Curries
5.0 AVERAGE
1 Comments

మెత్తగా ఉడికించిన పెసరపప్పులో నేతిలో వేపిన పుదీనా ఆకుల తరుగు వేసి ఘుమఘుమలాడే తాలింపు పెట్టి చేసే అతి సులభమైన పప్పు. ఈ పుదీనా పప్పు అన్నం చపాతీతోనే కాదు అన్నంతో కూడా ఎంతో తృతినిచ్చే రెసిపీ.

ఓపిక లేనప్పుడు ఫటాఫట్ ఏదైనా రెసిపీ కుక్కర్లో వేసి మూడు మూతల్లో తయారయ్యే రెసిపీ ఏదైనా ఉంటె బాగుండు అనుకునే వారికి పర్ఫెక్ట్. ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా ఉపయోగంగా ఉంటుంది.

సాధారణంగా పప్పు అంటే టమాటో తప్పక వేసి నచ్చిన కాయో కూరో వేసి చేస్తారు. ఈ పుదీనా పప్పులో టమాటోలో వేయరు. కేవలం ఎర్రగా వేపిన నేతి తాలింపులో ఉల్లిపాయ తరుగు వేసి చేస్తారు. ఇందులో సాధారణంగా తెలుగు వారు వేసే చింతపండు వేయరు, నిమ్మరసం పిండి చేస్తారు.

ఈ పప్పు చాలా కమ్మగా తిన్నాక కూడా పొట్టకి హాయిగా అనిపిస్తుంది. ఈ పప్పు మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తుంటారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు పెళ్ళిళ్ళ టొమాటో పప్పు

టిప్స్

పప్పు:

  1. పెసరపప్పు చాలా కమ్మగా ఉంటుంది ఈ పుదీనా పప్పుకి. నచ్చితే మీరు కందిపప్పు కూడా వాడుకోవచ్చు.

పప్పు చిక్కబడిపోతే:

  1. సాధారణంగా పెసరపప్పు చల్లారితే చిక్కుబడిపోతుంది. అందుకే పెసరప్పుని కాస్త పలుచగా వండుకుంటే, చల్లారిన మరీ చిక్కగా ముద్దగా అవ్వదు. ఏ కారణం చేతనైన ముద్దగా అనిపిస్తే మరిగే నీళ్లు పోసి పలుచన చేసుకోండి.

పప్పు వండే తీరు:

  1. మా ఇంట్లో పప్పు మెత్తుగా ఉడికినా చిదురైపోవడం నచ్చదు అందుకే మేము విడిగా గిన్నెలో ఒకటికి రెండున్నర కప్పుల నీళ్లు పోసి కాస్త పప్పుపప్పుగానే వండుతాము. మీకు సమయం లేదనుకుంటే మెత్తగా గుజ్జుగా కావాలనుకుంటే కూకార్లో ఉడికించుకోండి.

నెయ్యి తాలింపు:

  1. పుదీనా పప్పుకి నెయ్యి తాలింపు ప్రేత్యేకమైన పరిమళాన్నిస్తుంది.

పుదీనా:

  1. పుదీనా ఆకులు మాత్రమే వేసుకోండి, కాడలు వేయకండి అవి తాలింపులో వేగినా మగ్గవు.

నిమ్మరసం:

  1. ఈ పప్పుకి ఆఖరున కలిపే నిమ్మరసం రుచి చాలా బాగుంటుంది, చింతపండు పులుపు కంటే!!!

ఇంకొన్ని టిప్స్:

  1. నేను టమాటో వేయలేదు మీకు నచ్చితే టమాటో తరుగు తాలింపులో వేసి మెత్తగా మగ్గించుకుని పప్పులో కలిపేసుకోండి.
  2. ఉల్లిపాయ తరుగు కచ్చాపచ్చాగా (roughly chopped ) బాగుంటుంది, సన్నని తరుగు కంటే
  3. నేను యందు కారం వేశాను, మీరు కావాలంటే పచ్చిమిర్చి తాలింపులో వేసుకోవచ్చు లేదా పప్పులో వేసి మెత్తగా ఉడికించుకోవచ్చు

పుదీనా పప్పు - రెసిపీ వీడియో

Pudina Dal Tadka | Mint Dal How to Make Pudina Dal with tips

Curries | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • పప్పుకోసం:
  • 1 Cup పెసరప్పు
  • 2.5 Cup నీళ్లు
  • తాలింపు కోసం:
  • 2 tbsp నెయ్యి
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp మినపప్పు
  • 2 Pinches ఇంగువ
  • 2 ఎండుమిర్చి
  • 1/2 Cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 tbsp కారం
  • 50 gms పుదీనా ఆకులు
  • 1.5-2 tbsp నిమ్మరసం
  • నీళ్లు (పప్పుని పలుచన చేసుకోవడానికి)

విధానం

  1. పెసరప్పు ని సన్నని సెగమీద కలుపుతూ మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
  2. వేగిన పప్పుని నీళ్లతో పైపైన కడగాలి. గిన్నెలో పప్పు నీళ్లు పోసి పప్పు మెత్తుగా ఉడికించుకోవాలి. లేదా కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి
  3. నెయ్యి బాగా వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇంగువ మినపప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపుకొవాలి
  4. తాలింపు కచ్చితంగా ఎర్రగా వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు పసుపు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకుంటే చాలు. ఆ తరువాత పుదీనా ఆకులు వేసి ఆకుని మెత్తబడనివ్వాలి
  5. మెత్తబడిన ఆకులు కారం ఉప్పు వేసి వేపుకోవాలి
  6. వేగిన తాలింపులో మెత్తగా ఉడికించుకున్న పప్పు తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద పప్పుని బాగా ఉడకనిస్తే తాలింపు పుదీనా పరిమళమంతా పప్పుకి పడుతుంది.
  7. బాగా ఉడికిన పప్పు దింపి నిమ్మరసం కలిపి దింపేసుకోవడమే!!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    It’s yummy. Now a days I’m eating only your published dishes daily. Ille Vaikuntam kadupe Kailasam