మంగ్లూర్ స్పంజీ సెట్ దోశా | నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే దోశలే సెట్ దోశలు

పట్టుకుంటే దూదిలా, నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే దోశలే సెట్ దోశలు. ఒక సెట్ గా మూడు దోశలు కలిపి ఇస్తారు అందుకే దీనికి సెట్ దోశ అని అంటారు.

ఇవి పుట్టింది "మంగుళూరు" లో కానీ, ఎక్కువగా తమిళనాడులో తింటారు. నేను ఇది వరకే తమిళనాడు స్టైల్ సెట్ దోశ రెసిపీ పోస్ట్ చేశా, ఇది మంగుళూర్ స్టైల్. తమిళనాడు స్టైల్ కి మంగులూర్ స్టైల్ కి కొలతలు భిన్నంగా ఉంటాయి. ఆ చిన్న మార్పే దోశకి ఎంతో రుచిని ఇస్తుంది.

తమిళనాడు లో సెట్ దోశలతో వడ కర్రీ, సాంబార్, టమాటా చట్నీ కొబ్బరి చట్నీ ఇస్తారు. నాకు ఇందులో వడ కర్రీ ఒక్కటుంటే చాలు అనిపిస్తుంది.

Manglore Style Spongy Set Dosa at home | Set Dosa | Steam Dosa | How to make Set Dosa

టిప్స్

  1. బియ్యం: దోశలు రేషన్ బియ్యంతో మెత్తగా వస్తాయ్, మామూలు సోనా మసూరి బియ్యంతో కంటే

  2. ఇలా రుబ్బాలీ : మిక్సీలో పిండి రుబ్బితే కొద్దిగా కొద్దిగా వేసుకుంటూమెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, అదే స్టోన్ గ్రైండర్ అయితే ఎక్కువసేపు రుబ్బుకోవాలి

  3. ఇలా పులవాలి పిండి: పిండిని కచ్చితంగా 12 గంటలు పులవనివ్వాలి. అదే చల్లని ప్రదేసల్లోని వారు వేడిగా ఉండే ప్రదేశాల్లో పెట్టి పులవనివ్వండి. ఒక్కోసారి 16 గంటలు పట్టొచ్చు.

  4. 12 గంటల తరువాత కొద్దిగా వంట సోడాలో కాసిని నీళ్ళు పోసి పిండిని గబగబా1-10 అంకెలు లెక్కపెట్టేలోగా పెద్ద గరిటెడు పిండి గరిట నుండి పూర్తిగా జారిపోవాలి, అంత పల్చగా ఉండాలి పిండి. అంటే మామూలు అట్ల పిండి కంటే కాస్త జారుగా ఉండాలి.

  5. సెట్ దోశ అంటేనే కొన్ని వందల వేల బుడగలతో స్పాంజ్లా ఉండాలి. అందుకే కొద్దిగా వంట సోడా వేస్తారు.

  6. మంగులూర్ సెట్ దోశకి కాస్త పసుపు వేస్తారు. నచ్చకుంటే వదిలేయోచ్చు.

  7. పెనం మీద పిండి ఒకేదగ్గర పోసి వదిలేయాలి. గరిటతో పల్చగా చేయకూడదు.

  8. సెట్ దోశ కిందవైపు ఎర్రగా కాలాలి...పైన స్టీం కుక్ అవ్వాలి. ఓ వైపు కాలాక అట్టుని తిరగ తిప్పి కాల్చకూడదు.

Manglore Style Spongy Set Dosa at home | Set Dosa | Steam Dosa | How to make Set Dosa

మంగ్లూర్ స్పంజీ సెట్ దోశా | నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే దోశలే సెట్ దోశలు - రెసిపీ వీడియో

Manglore Style Spongy Set Dosa at home | Set Dosa | Steam Dosa | How to make Set Dosa

Breakfast Recipes | vegetarian
  • Prep Time 20 mins
  • Resting Time 12 hrs
  • Total Time 12 hrs 20 mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 1 1/2 cup కప్స్ రేషన్/దోశల బియ్యం
  • 1 tsp మెంతులు
  • 1/2 cup మినపప్పు
  • 1/2 cup మందంగా ఉండే అటుకులు
  • ఉప్పు రుచికి సరిపడా
  • 1 tsp వంట సోడా
  • 1/2 tsp పసుపు
  • నీళ్ళు

విధానం

  1. బియ్యం, మినపప్పు, మెంతులు, అటుకులు వేసి బాగా కడిగి 5 గంటలు నానబెట్టాలి.
  2. 5 గంటల తరువాత మిక్సీలో కొద్దికొద్దిగా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  3. రుబ్బుకున్న పిండిని 12 గంటలు నానబెట్టాలి.
  4. 12 గంటల తరువాత రుచికి సరిపడా సాల్ట్, ఇంకా వంటసోడాలో కాసిని నీళ్ళు పోసి పిండిని గరిట జారుగా బాగా కలుపుకోవాలి
  5. వేడెక్కిన పెనం మీద పెద్ద గరిటెడు పిండిని ఒకే దగ్గర ఒకే సారి పోసి వదిలేయాలి. తరువాత అంచుల వెంట నూనె వేసి స్టీం బయటకి పోనీ మూత పెట్టి మీడియం ఫ్లేం మీద స్టీం కుక్ చేసుకోవాలి.
  6. దోశ అడుగు ఎర్రగా కాలాక తీసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • H
    Hyndu
    Recipe Rating:
    Annaya....ee set dosa enni sarlu chesina memu chala happy ga tintunnam...antha soft ga untunnay...so many thanks for ur best set dosa...
  • C
    chandrashakermudiraj
    Recipe Rating:
    Super
  • K
    Kalpana Reddy
    Me recipes super sir I am impressed some recipes I am trying to do good results thank you so much 💐
Manglore Style Spongy Set Dosa at home | Set Dosa | Steam Dosa | How to make Set Dosa