ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయకుండా మిరియాలు జీలకర్ర మెంతులు ఎర్రగా వేపి దంచి చింతపండు పులుసులో దగ్గరగా ఉడికించి గుబాళించే తాలింపు పెట్టి అన్నంలో కలిపి చేసే మిరియాల పులిహోర ప్రసాదం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో శీతాకాలంలో ఏ ఆలయానికి వెళ్లినా ప్రసాదంగా పంచుతారు!!!

ఘాటైన మిరియాల పులిహోరా నోట్లో కమ్మగా గొంతులో ఘాటుగా ఎంతో రుచిగా ఉంటుంది. మిరియాలు గొంతులోని కఫాన్ని కరిగిస్తుంది. అందుకే శీతాకాలంలో ఎక్కువగా మిరియాల పులిహోర ప్రసాదంగా నివేదిస్తారు. నిజానికి డచ్ వారు భారత దేశానికి వచ్చి మిరపకాయలని పరిచయం చేసే వరకు మనకు తెలిసిన కారం కేవలం శొంఠి మిరియాలు పిప్పళ్లు అంతే!!! మనకు తెల్సిన కారం మిరియాలు కాబట్టి తెలుగువారు కారంగా ఉండే మిరపకాయలకి “మిరపకాయ” అని పేరు పెట్టుకున్నారు!!!

మామూలు గుడుల్లో ఎల్లా ఉన్నా పుణ్యక్షేత్రాల్లో ఇచ్చే ప్రసాదాల్లో మిరపకాయలు వాడారు, కారం కోసం మిరియాలు శొంఠినే వాడతారు. ఉదాహరణకు తిరుమల ఇంకా పూరిలో జగన్నాథ ఆలయాల్లో పచ్చిమిర్చి ఇంకా విదేశాలనుండి భారత దేశానికి వచ్చిన ఏ కాయ కూరని వాడారు భగవంతుని ప్రసాదాలకి.

ఇప్పుడు మనం పులిహోర తాలింపులో ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసేస్తున్నాం కానీ, వెనుకటికి మిరియాల పులిహోరే చేసే వారు తినేవారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ప్రసాదం పులిహోర

టిప్స్

అన్నం:

  1. పులిహోరకి అన్నం పొడిపొడిగా ఉండాలి, అందుకే బియ్యం నానబెట్టకూడదు. కడిగి వెంటనే ఒకటికి రెండు నీరు పోసి… కుక్కర్లో అయితే హై ఫ్లేమ్ మూడు కూతలు రానిచ్చి ఆ వెంటనే స్టీమ్ పోయేట్లు చెంచాతో స్టీమ్ని తీసేయాలి. లేదంటే అన్నం మెత్తనవుతుంది. ఇంకా స్టీమ్ పోయిన వెంటనే నూనె రాసిన వెడల్పాటి పళ్లెంలో అన్నం వేసి గాలికి పూర్తిగా ఆరనివ్వాలి.

  2. అన్నం విడిగా వండేట్లైతే ఒకటికి రెండు నీరు పోసి బియ్యం నానబెట్టకుండా వండుకోవాలి. అన్నం ఉడికిన వెంటనే నూనె రాసిన పళ్లెంలో పోసి గాలికి ఆరనివ్వాలి.

  3. పులిహోరకి సాధారణంగా నేను ఉప్పు పసుపు ముందే అంటే అన్నం వండేప్పుడే వేసేస్తాను. దాని వల్ల మెతుకుకి ఉప్పు పసుపు పట్టుకుంటుంది.

తాలింపు:

  1. పులిహోరలకి నువ్వుల నూనె వేరుశెనగనూనె అయితేనే రుచిగా ఉంటుంది, మామూలు రిఫైండ్ నూనెలకంటే.

  2. పులిహోరలకి తాలింపు ఊపిరిలాంటిది. అందుకే కచ్చితంగా తాలింపు ఎర్రగా మాంచి సువాసన వచ్చేదాకా తాలింపు మాడకుండా దినుసులు కారకరాలాడేట్టు వేపుకోవాలి.

  3. పులిహోర తాలింపు అంటే కరివేపాకు ఇంగువ తప్పనిసరి

పులుసు:

  1. చింతపండు పులుసు దగ్గరగా చిక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగుపెట్టేస్తుంది.

  2. చిక్కని పులుసు అయితే పులిహోర నిలవుంటుంది. పులుసు పలుచనైతే పులిహోర చల్లారాక నీరు వదిలి పడిపోతుంది.

  3. పులుసులో వేసే ఆ కొద్ది బెల్లం పులుపుని చక్కగా బేలన్స్ చేస్తుంది. నచ్చని వేసుకోకపోయినా పర్లేదు.

ఆఖరుగా:

  1. అన్నానని పులుసు పట్టించాక పులిహోరని కనీసం ముప్పై నిమిషాలైనా ఊరనివ్వాలి, అప్పుడే పులుసు అన్నం పీల్చుకుని పులిహోర రుచిగా ఉంటుంది.

మిరియాల పులిహోర - రెసిపీ వీడియో

Miriyala Pulihora | Pepper Pulihora | How to Make Miriyala Pulihora

Flavored Rice | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 30 mins
  • Cook Time 25 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 26 mins
  • Serves 8

కావాల్సిన పదార్ధాలు

  • అన్నంవండుకోడానికి:
  • 2 Cups కడిగినబియ్యం
  • 4 Cups నీరు
  • ఉప్పు
  • 1 tbsp పసుపు
  • 1 tbsp నూనె
  • చింతపండునానబెట్టుకోడానికి:
  • 50 gms చింతపండు
  • 300 ml నీరు
  • పులిహోరపొడికోసం:
  • 2 tbsp మిరియాలు
  • 1/2 tbsp మెంతులు
  • 1 tbsp ధనియాలు
  • 1/2 tbsp జీలకర్ర
  • 1 1/4 tbsp నల్లనువ్వులు
  • పులిహోర పేస్ట్కోసం:
  • 85 ml నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 1/4 tbsp పచ్చిశెనగపప్పు
  • 1 1/4 tbsp మినపప్పు
  • 60 gm వేరుశెనగగుండ్లు
  • 3 Sprigs కరివేపాకు
  • 1/2 tbsp ఇంగువ
  • 2-3 tbsp బెల్లం

విధానం

  1. చింతపండులో నీరు పోసి 30 నిమిషాలు నానబెట్టి పిప్పి తీసి పులుసు తీసి ఉంచుకోండి
  2. బియ్యం కడిగి అందులో నీరు ఉప్పు పసుపు నూనె వేసి కుక్కర్మూత పెట్టి మూడు విజిల్స్రానివ్వండి
  3. మూడు విజిల్స్రాగానే కుక్కర్మూత తీసి నూనె రాసిన పళ్లెంలో అన్నం వేసి గాలికి పూర్తిగా ఆరనివ్వాలి( అన్నం పొడి పొడిగా వండు కోవడానికి పైన టిప్స్ఉ న్నాయ్చుడండి)
  4. పులిహోర పొడి కోసం ఉంచి నపదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి మీడియం ఫ్లేమ్మీద మాంచి సువాసానొచ్చేదాక వేపుకోవాలి. ఆఖరుగా నువ్వులు వేసి చిట్లనిచ్చి దింపి మెత్తని పొడి చేసుకోండి
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు సెనగపప్పు మినపప్పు వేరుశెనగగుండ్లు వేసిసెనగగుండ్లు చిట్లిమిగిలిన పప్పులు మాంచి రంగులో వచ్చేదాకా వేగనివ్వాలి.
  6. తాలింపు ఎర్ర బడ్డాక మాత్రమే కరివేపాకు ఇంగువ వేసివేపుకోండి.
  7. వేగి ఆన్తాలింపులో చింతపండు పులుసు బెల్లం ముక్క వేసి రెండు పొంగులు రానిచ్చి పులిహోర మిరియాల పొడి వేసి కలుపుతూ చిక్కబరచాలి
  8. నేను ఇరవై నిమిషాలు మరిగించాను మాధ్య మధ్య నకలుపుతూ. ఇరవై నిమిషాలకి పులుసు చిక్కబడి నూనె పైకి తేలింది
  9. చిక్కబడిన పులుసు స్టవ్ఆ పేసి వండుకున్న అన్నం వేసి కలిపి నెమ్మదిగా పట్టించి కనీసం 30 నిమిషాలైనా ఊరనివ్వండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments