పెరి పెరి బ్రెడ్ బైట్స్

పాత బ్రేడ్తో ఏదైనా కొత్త రెసిపీ కావాలనుకుంటే సింపుల్గా తయారయ్యే బెస్ట్ స్టార్టర్ ఈ పెరి పెరి బ్రెడ్ బైట్స్ చేయండి, సూపర్ హిట్ అయిపోతుంది. కరకరలాడే బ్రెడ్ని ఒకటి తినడం మొదలెడితే తింటూనే ఉంటారు.

ఎర్రగా వెన్నలో వేపిన బ్రేడ్ ముక్కలకి వెల్లులి పెరి పెరి మసాలాల్లో టాస్ చేసి, బ్రేడ్ మీద టమాటో సాస్ మయొనైస్ వేసి ఇచ్చే ఈ సింపుల్ స్టార్టర్ని నేను హైదరాబాద్లోని ఒక రెసెప్షన్ భోజనాల్లో తిన్నాను. అక్కడిక్కడే వారు చేసి వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు. కాకపోతే వారు డీప్ ఫ్రైడ్ బ్రేడ్ వాడారు నేను రోస్ట్ చేసిన బ్రేడ్ వాడుతున్నాను.

ఈ బ్రేడ్ బైట్స్ ఎంత సులువంటే వంటరాని వారు కూడా సులభంగా చేసేసే అంత సులువు. నిజానికి పార్టీ స్టార్టర్స్ అని ఏవేవో కష్టమైన రెసిపీ చేసుకునే బదులు ఇవి చేయండి జస్ట్ 10 నిమిషాల్లో తయారైపోతుంది అందరికీ నచ్చేస్తుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుపిజ్జా బ్రెడ్ సమోసా

టిప్స్

బ్రెడ్:

  1. నేను పాత మిల్క్ బ్రేడ్ వాడాను. మీరు ఇక్కడ బ్రౌన్ బ్రేడ్ , మల్టీ గ్రైన్ బ్రెడ్ లేదా ఇంకేదైనా వాడుకోవచ్చు.

  2. పాత బ్రేడ్ అయితేనే తేమ తక్కువగా ఉంది త్వరగా క్రిస్పీగా కాలుతుంది. డీప్ ఫ్రై చేసుకుంటే ఏ బ్రెడ్ ఉన్న పర్లేదు

  3. బ్రెడ్ ముక్కలుగా కోసి గాలికి ఆరనివ్వాలి అప్పుడే తేమ ఆరిపోతుంది.

  4. బ్రెడ్ని సన్నని సెగ మీద తిప్పుకుంటూ రిస్క్ మాదిరి అయ్యేదాకా మాడకుండా వేపుకుని తీసుకోవాలి.

  5. బ్రెడ్ పొడిని దులిపి రోస్ట్ చేసుకోండి. బ్రెడ్ పొడి కారణంగా బ్రెడ్ త్వరగా మాడిపోతుంది.

  6. నేను బ్రెడ్ని పాన్ మీద తిప్పుకుంటూ రోస్ట్ చేశాను, మీరు కావాలంటే ఒవేన్లో లేదా బ్రెడ్ టోస్టర్లో కూడా క్రిస్పీగా టోస్ట్ చేసుకోవచ్చు.

వెల్లులి :

  1. వెల్లులి సన్నని సెగ మీద లేత బంగారు రంగు వచ్చేదాకా వేపిటెహ్ చాలు ఆ తరువాత మిగిలిన మసాలాలు వేపే సమయానికి ఎర్రగా వేగుతుంది. ముందే ఎర్రగా వేపితే అన్నీ వేగేపాటికి వెల్లులి మాడిపోతుంది, ఇంకా చేదుగా అయిపోతుంది వెల్లులి, తినలేరు.

పెరి పెరి బ్రెడ్ బైట్స్ - రెసిపీ వీడియో

Peri peri bread bites | How to make Peri Peri Bites with tips

Snacks | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Resting Time 30 mins
  • Total Time 50 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 6 Slices మిల్క్ బ్రెడ్
  • 4 tbsp బటర్
  • 8 వెల్లులి సన్నని తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి తురుము
  • 1/4 tbsp ఉప్పు
  • 1 tbsp పెరి పెరి మసాలా
  • 1/4 tbsp కారం
  • 1 tbsp రెడ్ చిల్లి ఫ్లెక్స్
  • 1 tbsp టమాటో సాస్
  • 1 tbsp మయొనైస్
  • 1 tbsp హాలాపినోస్
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. పాత మిల్క్ బ్రెడ్ని ముక్కలుగా కోసి గాలికి గంట సేపైనా ఆరబెట్టుకుంటే, బ్రెడ్ ముక్కలకున్న తేమ ఆరిపోతుంది
  2. ఆరిన బ్రెడ్ ముక్కాల పొడిని దులిపి పాన్లో వేసి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కారకాలాడేట్టు వేపుకుని తీసుకోవాలి
  3. అదే పాన్లో 2 tbsp బటర్ వెల్లులి తరుగు వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  4. వేగిన వెల్లులిలోపచ్చిమిర్చి, ఉప్పు చిల్లి ఫ్లెక్స్ పెరి పెరి మసాలా కారం వేసి టాస్ చేసుకోవాలి.
  5. వేగిన మాసాలలో వేపుకున్న బ్రెడ్ ముక్కలు మిగిలిన బటర్ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోవాలి
  6. సర్వింగ్ ప్లేట్లో వేపుకున్న బ్రెడ్ మసాలాలతో సహా వేసుకోండి. పైన మిగిలిన సామానంతా ఒక్కోటిగా వేసుకోవాలి, వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.