మెంతి గుడ్డు కూర

Curries
5.0 AVERAGE
3 Comments

మెంతికూరని ఎర్రగా వేపి టమాటో గుజ్జు మసాలాలలో ఉడికించి వేపిన గుడ్లు వేసి చేసే ఈ కూర ఎప్పుడు చేసినా అందరికీ నచ్చేస్తుంది. ఈ కర్రీ ఎంత సులభమంటే వాంతరాని వారు బ్యాచిలర్స్ కూడా సునాయాసంగా చేయగలిగేంత సులభం!

శీతాకాలంలో మెంతి కూర చాలా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటాము ఈ మెంతి గుడ్డు కూర. ఈ సింపుల్ ఎగ్ కర్రీ రైస్తో చాలా రుచిగా ఉంటుంది. ప్రత్యేకంగా వేసే పదార్ధాలేమీ లేవు అన్నీ అందరిళ్ళలో ఉండేవే!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు తెలంగాణా స్టైల్ మసాలా గుడ్డు పులుసు

ఈ సింపుల్ ఎగ్ మసాలా చేసే ముందు కింద టిప్స్ అర్ధం చేసుకుని చేయండి పక్కా రెసిపీని ఎంజాయ్ చేయండి.

టిప్స్

మెంతి కూర:

  1. మెంతి కూరలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పెద్ద కాళులది రెండవది చిన్న ఆకులది. పెద్ద ఆకుల మెంతి కూర చేసు తక్కువగా ఉంటుంది, చిన్న ఆకులు కష్టహ చేదుగా ఉంటాయి. కాబట్టి మీరు తినగలిగే చేదుని బట్టి ఏ ఆకు కూరైనా వాడుకోండి, నేను పెద్ద మెంతి కూర ఆకు వాడాను.

  2. మీరు చిన్న మెంతి కూర ఆకు వాడితే మరో రెండు కట్టలు అదనంగా వేసుకోండి.

కూర చేదు రాకుండా ఉండాలంటే:

  1. మెంతి కూర ఆకు కచ్చితంగా చేదు ఉంటుంది. కాబట్టి ఆకుని బాగా పసరు వాసన పోయి ఎర్రగా వేగేదాక వేపుకోవాలి అప్పుడే ఆకులో చేదు తగ్గుతుంది. ఇంకా కూర మాంచి పరిమళంతో ఉంటుంది.

  2. ఇంకా మెంతి ఆకులో చేదు తగ్గించడానికి కచ్చితంగా పుల్లని నాటు టొమాటోలు వాడండి. మీరు ఎంత చేసినా కూర చేదుగా అనిపిస్తే దింపే ముందు నిమ్మరసం పిండుకొండి.

  3. నేను కూర మరింత పరిమళంగా ఉంచడానికి ఆఖరున కసూరి మేథీ వేశాను, ఇష్టంలేని వారి వదిలేయండి.

  4. ఇంకా మసాలాలు మాడినా కూర చేదుగా అయిపోతుంది అని అర్ధం చేసుకోండి.

ఇంకొన్ని విషయాలు:

  1. ఇదే కూరకి మీరు ఉడికించి వేపిన గుడ్లు కాకుండా మసాలాలు పూర్తిగా వేగిన తరువాత గుడ్లు కొట్టి కోడిగుడ్డు పొరుటు మాదిరీ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది రుచి. కానీ టొమాటోలు వేసిన కారణంగా కాస్త ముద్దగా ఉంటుంది అంతే!

మెంతి గుడ్డు కూర - రెసిపీ వీడియో

Methi Egg Masala | Dabha Style Methi Egg Curry

Curries | nonvegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 4 ఉడికించిన గుడ్లు
  • 5 spoons నూనె
  • 4 మెంతికూర ఆకు తరుగు
  • 4 టొమాటోలు గుజ్జు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp వేపిన జీలకర్ర పొడి
  • 1/4 tbsp గరం మసాలా
  • 1 ¼ cups ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిర్చి తరుగు
  • 1/4 tbsp పసుపు
  • 2 tbsp కసూరీ మేథీ
  • 1 cup నీళ్లు

విధానం

  1. చెంచా నూనె వేసి అందులో 4 ఉడికించిన గుడ్లకి గాట్లు పెట్టి వేసుకోండి అందులోనే కొంచెం పసుపు వేసి టాస్ చేసుకుంటూ వేపి తీసుకోండి
  2. అదే పాన్లో మిగిలిన నూనే వేడి చేసి అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లిన జీలకర్రలో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు ఉప్పు వేసి ఉల్లిపాయ మెత్తబడి దాకా వేపుకోవాలి
  3. వేగిన ఉల్లిలో అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి . ఆ తరువాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా నీళ్లు వేసి వేపుకుంటే మసాలాలు మాడవు.
  4. 4. మసాలాల్లోంచి నూనె పైకి తేలిన తరువాత మెంతి కూర ఆకు తరుగు వేసి కచ్చితంగా నూనె పైకి తేలేదాక వేపుకోవాలి అప్పుడే ఆకులో పసరు వాసన పోయి చేదు తగ్గుతుంది
  5. ఆకు బాగా వేగిన తరువాత టమాటో గుజ్జు వేసి నూనె పైకి తేలేదాకా మూతపెట్టి వేపుకోండి
  6. నూనె పైకి తేలిన తరువాత వేపిన గుడ్లు నీళ్లు కసూరి మేథీ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాలు వదిలేస్తే గుద్దుకీ మసాలా పరిమళం అంతా పట్టి నూనె పైకి తేలుతుంది, అప్పుడు దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments