మిర్చీ బజ్జీ | హైదరాబాద్ స్టైల్ మసాలా మిర్చీ బజ్జీ

పైన సెనగపిండి కరకరలాడుతూ, లోపలి మిర్చీ ఎర్రగా వేగి, పుల్లగా కారంగా ఘాటుగా ఉండే హైద్రాబాద్ మసాలా మిర్చీ బజ్జీ రుచి మాటలకందనిది.

సాయంత్రం అయితే చాలు హైదరాబాద్లో ఏ మూలకి చుసిన ఒక మిర్చీ బజ్జీ బండి కనిస్తుంది, అక్కడా వేపే మిర్చీ బజ్జీల సువాసన పక్క వీధులకి వారిని వేడి వేడిగా బజ్జీలు వేగుతున్నాయి రావాలి రావాలి అని గోల పెట్టి పిలుస్తుంటాయ్. సాయంత్రాలు టీ తాగుతూ వేడి వేడి మిర్చి బజ్జీ కొరుక్కుని తినడం మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి.

నేను చెప్పిన ఈ విషయం ఒక్క హైదరాబాదుకు పరిమితం కాదు యావత్ తెలుగు రాష్ట్రాలకు సంభందించిన విషయం. కానీ హైదరాబద్లో దొరికే మిర్చీ బజ్జీకి రాజమండ్రీలో బజ్జీకి గుంటూరు వైపు ఇష్టంగా ఇష్టంగా తినే బజ్జీ రుచికి పొంతన లేదు. అన్ని చోట్లా అందరు వాడేది సెనగపిండి కానీ బజ్జీలు వేపే తీరు మిర్చీ లోపల పెట్టె మసాలా భిన్నం.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఉల్లిపాయ పకోడీ

చాలా మందికి మిర్చీ బజ్జీ రెసిపీ యేముఉండి తెలుసు అనే అనిపిస్తుంది, కానీ కొన్ని కచ్చితమైన టిప్స్ పాటిస్తేనే అసలైన మిర్చి బజ్జీని చేయగలుగుతారు.

టిప్స్

సెనగపిండి:

  1. సెనగపిండి మామూలుగా బూందీకి వాడే మృదువైన సెనగపిండి కాకుండా కాస్త బరకగా ఉండే సెనగపిండి వాడుకోండి

  2. కొందరు బజ్జీ కారకరలాడడానికి బియ్యం పిండి కూడా కొద్దిగా కలుపుతారు, సెనగపిండిలో. నచ్చితే మీరు కలుపుకోవచ్చు.

నీళ్లు:

  1. పొసే నీళ్లు చిక్కని ఇడ్లీ పిండి అంత చిక్కగా ఉండాలి. అప్పుడే మిరపకాయకి పిండి అంటుతుంది.

వంట సోడా:

  1. వంట సోడా ¼ tsp సరిపోతుంది, అంత కంటే అవసరం లేదు.

మిర్చీ:

  1. బజ్జీ మిరపకాయలు అని ప్రేత్యేకంగా దొరుకుతాయ్, అవి వాడితేనే బజ్జీ కారం తినేలా ఉంటుంది.

  2. మిరపకాయ అంచుని కొద్దిగా అంటే ¼ ఇంచ్ కోసి తరువాత మధ్యకి చీరి లోపలి గింజలు దులిపేయండి. దీని వలన బజ్జే కారం తగ్గుతుంది.

  3. మిరపకాయ చివర్న కోసిన చిన్న మిర్చీ ముక్కలు చట్నీలకి వాడుకోవచ్చు.

లోపలి స్టఫింగ్:

  1. కచ్చితంగా చింతపండు చిక్కని గుజ్జునే వాడుకోవాలి. చింతపండు నీరుగా ఉండకూడదు. అలా నీరుగా ఉంటె నూనెలో వేగేప్పుడు నూనెలోకి నీరు దిగి నూనె అంత పాడైపోతుంది.

మిర్చీ కోసేప్పుడు చేతులు మండకూడదు అనుకుంటే:

  1. మిర్చీని కోయడానికి ముందు చేతులకి నూనె రాసుకోండి. అప్పుడు చేతులకు మండవు.

ఆఖరుగా కొన్ని కచ్చితంగా పాటించాల్సిన టిప్స్:

  1. పిండిలో నీరు ఉప్పు సోడా వేశాక బాగా ఎక్కువసేపు బీట్ చేసుకోవాలి. పిండి ఎంత ఎక్కువసేపు బీట్ చేస్తే అంత బాగా వస్తాయ్ బజ్జీలు

  2. పిండి కలిపిన వెంటనే బజ్జీలు వేయాలి లేదంటే బజ్జీ ఎర్రగా వస్తుంది

  3. బజ్జీలు వేసేప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి. మూకుడు సైజుని బట్టి 3-4 వేసుకోండి అంతేగాని ఎక్కువగా బజ్జీలని నింపకండి.

మిర్చీ బజ్జీ | హైదరాబాద్ స్టైల్ మసాలా మిర్చీ బజ్జీ - రెసిపీ వీడియో

Mirichi Bajji | Hyderabad Style Masala Mirchi bajji | Street Food

Street Food | vegetarian
  • Prep Time 10 mins
  • Soaking Time 20 mins
  • Cook Time 30 mins
  • Total Time 1 hr
  • Serves 8

కావాల్సిన పదార్ధాలు

  • చింతపండు పేస్ట్ కోసం:
  • 2 tbsp చిక్కని చింతపండు గుజ్జు (50gm చింతపండు నుండి తీసినది)
  • 1/2 tbsp ఆంచూర్ పొడి
  • ఉప్పు
  • 1/2 tbsp కారం
  • 1/2 tbsp వేయించిన జీలకర్ర పొడి
  • బజ్జీల కోసం
  • 1.5 Cup సెనగపిండి
  • 1 Cup నీళ్లు
  • ఉప్పు
  • 1/4 tbsp సోడా
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tbsp వాము
  • 18 మిర్చీలు
  • నూనె (వేపుకోడానికి)
  • చాట్ మసాలా (కొద్దిగా పైన చల్లుకోడానికి)
  • ఉల్లిపాయ తరుగు (బజ్జీలతో పాటు ఇవ్వడానికి)

విధానం

  1. నానబెట్టిన 50gm చింతపండు నుండి చిక్కని పేస్ట్ మాత్రమే తీసుకోవాలి, నీరుగా పులుసు తీసుకోకూడదు.
  2. చింతపండు పేస్టుకి పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి చిక్కని పేస్ట్ చేసుకోండి
  3. బజ్జీ మిరపకాయలని కడిగి అంచున కట్ చేసుకోండి. తరువాత మిర్చీని మధ్యకి చీరుకోండి, లోపలి గింజల్ని దులిపేయండి
  4. మిర్చీలో చిక్కని చింతపండు పేస్ట్ వేలుతో కొద్దిగా తీసుకుని మిర్చిలో పై నుండి కిందికి రాయండి, ఇలాగే అన్నీ చేసుకోండి
  5. సెనగపిండి ఉప్పు సోడా అల్లం వెల్లులి పేస్ట్ నిలిపిన వాము వేసి బాగా కలిపి
  6. తగినన్ని నీళ్లు చేర్చుకుంటూ చిక్కని ఇడ్లీ పిండి మాదిరి కలిపి 5 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి సెనగపిండిని ఒక పొడవైన గ్లాస్లోకి నింపుకోండి. దీనివల్ల మిర్చీని పిండిలో ముంచి తీసుకోవడం సులభం.
  7. చింతపండు పేస్ట్ పట్టించిన మిర్చీని గ్లాస్లో నింపిన పిండిలో ముంచి బయటకి తీసేప్పుడు గ్లాస్ అంచుకి తాకి తాకనట్లు తాకిస్తూ బయటకి తీస్తే మిర్చీకి మూడు వైపుల పిండి అంటుతుంది ఒక వైపు అంటదు. అప్పుడు వెంటనే మరిగే వేడి నూనెలో వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వండి, ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోండి.
  8. వేడి వేడి మిర్చీ బజ్జీ పైన చాట్ మసాలా కొద్దిగా ఉల్లిపాయ తరుగు చల్లి సర్వ్ చేసుకుంటే హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మిర్చీ బజ్జీ తయారు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • V
    Vijay Rayabarapu
    Recipe Rating:
    I recommand everyone of my friends & colleagues to follow you . Your recipes are the best.
  • R
    Raju poshala
    Recipe Rating:
    Superb
  • A
    AR
    Recipe Rating:
    One other change i forgot to mention was the stuffing/filling amchur powder seemed like a lot. So reduced that to 1/4th tsp.
  • A
    AR
    Recipe Rating:
    Tried the recipe- instructions were so helpful. Crisp tasty mirchi bajjis. Thanks. I ran out of batter with about 6 mirchis left and had to mix again. Also doubled the filling quantity.
  • V
    Veena
    Recipe Rating:
    Superb I like vismai food