మైసూర్ మసాలా దోశ | ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోని ఫాలో అవ్వండి
ఇంట్లోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ “మైసూర్ మసాలా దోశ” రెసిపీ చేయాలనుకుంటే ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోని ఫాలో అవ్వండి, బెస్ట్ మైసూర్ మసాలా దోశ రెసిపీని మనసారా ఆనందించండి.
మసాలా దోశ దక్షిణ భారత దేశంలో అన్నీ బండ్ల మీద హోటల్స్లో కచ్చితంగా దొరుకుతుంది. అది మసాలా దోశ అంతే, అది మైసూర్ మసాలా దోశా కాదు. ఇంకా వారు అన్నీ దోశలకి ఒకటే పిండి వాడతారు. వారికి మసాలా దోశ అంటే దోశ మధ్యన బంగాళాదుంప కూర పెట్టి ఎర్రగా కాల్చి ఇవ్వడమే. అది మసాలా దోశా, మైసూర్ మసాలా దోశ కాదు.
అసలైన మైసూర్ మసాలా దోశ రెసిపీ రుచి చాలా ప్రేత్యేకం. ఈ ప్రేత్యేకత పిండి రుబ్బడం, అట్టు కాల్చడం, అట్టు పైన పూసే కారం, ఇంకా ఆలూగడ్డ కూర అన్నింటిలోనూ ఉంది. ఆ ప్రేత్యేకమైన విధానం చాలా వివరంగా టిప్స్తో ఉంది చూడండి.
Try this Manglore Style Spongy Set Dosa and Black Chickpea Dosa

టిప్స్
దోశల పిండి:
-
పిండి మిక్సీలో రుబ్బే కంటే స్టోన్ గ్రైండర్లో రుబ్బితేనే బెస్ట్ దోశ వస్తుంది. మిక్సీలో పప్పు విరుగుతుంది గ్రైండర్లో నలుగుతుంది. నలిగిన పప్పు బాగా పొంగి రుచినిస్తుంది.
-
మామూలు అట్ల పిండికి రేషన్ బియ్యం లేదా అట్ల బియ్యం పోస్తే జిగురొచ్చి చాలా రుచిగా ఉంటాయ్ అట్లు, కానీ మైసూర్ మసాలా దోశకి ఇడ్లీ బియ్యం దీన్నే ఉప్పుడు బియ్యం అంటారు ఇవి వాడడం వల్ల దోశ మరింతగా కరకరలాడుతూ ఉంటుంది. అటుకులు అట్టుని మృదువుగా మెత్తగా ఉంచుతుంది.
-
పిండిని ఎంత ఎక్కువసేపు రుబ్బుకునటే అంత బాగా పులుస్తుంది, అట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది.
-
మిక్సీ వాడే వారు పప్పు కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎక్కువసేపు మెత్తగా రుబ్బుకోండి.
-
పిండి వేసవి కాలంలో కనీసం 10 గంటలు, చలికాలంలో అయితే 12-16 గంటలు పులవాల్సి ఉంటుంది.
మసాలా దోశ కారం:
- ఈ పచ్చడికి బైడిగీ (byadigi) మిరపకాయలు వాడాలి లేని వారు కాశ్మీరీ ఎండుమిర్చి నానబెట్టి వాడుకోవాలి. ఈ మిరపకాయలు మామూలు మిరపకాయలకి మల్లె ఘాటుగా కారంగా ఉండవు, మాంచి రంగు, సువాసనతో రుచిగా ఉంటాయ్.
ఆలూ మసాలా టిప్స్:
-
ఆలూ మసాలా కూరలో దుంపలు వేశాక కొద్దిగా నీళ్ళు చిలకరించాలి అప్పుడు దుంపల కూర చల్లరినా తేమగా ఉంటుంది, లేదంటే పొడి పొడిగా అవుతుంది.
-
మసాలా కూరలో ఆఖరున వేసే పచ్చిమిర్చి సన్నని తరుగు రుచి బాగుంటుంది, కూర తయారయ్యేప్పుడు మధ్యలో మిర్చి వేసి వేపే కంటే.
దోశ కాల్చే టిప్స్:
-
అట్టు కరకరలాడుతూ రావడానికి కాస్ట్ ఐరన్, ఇనుప పెనాలు బెస్ట్. నాన్స్టిక్ పెనం మీద ఇనుప పెనలా మీద వచ్చినంత ఎర్రగా కరకరలాడుతూ రావు.
-
అట్టు కాలుతున్నప్పుడు అట్టుని పెనం నుండి అట్లకాడతో తీయకండి. అలా కాలకుండా తీస్తే పెనం నుండి అట్టు విడిపడిపోయి ఎర్రగా కాలాదు.
-
మసాలా దోశ అంచుల వెంట నూనె, మధ్యలో నెయ్యి/ వెన్న వేసి ఎర్రగా కాల్చాలి. హోటల్ స్టైల్ అట్టు కావాలంటే నూనె నెయ్యి ఎక్కువగానే ఉండాలి, లేదు తక్కువగా వేసుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు.

మైసూర్ మసాలా దోశ | ఈ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోని ఫాలో అవ్వండి - రెసిపీ వీడియో
Mysore Masala Dosa Recipe | Crispy Masala Dosa| How to make Perfect Mysore Masala Dosa Batter at home
Prep Time 40 mins
Soaking Time 6 hrs
Cook Time 30 mins
Resting Time 12 hrs
Total Time 19 hrs 10 mins
Servings 12
కావాల్సిన పదార్ధాలు
-
అట్టు పిండి కోసం
- 1/2 cup మినపప్పు
- 1 cup ఇడ్లీ బియ్యం
- 1 cup దోశల బియ్యం
- 1 tsp మెంతులు
- 2 tsp పచ్చి శెనగపప్పు
- 1/2 cup మందం అటుకులు
- నీళ్ళు – పిండి రుబ్బుకోవడానికి
- ఉప్పు రుచికి సరిపడా
- నూనె అట్టు కాల్చడానికి
- వెన్న/ బటర్ తగినంత
-
కారం కోసం
- 15 బయ్యడిగీ మిరపకాయలు (వేడి నీళ్ళలో నానబెట్టినవి)
- 2 tsp పచ్చి శెనగపప్పు
- 1/4 cup ఉల్లిపాయ తరుగు
- 1 tsp నువ్వులు
- 5 - 6 వెల్లులి
- 1/8 tsp పసుపు
- ఉప్పు
- 1 tbsp నిమ్మరసం
- 2 tbsp నూనె
-
ఆలూ మసాలా కోసం
- 3 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tbsp పచ్చిసెనగపప్పు
- 1 tsp జీలకర్ర
- 1 కరివేపాకు
- 1 cup ఉల్లిపాయ తరుగు
- 1.5 tsp అల్లం వెల్లులి ముద్ద
- 1/4 tsp పసుపు
- ఉప్పు
- 4 ఉడికించిన బంగాళాదుంపలు
- 1/4 cup నీళ్ళు
- 1/4 cup కొత్తిమీర తరుగు
- 2 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
విధానం
-
అట్ల పిండి కోసం ఉంచిన పదార్ధాలన్నీ కడిగి కనీసం 5 గంటలు నానబెట్టి తరువాత గ్రైండర్లో అన్నీ వేసి తగినన్ని నీళ్ళు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. (ఒకసారి టిప్స్ చూడండి)
-
మెత్తగా రుబ్బిన పిండిని కనీసం 12 గంటలు పులవనివ్వాలి.
-
12 గంటల తరువాత తగినంత పిండి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు నీళ్ళు చేర్చి పలుచన చేసి పక్కనుంచుకోండి
-
కారం కోసం నూనె వేడి చేసి అందులో శెనగపప్పు వేసి ఎర్రగా వేపి తరువాత ఉల్లిపాయ తరుగు నువ్వులు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపి ఆఖరున వెల్లులి వేసి వేపి దింపేసుకోండి
-
మిక్సీజార్లో నానబెట్టిన బయ్యడిగీ మిరపకాయలు వేపుకున్న ఉల్లిపాయలు ఇంకా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మిరపకాయలు నానబెట్టిన నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
ఆలూ కూర కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు, శెనగపప్పు, కరివేపాకు వేసి వేపుకోవాలి
-
తరువాత ఉల్లిపాయ తరుగు వేసి 2-3 నిమిషాలు వేపి అల్లం వెల్లులి ముద్దా, పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు వేపుకోవాలి
-
తరువాత ఉడికించిన ఆలుగడ్డలని నలిపి వేసుకోండి. ఆలూ పైన కాసిని నీళ్ళు చిలకరించి నీరు దుంపలు పీల్చుకునే దాకా వేపి, ఆఖరున కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి కలిపి దింపేసుకోండి
-
అట్టు వేసేముందు అట్ల పెనాన్ని నూనె వేసి ఉల్లిపాయతో బాగా రుద్ది మిగిలిన నూనెని తుడిచేయండి
-
తరువాత అట్టు పిండి పోసి పలుచుగా స్ప్రెడ్ చేసుకోండి.
-
పిండి పోసిన వెంటనే మధ్య కారం పేస్ట్ వేసి అట్టంతా పూయండి, అట్టు అంచుల వెంట నూనె వేయండి, మధ్యన వెన్న వేసి అట్టుని అట్ల కాడతో కదపకుండా ఎర్రగా కాలనివ్వాలి.
-
అట్టు ఎర్రగా కాలేదాక అట్లకాడతో అట్టుని తీయకండి, అట్టు ఎర్రగా కాలాక మధ్య ఆలూ కూర పెట్టి మధ్యకి మడిచి తీసుకోండి.

Leave a comment ×
16 comments