. మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి నీలత్తో మెత్తని పేస్ట్ చేసుకోండి
  2. నూనె వేడి చేసి జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోవాలి. వేగిన తాలింపులో ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి
  3. ఉల్లిపాయలు మగ్గిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు వేసి మెత్తబడే దాకా వేపుకోవాలి.
  4. టమాటో గుజ్జుగా అయ్యాక మసాలా పేస్ట్ కొద్దిగా నీళ్లు పోసి కలిపి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి
  5. తరువాత కేబేజీ సన్నని తరుగు ఉప్పు వేసి కలిపి మరో ½ కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు లేదా కేబేజీ మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి.
  6. క్యాబేజీ మెత్తగా ఉడికిన తరువాత గరం మసాలా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments