మామిడికాయ కొబ్బరి పచ్చడి
మామిడికాయ కొబ్బరి కలిపి రుబ్బి కమ్మని ఘుభాళించే తాలింపు పెట్టి చేసే తెలుగు వారి పచ్చడి అన్నంతో అట్టు ఇడ్లీలతో ఎంతో రుచిగా ఉంటుంది. వేడి నెయ్యి వేసిన అన్నంతో మాటలకందని రుచిగా ఉంటుంది.
ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ కొబ్బరి పచ్చడి చేయడానికి పెట్టె సమయం కేవలం మూడు నిమిషాలు అంతే! సాధారణంగా కాస్త వంట తెలిసిన ప్రతీ ఒక్కరికి మామిడికాయ కొబ్బరి పచ్చడి తెలిసినదే, కానీ నా తీరు పచ్చడి సమయం గడుస్తున్నా నీరుగా అవ్వదు. ముద్దగా ఉంటుంది అన్నంతో కలుపుకు తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుటమాటో కరివేపాకు పచ్చడి
మామిడికాయ కొబ్బరి పచ్చడి రెండు మూడు రకాలుగా చేస్తారు, నేను ఆ వివరాలన్నీ కింద టిప్స్లో ఉంచాను చుడండి.

టిప్స్
మామిడికాయ:
- ఏ కొలతకి తీసుకున్నా మామిడికాయకి మూడింతలు ఉండాలి పచ్చి కొబ్బరి ముక్కలు. ఈ కొలత పుల్లని మామిడి వాడితేనే! ఒక వేళ మామిడికాయ పులుపు తక్కువగా అనిపిస్తే పచ్చడి తయారయ్యాక మామిడికాయని తురిమి కలుపుకుంటే సరిపోతుంది.
పచ్చిమిర్చి | ఎండుమిర్చి :
-
సాధారణంగా మామిడికాయ కొబ్బరి పచ్చడికి ఎండుమిర్చిని వాడతారు, నేను కారంగాల పచ్చిమిర్చి వాడి చేశాను.
-
మీరు ఎండుమిర్చి వాడుకోదలిస్తే పల్లీలతో పాటు ఎండుమిర్చిని వేపి రుబ్బుకుంటే సరిపోతుంది.
పల్లీలు:
-
ఈ పచ్చడి రుచికి రూపాకి వేసే 2 చెంచాల పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి. వేపిన పల్లీలు వేస్తే పచ్చడి నీరుగా అవ్వదు!!!
-
కానీ పల్లీలు మితంగా వేసుకోవాలి లేదంటే టిఫిన్స్ పచ్చడి మాదిరిగా ఉంటుంది.
మామిడికాయ కొబ్బరి పచ్చడి - రెసిపీ వీడియో
Mamidikaya Kobbari Pachadi | Mango Coconut Chutney | How to Make Mango Coconut Chutney
Prep Time 3 mins
Cook Time 3 mins
Total Time 6 mins
Serves 8
కావాల్సిన పదార్ధాలు
- 1 1/4 Cup పచ్చి కొబ్బరి
- 6-8 పచ్చిమిర్చి
- 1/2 tbsp జీలకర్ర
- ఉప్పు (రుచికి సరిపడా)
- 6-7 వెల్లులి
- 2 tbsp పల్లీలు
- 1/2 Cup పచ్చి పుల్లని మామిడికాయ ముక్కలు
- 1 కొత్తిమీర (చిన్న కట్ట)
-
తాలింపు కోసం:
- 2 tbsp నూనె
- 1 tbsp ఆవాలు
- 1 tbsp సెనగపప్పు
- 1 tbsp మినప్పప్పు
- 2 pinches ఇంగువ
- 1 tbsp అల్లం తురుము
- 2 ఎండుమిర్చి
- 1/2 tbsp పసుపు
- 2 Sprigs కరివేపాకు
విధానం
-
పల్లీలు ఎర్రగా వేపి మిక్సీలోకి తీసుకోండి.
-
వేగిన పల్లీలతో పాటుగా పచ్చిమిర్చి వెల్లులి ఉప్పు జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి
-
బరకగా రుబ్బుకున్న తరువాత పచ్చికొబ్బరి కొత్తిమీర వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి
-
ఆఖరుగా మామిడి ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుంటే వేసిన అన్ని పదార్ధాలు నోటికి తెలిసేలా గ్రైండ్ అవుతాయి.
-
తాలింపు కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి, అప్పుడే తాలింపుకి రుచి.
-
ఆఖరుగా పసుపు కరివేపాకు వేసి వేపిది పసుపు మాడకుండా వేగుతుంది. వేగిన తాలింపుని పచ్చడిలో కలిపేసుకోండి.
-
పచ్చడిలో పులుపు తగ్గితే మామిడికాయ తురుము కలుపుకోండి. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
2 comments