కేరళ స్టైల్ గుడ్డు కూర

Curries
5.0 AVERAGE
1 Comments

ఉప్పు కారాలు తక్కువగా కమ్మని కొబ్బరి పాల గ్రేవీతో చపాతీ, ఆపం, ఇడ్లీ దోశా, అన్నంతో ఎంతో రుచిగా ఉండే కేరళ స్టైల్ గుడ్డు కూర ఒక సూపర్ హిట్ రెసిపీ.

గుడ్డు కూరలు చాలా ఉంటాయి, నేను కూడా చాలానే పోస్టు చేశాను, కానీ కేరళ తీరు కాస్త భిన్నం, నాకు చాలా ఇష్టం. వేపిన ఉల్లిపాయ పచ్చిమిర్చిలో కొబ్బరి పాలు గుడ్డు వేసి ఉడికించి అతి సులభమైన రెసిపీ.

చూడ్డానికి తెలిసిన రెసిపీలానే అనిపిస్తుంది కానీ ఉప్పు కారాలా మోతాదు మీకు తగినట్లుగా కాక కేరళ వారి తీరులో వేస్తే కొత్త రుచిని ఆస్వాదించగలుగుతారు!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఎగ్ పులావు

టిప్స్

పలుచని కొబ్బరి పాలు ఎలా తీయాలి (సెకండ్ ఎక్స్ట్రాక్ట్)

  1. పచ్చికొబ్బరి లో కాసిని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి బట్టలో వేసి పిండితే వచ్చేవే చిక్కని కొబ్బరి పాలు. ఆ తరువాత ఎక్కువ నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేసి గట్టిగా బట్టలో వేసి పిండితే వచ్చేవే సెకండ్ ఎక్స్ట్రాక్ట్ లేదా పలుచని కొబ్బరి పాలు.

  2. ఈ పాలు మీరు తాజా కొబ్బరికాయ నుండి చేసుకోవచ్చు లేదా రెడీమేడ్ కొబ్బరి పాలు వాడుకోవచ్చు. రెడీమెడ్ ప్యాకెట్ వాడితే అరా కప్పు కొబ్బరి పాలల్లో కప్పు నీళ్లు పోసుకుంటే పలుచని కొబ్బరి పాలు వస్తాయ్.

చిక్కని కొబ్బరి పాలు:

  1. చిక్కని కొబ్బరి పాలు ఆఖరున కూరలో పోసి కలిపి స్టవ్ ఆపేయాలి. లేదంటే పాలు విరిగిపోతాయి. కొబ్బరి పాలు విరగడం అంటే నూనె వదలడం. కూరంతా నూనె నూనెగా అయిపోతుంది, తినలేరు.

సోంపు:

  1. ఈ గుడ్డు కూరలో సోంపు చాలా మాంచి పరిమళాన్నిస్తుంది, తప్పక వేసుకోండి.

ఉప్పు కారం:

  1. ఉప్పు కారాలు మితంగానే ఉంటాయి. ఈ కూర మసాలా కూర కాదు కాబట్టి మితంగానే వేసుకోండి

గుడ్డు:

  1. ఉడికించిన గుడ్డును సగానికి కోసి పలుచని పాలల్లో వేశాక ఎక్కువగా కదపకండి, గుడ్డు చిదిరిపోతుంది.

కొబ్బరి నూనె:

  1. కేరళ వంటకాలు కొబ్బరి నూనెతోనే ఉంటాయి. కొబ్బరి నూనె కూరకి చాలా మాంచి రుచిని పరిమళాన్నిస్తుంది. నచ్చని వారు మీకు నచ్చిన నూనె ఏదైనా వేసుకోవచ్చు.

కేరళ స్టైల్ గుడ్డు కూర - రెసిపీ వీడియో

Kerala Style Egg Curry | Egg Curry

Curries | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 2 tbsp కొబ్బరి నూనె
  • 1/2 tbsp ఆవాలు
  • 3 Sprigs కరివేపాకు
  • 3 ఉల్లిపాయ (సన్నని చీలికలు)
  • 2 పచ్చిమిర్చి (చీలికలు)
  • 2 టమాటో (ముక్కలు)
  • ఉప్పు (రుచి ప్రకారం)
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp కారం
  • 1/4 tbsp గరం మసాలా
  • 1/4 tbsp సోంపు పొడి
  • 1 Cup పలుచని కొబ్బరి పాలు
  • 1/2 Cup చిక్కని కొబ్బరి పాలు
  • 3 ఉడికించి సగానికి కట్ చేసిన గుడ్లు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ఆవాలు కరివేపాకు వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి
  2. వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు పచ్చిమిర్చి చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి
  3. వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మేతగా గుజ్జుగా అయ్యేదాకా మగ్గనివ్వాలి
  4. మగ్గిన టొమాటోలో ధనియాల పొడి కారం గరం మసాలా సోంపు పొడి కొద్దిగా నీళ్లు పోసి మసాలాలు మాడకుండా వేపుకోవాలి
  5. వేగిన మసాలాల్లో కొబ్బరి పాలు పోసి 2 పొంగులు రానివ్వాలిపొంగిన పాలల్లో ఉడికించి మధ్యకి కోసిన గుడ్లు పెట్టి నెమ్మదిగా కలుపుకోవాలి.
  6. ఆఖరుగా స్టవ్ ఆపేసి చిక్కని కొబ్బరి పాలు కొద్దిగా కరివేపాకు తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Due to coconut milk and coconut oil, I missed something in taste. Next time I try with originals to get its authenticated taste. But still the taste is good.