పంజాబీ ఢాబా తీరు పనీర్ భుర్జీ

నేతిలో వేపిన ఉల్లి టమాటోలో ప్రేత్యేకమైన మసాలాలు వేసి వేపి పనీర్ని తురుము వేసి చేసే పంజాబీ ఢాబా తీరు పనీర్ భుర్జీ ఘుమఘుమలు అమోఘం!!! ఈ తీరు పనీర్ భుర్జీ నోట్లో వెన్నలా కరిగిపోతుంది, రోటీలతో ఒక గొప్ప కాంబినేషన్!!!

పనీర్ భుర్జీ అందరికీ తెలిసినదే అందరూ చేసేదే… నేను కూడా ఇది వరకు చేశాను,. కానీ పంజాబీ ఢాబాల్లో దొరికే పనీర్ భుర్జీ తీరే వేరు. పంజాబీ ఢాబా అంటే నేను చెప్తున్నది ఢిల్లీలోని పంజాబీ ఢాబా తీరు. ఈ తీరు ఎంతో ప్రేత్యేకంగా అనిపించింది, ఎలాంటి రంగులు వాడకుండా అంత ఎర్రటి ఆకర్షణీయమైన రంగు తీసుకొచ్చిన తీరు ఇంకా నచ్చేసింది.

ఇంకా ఈ రెసిపీలో ఎలాంటి ఫాన్సీ పదార్ధాలు లేవు, స్వచ్ఛమైన దేశీయంగా పదార్ధాలతో దండిగా నెయ్యి వెన్న వేసి చేసిన భుర్జీ ఎంత రుచి అనిపించిందో, అదే మీకు చెబుతున్నాను.

నేను కొన్ని నెల క్రితం ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ స్నేహితులతో కలిసి వెళ్లిన ఢాబా కిటకిటలాడిపోతుంది, అందరూ ఇక్కడ పనీర్ భుర్జీ ఎంతో ప్రేత్యేకం అని చెప్పడంతో ఆర్డర్ చేశాను, చాలా నచ్చేసింది. ఆ ఢాబాలోని వంట తయారీ అంత కనబడుతూనే ఉంది కాబట్టి ఏమి చేస్తున్నారు అని నిశితంగా గమనించి ఆ రిసిపినే మీకు చెబుతున్నాను.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుఈసీ కడాయ్ పనీర్ మసాలా

చేసే ముందు చిన్నవే అయినా కింద టిప్స్తో చేయండి, మీకు ఎప్పుడు చేసినా ఒకే రుచి వస్తుంది.

టిప్స్

పనీర్:

  1. మృదువైన పనీర్ ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో చేసుకున్న పనీర్ ఎంతో మేలు. ఎప్పుడైనా పనీర్ తురుముకోడానికి ముందు 10 నిమిషాలు వేడి నీళ్లలో వదిలేస్తే మృదువుగా అవుతుంది, ఇంకా ఫ్లేవర్ అన్నీ పనీర్ పట్టుకుంటుంది.

గ్రేవీ:

  1. సాధారణంగా రెస్టారెంట్ గ్రేవీలు అంటే కాజూ ఇంకా ఖర్భూజా గింజలు నానబెట్టిన పేస్ట్ వాడి గ్రేవీని చిక్కబరుస్తారు. దాభాల్లో సెనగపిండిని వేపి చేస్తారు. వేపిన సెనగపిండి కూరకి చాలా కమ్మదనాన్నిస్తుంది, ఇంకా చిక్కబరుస్తుంది కూడా.

  2. పనీర్ వేశాక 2-3 నిమిషాలు ఉడికిస్తే చాలు అంతకంటే ఎక్కువగా ఉడికిస్తే చిక్కగా అయిపోతుంది.

  3. ఏ కారణం చేతనైన కూర చిక్కబడితే వేడి నీళ్లతో పలుచన చేసుకోండి. టొమాటోలు:

  4. ఈ కూర కమ్మగా ఉంటుంది, పులుపు కారాలు తక్కుగా ఉంటాయి. అందుకే మనకి దొరికే పుల్లని నాటు టొమాటోలకంటే బెంగుళూర్ టమాటోలు లేదా హైబ్రిడ్ టొమాటోలు వేస్తే కూర చాలా కమ్మగా ఉంటుంది.

  5. నాటు టొమాటోల్లో గింజలు ఎక్కువగా ఉంటాయి, కండ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ హైబ్రిడ్ టొమాటోలు వాడుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఒక వేళా మీరు నాటు టొమాటోలు వాడుకోదలిస్తే కొద్దిగా పంచదార వేసి పిలుపుని బేలెన్స్ చేసుకోండి.

కాశ్మీరీ కారం:

  1. ఈ కూరకి ఎలాంటి రంగులు వాడకుండా చూడ్డానికి ఆకర్షణీయంగా తింటుంటే మాంచి పరిమళంతో ఉండాలంటే మాత్రం కాశ్మీరీ వాడాల్సిందే. మాములు కారం ఘాటుగా ఉంటుంది కానీ కాశ్మీరీ కారం అంత ఎర్రటి ఎరుపునివ్వదు.

నెయ్యి - వెన్నా:

  1. దభా స్టైల్ అంటే నూనెలు వెన్న దండిగా ఉంటాయి, ఒక వేళా నచ్చకుంటే తగ్గించుకోండి. కానీ నెయ్యి బటర్ వాడడానికి ప్రయత్నం చేయండి, నూనె వాడకండి.

పంజాబీ ఢాబా తీరు పనీర్ భుర్జీ - రెసిపీ వీడియో

Punjabi Dabha Style Paneer Bhurji | How to Make Paneer Bhurji

Street Food | vegetarian
  • Prep Time 3 mins
  • Cook Time 20 mins
  • Total Time 23 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • గ్రేవీ కోసం:
  • 2 tbsp సెనగపిండి
  • 1/2 cup పెరుగు
  • 1/4 Cup పాలు
  • 1/4 tbsp పసుపు
  • 1/2 tbsp నల్ల ఉప్పు
  • 1 tbsp కసూరి మేథీ
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp కారం
  • 1 tbsp గరం మసాలా
  • 2 tbsp నెయ్యి
  • 1 tbsp కాశ్మీరీ కారం
  • బుర్జీ కోసం:
  • 2 tbsp నెయ్యి
  • 2 tbsp బటర్
  • 200 gms పనీర్
  • 1/2 tbsp జీలకర్ర
  • 1 Cup ఉల్లిపాయ తరుగు
  • 3 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
  • 1 tbsp అల్లం తురుము
  • 3 టమాటోల ముక్కలు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • కొత్తిమీర తరుగు
  • 1/2 cup వేడి నీరు
  • 1/2 నిమ్మరసం

విధానం

  1. సెనగపిండిని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకుని తీసుకోండి
  2. మరో గిన్నెలో వేపిన సెనగపిండి గ్రేవీ కిశోరం ఉంచిన పదార్ధాలన్నీ వేసి కలిపి ఉంచుకోండి
  3. సెనగపిండి వేపిన పాన్లో నెయ్యి కరిగించి కాశ్మీరీ కారం వేసి ఒక పొంగు రానిచ్చి వెంటనే కలిపి ఉంచుకున్న మసాలా పేస్ట్లో కలిపి ఉంచుకోండి. ఇలా వేపిన కాశ్మీరీ కారం వేయడం వల్ల మాంచి రంగు రుచి చేకూరుతుంది కూరకి.
  4. భుర్జీ కోసం నెయ్యి వెన్న కరిగించి జీలకర్ర వేసి చిట్లనివ్వాలి
  5. తరువాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తురుము వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
  6. వేగిన ఉల్లిలో టమాటో తరుగు వేసి కలిపి మెత్తబడి దాకా వేపుకోవాలి.
  7. టొమాటోలు మెత్తబడ్డాక కలిపి ఉంచుకుని మసాలా మిశ్రమం ఉప్పు కొత్తిమీర తరుగు వేడి నీరు వేసి నెయ్యి పైకి తేలేకదా వేపుకోండి.
  8. నూనె పైకి తేలిన తరువాత పనీర్ని తురిమి వేసుకోండి. తరువాత వేడి నీరు వేసి నెయ్యి పైకి తేలేకదా వేపుకోండి
  9. దింపే ముందు కొత్తిమీర తరుగు నిమ్మరసం పిండి దింపేసుకోండి
  10. వేడి వేడిగా రోటీలు చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments