సన్నని ఉల్లిపాయ చీలికల్లో కొన్ని మసాలాలు సెనగపిండి కలిపి నూనెలో ఎర్రగా వేపే ఈ తీరు పకోడీ దక్షిణ భారత దేశంవారు ఎంతగానో ఇష్టపడతారు.

ఎర్రగా వేగి కరకరలాడుతూ ఉండే ఉల్లిపాయ తీపి మసాలాల పరిమళంతో ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. సాయంత్రాలు టీ తో సరైన జోడీ.

చూడ్డానికి బాగా తెలిసిన రెసిపీలా అనిపిస్తుంది, కానీ కొన్ని పద్ధతులు టిప్స్ పాటిస్తేనే పకోడీ గట్టిగా కరకరలాడుతూ ఉంటుంది, లేదంటే మరో రుచితో మెత్తగా పకోడీ తయారవుతుంది కానీ ఈ తీరులో గట్టిగా కరకరలాడుతూ మాత్రం ఉండదు పకోడీ.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుకాజు పకోడీ

కచ్చితంగా స్వీట్ షాప్ వారి తీరులో కారకరలాడే గట్టి పకోడీ ఇంట్లో చేయాలంటే కింద టిప్స్ చుడండి, అప్పుడు కచ్చితమైన రెసిపీ మీకు తెలుస్తుంది.

టిప్స్

ఉల్లిపాయ:

  1. ఉల్లిపాయ చీలికలుగా తరుక్కోవాలి. అంటే ఉల్లిపాయని మధ్యలో కోసి ఆ తరువాత నిలువుగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు కూడా మరీ సన్నంగా తరుక్కోకండి.

  2. చిప్స్ చీరె స్లైసర్తో ఉల్లిపాయని చేరుకోవచ్చు కానీ మరీ సన్నగా రేకుల్లా వస్తాయ్ ఉల్లిపాయలు, అంత సన్నంగా ఉంటె నూనెలో పకోడీ వేగేలోపే ఉల్లిపాయ మాడిపోతుంది. మీ దగ్గర సైజు అడ్జస్ట్ చేసుకునే స్లైసర్ ఉంటె తప్పకుండా స్లైసర్ వాడుకోవచ్చు.

పిండి కలిపే తీరు:

  1. మసాలాలు ఉల్లిపాయల్ల్లో వేసి పిండితే నీరొస్తుంది ఉల్లిపాయల్లోంచి, అప్పుడు సెనగపిండి బియ్యం పిండి వేసి పిండి గట్టిగా తడిపొడిగా కలుపుకోవాలి. పిండి జారుగా తడితడిగా ఉండకూడదు. పిండి తడి పొడిగా గట్టిగా కాకుండా జారుగా నీరు నేరుగా ఉంటె మీకు గట్టి పకోడీ రాదు, మెత్తని పకోడీ వస్తుంది.

  2. కాబట్టి పిండుకున్న ఉల్లిపాయల్లో పిండి వేసి ఎక్కువగా వత్తకుండా కలుపుకుంటే సరిపోతుంది.

నీరు:

  1. నిజానికి ఈ గట్టి పకోడీకి అసలు నీరు అవసరంలేదు. అవసరమైతే ఒక్క చెంచా వేసుకోండి చాలు.

పకోడీ వేసే తీరు:

  1. పిడికెడు పకోడీ పిండిని చేతిలోకి తీసుకుని గట్టిగా పిండుతూ నూనెలోకి వదలాలి అప్పుడు చిన్న చిన్న ముద్దలుగా నూనెలోకి పడుతుంది. అంతే గాని పిండిని చిన్న చిన్న ఉండలుగా వేయరు ఈ పకోడీ.

పకోడీ వేపే తీరు:

  1. మరిగే నూనెలో పకోడీ పిండి వేసి మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద వేగితేనే పిండి లోపలి దాకా ఉడుకుతుంది, నీరుగా ఉండే ఉల్లిపాయ ఎర్రగా వేగుతుంది. ఎక్కువ మంట మీద వేపితే పైన రంగొస్తుంది లోపల పిండిగ ముద్దగా అనిపిస్తుంది పకోడీ.

ఉల్లిపాయ పకోడీ - రెసిపీ వీడియో

Street food style Onion pakodi | Pyaz ki Pakoda | Onion Pakodi with tips

Street Food | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms ఉల్లిపాయలు
  • 2 Slit పచ్చిమిర్చి
  • 1 tbsp కారం
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp గరం మసాలా
  • 1 tbsp ధనియాల పొడి
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/150 Cups/gms సెనగపిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • 1 tbsp నీరు
  • 3 Sprigs కరివేపాకు
  • 1 tbsp ధనియాలు

విధానం

  1. ఉల్లిపాయని పొట్టు తీసి సన్నని చీలికలుగా తరుక్కోండి. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా చీరుకోండి
  2. చీరుకున్న ఉల్లీ పచ్చిమిర్చిలో మిగిలిన మసాలాలు అన్నీ వేసి ఉల్లిపాయల్ని పిండుతూ పట్టించండి.
  3. తరువాత సెనగపిండి, బియ్యం పిండి వేసి ఉల్లిపాయాలకి నెమ్మదిగా వత్తకుండా పట్టించాలి( ఒక్క సారి టిప్స్ చుడండి)
  4. ఆఖరుగా పిండిని గట్టి ముద్ద చేయడానికి ఒక్కే చెంచా నీరు చిలకరించాలి
  5. మరిగే నూనెలో పకోడీ పిండి ముద్దని తీసి నలుపుతూ నూనెలో చిన్న ముద్దలుగా వేసుకోవాలి. పకోడీనీ మీడియం ఫ్లేమ్ మీద పకోడీ రంగు మారి గట్టిపడే దాకా వేపుకోవాలి. పకోడీ వేగడానికి సమయం పడుతుంది కొంచెం ఓపిక అవసరం.
  6. పకోడీ రంగు మారి గట్టి పడగానే మంట హై ఫ్లేమ్లోకి పెట్టి ఒక్క నిమిషం వేపితే నూనెని పీలిచిన పకోడీ వదిలేస్తుంది ఇంకా కారకరా వేగుతుంది. అప్పడు తీసి జల్లెడలో వేసి వేదిలేయండి. పకోడీ వేడి మీద కాస్త మెత్తగా అనిపిస్తుంది, చల్లరే కొద్దీ జల్లెడలో ఉన్న పకోడీ గట్టి పడుతుంది.
  7. ఆఖరుగా 3 రెబ్బలు కరివేపాకు నూనెలో వేసి ఎర్రగా వేపి తీసి పకోడీ మీద వేసేయండి.
  8. ఈ పకోడీ కనీసం 2 రోజులు చలి కాలంలో నిల్వ ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments