రవ్వ పులిహోర

పొడి పొడిగా వండుకున్న బియ్యం రవ్వలో ఎర్రగా వేపుకున్న తాలింపు నిమ్మకాయ పిండి కలిపి చేసే రవ్వ పులిహోరా తెలుగు వారి స్పెషల్ ప్రసాదం రెసిపీ.

రవ్వ పులిహోరా చింతపండు పులుసు పోసి ఎక్కువగా చేస్తుంటారు. నేను సులభంగా అయిపోయే నిమ్మకాయ పులిహోర చేస్తున్నా. ఈ రవ్వ పులిహోరా కూడా బియ్యంతో చేసే పులిహోరా మాదిరే కానీ రవ్వని వండుకునేప్పుడు కాస్త జాగ్రత్తుగా ఉంటె చాలు, పొడి పొడిగా వస్తుంది ఈ పులిహోర.

Rava Pulihora | Ravva Pulihora

టిప్స్

బియ్యం రవ్వ వండుకునే తీరు

  1. బియ్యం రవ్వ మరీ ఉప్మా రవ్వ మాదిరి సన్నగా లేకుండా ఉన్న రవ్వ వాడుకోండి.
  2. రవ్వని ఎప్పుడు మరిగే నీళ్లలో మాత్రమే వేసి మెత్తగా వండుకోవాలి.
  3. ఎసరులోనే ఉప్పు వేస్తే రవ్వకి బాగా పట్టుకుంటుంది ఉప్పు.

తాలింపు:

  1. పులిహోర తాలింపు కచ్చితంగా ఎర్రగా వేగాలి అప్పుడే రుచి.
  2. నిమ్మకాయ పులిహోర తాలింపులో ఎండుమిరప కంటే చల్ల మిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి. నచ్చితే మీరు ఎండుమిర్చి వేసుకోవచ్చు.

నిమ్మకాయ:

  1. నిమ్మకాయ రసం కలిపిన తరువాత పులిహోర కనీసం ముప్పై నిమిషాలైనా ఊరాలి అప్పుడు పూలుపడుతుంది రవ్వకి.

రవ్వ పులిహోర - రెసిపీ వీడియో

Rava Pulihora | Ravva Pulihora

Prasadam | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం రవ్వ
  • 2 cups నీళ్లు
  • 1/4 tsp ఉప్పు
  • 1 tsp నూనె
  • 1/2 tsp పసుపు
  • 2 కరివేపాకు - రెబ్బలు
  • తాలింపు కోసం:
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • జీడిపప్పు - చిన్న గుప్పెడు
  • 1/2 tsp మిరియాలు
  • 3 చల్ల మిరపకాయాలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 tsp అల్లం తరుగు
  • ఇంగువ - కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా
  • 2 tbsp నిమ్మకాయ రసం

విధానం

  1. నీళ్లలో ఉప్పు నూనె వేసి తెర్ల కాగనివ్వాలి.
  2. మరుగుతున్న నీరులో బియ్యం రవ్వ పోస్తూ గరిటతో కలుపుకోవాలి, అప్పుడు గడ్డలు ఏర్పడవు.
  3. కలుపుకున్న రవ్వని అన్నం వండుకున్నట్లే మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా వండుకోవాలి.
  4. వండుకున్న అన్నంలో పసుపు కరివేపాకు వేసి కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి.
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలు ఒక్కోటి వేసి ఎర్రగా వేపుకోవాలి.
  6. వేగిన తాలింపుని చల్లారిన రవ్వలో వేసుకోండి, ఇంకా పైన అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి నెమ్మదిగా పట్టించి పులిహోరని 30 నిమిషాలైనా ఊరనివ్వాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • C
    Ch durga
    Recipe Rating:
    Every recipe are delicious
  • B
    Bharath Kumar
    Meeru vantalu chala baga chestharu maaku kuda chala baga vasthayi thank you vismaifood.com
  • B
    Bharath Kumar
    Meeru vantalu chala baga chestharu maaku kuda chala baga vasthayi thank you vismaifood.com
  • B
    Bharath Kumar
    Meeru vantalu chala baga chestharu maaku kuda chala baga vasthayi thank you vismaifood.com
  • B
    Bharath Kumar
    Meeru vantalu chala baga chestharu maaku kuda chala baga vasthayi thank you vismaifood.com
Rava Pulihora | Ravva Pulihora