మునగాకు కూటు | మునగాకు పప్పు | రోగనిరోదక శక్తినిచ్చే మునగాకు పప్పు
అన్నం లోకి పోషకాలు నిండిన కమ్మని కూర కోసం చూస్తున్నారా. అయితే మునగాకు కూటు చేసి చూడండి ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ పప్పు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
పప్పు సాధారణంగా అందరూ చేసుకునే తినేదే! కానీ మునగాకుతో చేసే కూటు ప్రేత్యేకమనే చెప్పాలి. తమిళనాడు స్పెషల్ రేసీపీ ఇది.
అన్నం, చపాతీ, రోటీలలోకి చాలా రుచిగా ఉంటుంది. వేసవిలో శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. చూడడానికి రోజూ చేసుకునే పప్పులాగే ఉన్నా, రుచి ప్రేత్యేకంగా అనిపిస్తుంది.
తమిళనాడులో ఎన్నో రకాలుగా కూటులు చేస్తారు, వేటికవే ప్రేత్యేకం. ఈ మునగాకు కూటు నాకు చాలా ఇష్టం.

టిప్స్
-
పప్పులు ఉడికించడానికి గంట ముందే కడిగి నానబెడితే చక్కగా మెత్తగా ఉడుకుతాయ్
-
ఉడికిన పప్పుని అస్సలు ఎనపకూడదు. పప్పు పప్పుగానే ఉండాలి, తింటుంటే మెత్తగా నాలగాలి అప్పుడే రుచి.
-
ఆఖరున వేసే పచ్చికొబ్బరి తురుము, కొబ్బరి నూనె కూటుకి ఎంతో రుచినిస్తుంది. కొబ్బరి వేశాక ఒక నిమిషం కంటే ఎక్కవ సేపు ఉడికించకూడదు. ఎక్కువగా ఉడికితే తాజా కొబ్బరికి ఉండే తాజా పరిమళం పోతుంది
-
కూటులో వేసిన పెసరపప్పు కారణంగా చల్లారాక కూటు గట్టిగా చిక్కబడుతుంది. అలా చిక్కగా అనిపిస్తే ఎప్పుడైనా వేడి నీళ్ళతో పలుచన చేసుకోవచ్చు
-
కూటు మామూలు పప్పు మాదిరి జారుగా ఉండదు, కాస్త చిక్కగా ముద్దగానే ఉంటుంది.
మునగాకు కూటు | మునగాకు పప్పు | రోగనిరోదక శక్తినిచ్చే మునగాకు పప్పు - రెసిపీ వీడియో
Protein-rich Moringa Dal | Drumstick Leaves with Lentils | Moringa Kootu | Drumstick Leaves Dal | How to make Drumstick Leaves Dal Curry
Prep Time 5 mins
Soaking Time 1 hr
Cook Time 20 mins
Total Time 1 hr 25 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
కూటు ఉడికించడానికి
- 1 cup పెసరపప్పు
- 3 tbsp పచ్చి శెనగపప్పు
- 15 - 20 కాబూలీ సేనగలు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 4 పచ్చిమిర్చి చీలికలు
- 1 టొమాటో
- 1 tsp పసుపు
- 2.5 cup నీళ్ళు
-
తాలింపు కోసం
- కొత్తిమీర – చిన్న కట్ట
- 100 gm మునగాకు
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 3 ఎండు మిర్చి
- 5 దంచిన వెల్లులి
- 1/2 cup పచ్చి కొబ్బరి
- 1 tbsp కొబ్బరి నూనె
- ఉప్పు
విధానం
-
పప్పులన్నీ గంట సేపు నానబెట్టినవి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి 4 కూతలు వచ్చే దాకా ఉడికించి దింపేసుకోండి.
-
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి.
-
మునగాకు వేసి పసరు వాసన పోయే దాకా వేపుకోవాలి.
-
మెత్తగా ఉడికిన పప్పు, ఉప్పు వేసి బాగా కలుపుకోండి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు పోసుకోండి.
-
ఆఖరుగా పచ్చికొబ్బరి, కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ఒక నిమిషం ఉడికించి దింపేసుకోండి.

Leave a comment ×
4 comments