చాకోలెట్ శాండ్విచ్

చాకోలెట్ అంటే ఇష్టమున్నవారు తప్పక రుచి చూడాల్సిన రెసిపీ ముంబయ్ స్ట్రీట్ ఫుడ్ చాకోలెట్ శాండ్విచ్. దండిగా వెన్న పూడి బ్రేడ్ మధ్యన చాకోలెట్ సాస్ చాకోలెట్ తురుము వేసి గ్రిల్ చేసి వేడివేడిగా సర్వ్ చేస్తుంటారు ముంబాయ్లో.

ఊరికే రుచి చూద్దాం అని మొదలెట్టిన ఎవ్వరైనా తప్పక మరో రెండైనా తినిపించేస్తుంది ఈ చాకోలెట్ శాండ్విచ్. నేను మీకో నిజం చెప్పాలి, నా చిన్నప్పుడు ఈ రెసిపీ గురుంచి తెలిసినప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా వంటలు చేస్తుంటారు, అదేమీ కాంబినేషన్ ఏది ఎలా తినాలో ఆలా తినాలి అనుకున్నా. కానీ ఒక రోజు ఫ్రెండ్ బలవంతం మీద తిన్నాక తెల్సింది ఈ చాకోలెట్ శాండ్విచ్ ఒక అద్భుతము అని.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు మిక్స్డ్ వెజ్ లాలిపోప్

ఈ శాండ్విచ్ పిల్లల బర్తడే పార్టీస్కి లేదా గెట్ తో గేతర్స్కి పర్ఫెక్ట్!!!

టిప్స్

చాకోలెట్:

  1. నేను సెమి స్వీట్ డార్క్ చాకోలెట్ కాంపౌండ్ వాడాను, నచ్చితే మీరు బిట్టర్ స్వీట్ చాకోలెట్ అయినా వాడుకోవచ్చు.

  2. చాకోలెట్ కాంపౌండ్ వేరు చాకోలెట్ వేరు. చాకోలెట్ కాంపౌండ్ అంటే రా చాకోలెట్. ఈ రా చాకోలెట్ వాడి కొన్ని ఫ్లేవర్స్ దరి ఫ్రూట్స్ కలిపి ఏదైనా చాకోలెట్స్ కేక్స్ తయారు చేసుకోవచ్చు. పాకెట్లో దొరికే చాకోలెట్స్ అంటే రెడీ తో ఈట్ చాకోలెట్స్ అంటే అవి తయారైన చాకోలెట్, అవి అలా తినేయడమే. దానితో ఇంకేమి చేయలేము. తయారైన చాకోలెట్తో మళ్ళీ ఏదైనా చేయడం అంటే తయారైన బిర్యానీతో ఇంకేదో కొత్త రెసిపీ చేయడం లాంటిదే!!!

డైరీ మిల్క్ లేదా ఇంకేమైనా చాకోలెట్ వాడకూడదా?

  1. నచ్చితే వాడుకోండి. కానీ అవి చాకోలెట్ కాంపౌండ్ అంత గట్టిగా ఉండదు, తురమలేరు. అవి మీ చేతిలోలోనే కరిగిపోతాయి.

బటర్:

  1. శాండ్విచ్ కరకరలాడుతూ ఉండాలంటే కచ్చితంగా బటర్ బ్రేడ్ అంతా పూసుకోవాలి. బటర్ ఎప్పుడు రూమ్ టెంపరేచర్ ఉన్నప్పుడే వాడితే సులభముగా బ్రేడ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక వేళా సమయమా తక్కువగా ఉంటె బటర్ని మైక్రోవేవ్లో 30 సెకన్లు హీట్ చేసి తీసుకుంటే మెత్తబడుతుంది. ఇంకా అప్పటికి బటర్ మెత్తబడలేదంటే మళ్ళీ 10 సెకన్లు హీట్ చేసి బయటకి తీసి కలుపుకోండి, మళ్ళీ పది సెకన్లు హీట్ చేసి మళ్ళీ కలుపుకోండి. ఇలా 10 సెకన్లు 10 సెకన్లు హెట్ చేసి కలుపుకోవాలి. అంతేగాని ఒకేసారి వేడి చేస్తే బటర్ నూనె మాదిరి కరిగిపోతుంది. ఆ కరిగిన బటర్ బ్రేడ్ మీద రాస్తే గ్రిల్ చేసేప్పుడు నీరుగా అయిపోతుంది, బ్రెడ్ కూడా కారకరలాడదు

చాకోలెట్ సిరప్

  1. రెడీమేడ్గా దొరికే ఏ చాకోలెట్ సిరప్ అయినా వాడుకోవచ్చు.

బ్రెడ్:

  1. శాండ్విచ్లకి ఎప్పుడూ మిల్క్ బ్రేడ్ వాడకండి. మిల్క్ బ్రేడ్ శాండ్విచ్ బ్రెడ్ అంత స్టిఫ్గా కరకరలాడుతూ ఉండదు.

చాకోలెట్ శాండ్విచ్ - రెసిపీ వీడియో

Mumbai Street Style Chocolate Sandwich | Chocolate Sandwich

Street Food | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 12 mins
  • Total Time 13 mins
  • Serves 2

కావాల్సిన పదార్ధాలు

  • 100 gms సెమి స్వీట్ చాకోలెట్ కాంపౌండ్
  • 3 tbsp చాకోలెట్ సిరప్
  • 1/4 Cup బటర్
  • 4 Slices శాండ్విచ్ బ్రేడ్

విధానం

  1. రెండు శాండ్విచ్ బ్రెడ్ మీద బటర్ పూయండి.
  2. వెన్న పూసిన తరువాత రెండు బ్రెడ్ స్లైసెస్ మీద చాకోలెట్ సిరప్ పోసి బ్రేడ్ అంత స్ప్రెడ్ చేసుకోండి
  3. తరువాత చాకోలెట్ కాంపౌండ్ని రెండు బ్రేడ్ స్లైసెస్ మీద ⅛ మందాన తురుముకోండి.
  4. చాకోలెట్ తురుముకున్న బ్రెడ్ని ఒక దాని మీద మరొకటి పెట్టి, పై బ్రేడ్ మీద బటర్ పూసుకోండి
  5. బటర్ పూసుకున్న వైపు వేడి వేడి పెనం మీద వేసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాకా కాల్చుకోవాలి
  6. ఒక వైపు కాలుతున్నప్పుడే పై వైపు బటర్ పూసుకుని, కింద వైపు ఎర్రగా కాలిన తరువాత తిరగతిప్పి రెండు వైపు కూడా ఎర్రగా కాల్చుకోవాలి
  7. రెండు వైపులా కాలిన తరువాత మాలీ కాస్త బటర్ పూసి చాకోలెట్ని బ్రేడ్ కనపడకుండా తురుముకోవాలి. వేడి మీదే ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments