మలబార్ స్పెషల్ అవల్ మిల్క్
వేపిన అటుకులు మెదిపిన అరటిపండు పంచదార పాలు కలిపి గ్లాస్లో పోసి పైన వేపిన పల్లీలు జీడీపప్పు వేసి చల్లగా అందించే మలబార్ స్పెషల్ అవల్ మిల్క్ సమ్మర్స్లో పర్ఫెక్ట్!!!
చల్లని పాలల్లో తియ్యటి అరటిపండ్లు నానిన అటుకులు అక్కడక్కడా తగిలే వేపిన వేరుసెనగ గుండ్లతో ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్క గ్లాస్ తాగితే చాలు పొట్ట నిండిపోతుంది.
సాధారణంగా బననా మిల్క్ షేక్ మనందరికీ తెలుసు, ఈ అవల్ మిల్క్ కూడా దాదాపుగా అదే తీరు కానీ కేరళ వారి ట్విస్ట్తో ఉంటుంది. ఈ సింపుల్ డ్రింక్ మీకు కేరళ మలబార్ వైపు ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆర్డర్ చేసిన వెంటనే అప్పటికప్పుడు తయారు చేసి ఇస్తారు.
ఈ అవల్ మిల్క్ రెండు రకాలుగా చేస్తారు. కేవలం అవల్ మిల్క్ మీద హార్లిక్స్ జీడిపప్పు వేసి ఇస్తే 25 రూపాయలు ఇంకా పైన వెనీలా ఐస్క్రీమ్ పెట్టిస్తే 45 రూపాయలు. మీరు కూడా మీకు నచ్చిన విధంగా టాపింగ్స్ మార్చుకుని ఆశ్వాదించొచ్చు.
మీరు కూడా ఈ రెసిపీని ఇష్టపడవచ్చుబాదం షేక్

టిప్స్
అటుకులు:
- కేరళలో ఎర్ర అటుకులు వాడతారు, నాకు అవి దొఅరకలేదు కాబట్టి తెల్ల మందపాటి అటుకులు వాడాను.
- అటుకులు సన్నని సెగ మీద కలుపుతూ వేపుకుంటే మాడవు, ఇంకా కరకరలాడుతూ వేగుతాయ్.
అరటిపండ్లు:
- ఏ అరటి పండైనా వాడుకోవచ్చు. నాటువి తియ్యటి వంగడం అరటిపండు ఏది వాడుకున్నా రుచిగానే ఉంటుంది.
పప్పు గుత్తితో ఎనుపుకొవాలి:
- అరటిపండ్లని పప్పుగుత్తితో ఎనిపితే సగం పైన గుజ్జుగా ఇంక ఇంకొంచెం ముక్కలుగా తగులుతూ ఉంటుంది. అదే అవల్ మిల్క్లో రుచిగా ఉంటుంది
పాలు:
- కాచి చల్లార్చి ఫ్రిజ్లో ఉంచిన చల్లని పాలనే వాడుకోవాలి. కేరళలో అయితే గడ్డ కట్టిన పాలని కూడా వాడతారు.
వేరుశెనగగుండ్లు:
- వేరు సెనగగుండ్లని సన్నని సెగ మీద కలుపుతూ వేపుకుంటే గింజల మీద మచ్చలు ఏర్పడకుండా వేగుతాయ్.
సర్వ్ చేసే విధానం:
- పాలల్లో అటుకులు కలిపి ఆవెంటనే సర్వ్ చేసేసుకోవాలి. లేదంటే అటుకులు మెత్తబడిపోతాయ్. అటుకులు సగం మెత్తగా ఇంకొంచెం కరకరలాడుతూ ఉండాలి.
మలబార్ స్పెషల్ అవల్ మిల్క్ - రెసిపీ వీడియో
Malabar Special Aval Milk | Kerala special Atukula Banana Shake
Prep Time 1 min
Cook Time 15 mins
Total Time 16 mins
Serves 3
కావాల్సిన పదార్ధాలు
- 1/2 Cup మందపాటి అటుకులు
- 1/2 litre చల్లని పాలు
- 4 అరటిపండ్లు
- 4 tbsp పంచదార
- 1/4 cup వేరుశెనగగుండ్లు
- 1 tbsp జీడిపప్పు
- 1 tbsp హార్లిక్స్| బూస్ట్ | బోర్నవిటా
- 1/2 tbsp Tutti Fruiti
విధానం
-
అతుకులని సన్నని సెగమీద కారకరలాడేట్టు కలుపుతూ వేపుకోవాలి . వేగిన అటుకులని తీసి పక్కనుంచుకొంది
-
అరటిపండ్లలో పంచదార వేసి ఎనుపుకోండి. ఎనుపుకున్న అరటిపండ్లలో పాలు పోసి కలుపుకోండి
-
పాలు కలుపుకున్నాక వేపుకున్న అటుకులు వేసి కలుపుకోండి.
-
అటుకులు కలుపుకున్నాక వెంటనే గ్లాసులో సగం దాకా నింపుకోండి. ఆ తరువాత పల్లీలు జీడిపప్పు కొద్దిగా వేసుకోండి. ఆ పైన మిగిలిన గ్లాస్ అటుకుల పాలతో నింపుకోండి
-
ఆఖరుగా పైన కొన్ని పల్లెలు జీడీపప్పు టూటి ఫ్రూటీ హార్లిక్స్ వేసి వెంటనే సర్వ్ చేసుకోండి.

Leave a comment ×
1 comments