ఉల్లిపాయ పచ్చిమిర్చి బొంబాయ్ రవ్వ పెరుగు వేసి కలిపి నానబెట్టి పల్చగా తట్టి నూనెలో వేసి ఎర్రగా వేపి తీసే సింపుల్ వడ మీకు బెంగళూరులో ఏ టీ అంగడికి వెళ్లినా దొరుకుతుంది. సాయంత్రాలు తాగే టీతో పర్ఫెక్ట్ జోడి!!!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుమూడు పప్పుల మాసాల వడ

ఈ వడ ఎంత సింపుల్ అంటే కావాల్సిన పదార్ధాలన్నీ వేసి కలిపి తట్టి నూనెలో వేసి తీసేయడమే!!! కానీ, కొన్ని కచ్చితమైన టిప్స్ పాటిస్తే వడ విరగదు, నూనె పీల్చవు. కాబట్టి చేసే ముందు కింద టిప్స్ చుడండి.

టిప్స్

ఉల్లిపాయ తరుగు:

  1. ఈ వడకి కాస్త మందంగా ఉండే ఉల్లిపాయ చీలికలు వేసుకుంటే బాగుంటుంది.

పెరుగు:

  1. వడ కారకరలాడడానికి ఇంకా రుచి కోసం పుల్లని పెరుగు వేస్తారు. మీకు పుల్లని పెరుగు అందుబాటులో లేకుంటే కమ్మని పెరుగు వేసి అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. లేదా మామూలు పెరుగైనా వేసుకోండి.

నీరు:

  1. సాధారణంగా ఈ వడకి నీరు అవసరం లేదు, ఉల్లిపాయల్లోంచి వచ్చే నీరు ఇంకా పెరుగులోంచి వచ్చే నీరు సరిపోతుంది. పిండి మరీ గట్టిగా ఉండి విరిగిపోతుంది అనిపిస్తే కొంచెం నీరు చల్లుకోండి.

ఈ కారణాల చేత వడ నూనె బాగా పీలుస్తుంది:

  1. పిండి పలుచన అయినా లేదా నూనె వేడిగా లేకుండా వడ వేసినా నూనె బాగా పీలుస్తుంది అని గుర్తుంచుకోండి.

వడ విరిగిపోతుంటే ఇలా చేయండి:

  1. సాధారణంగా రవ్వ నానితే వడ విరగడం అనేది ఉండదు, చక్కగా రవ్వ జిగురుగా ఉండి చక్కగా సాగుతుంది.

  2. ఏ కారైనం చేతనైనా వడ విరిగిపోతుంటే కొంచెం బియ్యం పిండి వేసి కలుపుకుని వడ వేసుకోండి విరగదు.

రవ్వ వడ - రెసిపీ వీడియో

Rava Vadalu | Bangalore Style Rava Vada

Street Food | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Resting Time 30 mins
  • Total Time 50 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • 1 Cup ఉల్లిపాయ చీలికలు
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 1 tbsp అల్లం తురుము
  • 3 tbsp కొత్తిమీర తరుగు
  • 2 tbsp కరివేపాకు తరుగు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp వేడి నూనె /నెయ్యి
  • 1/4-1/3 Cup పుల్లని పెరుగు
  • నూనె (వడలని వేపుకోడానికి)

విధానం

  1. ఉల్లిపాయ చీలికలో మిగిలిన సామగ్రీ అంతా వేసి ఉల్లిపాయని గట్టిగా పిండుతూ కలుపుకుంటే నీరు వదులుతుంది ఉల్లిపాయ.
  2. ఉల్లిపాయలోంచి నీరు వదిలన తరువాత రవ్వ వేసి మళ్ళీ రవ్వని నిమురుతూ కలుపుకోండి
  3. తరువాత వేడి నూనె వేసి బాగా కలుపుకుంటే వడ బాగా గుల్లగా వస్తుంది.
  4. రవ్వని బాగా కలుపుకున్నాక పుల్లని పెరుగు వేసి రవ్వని గట్టిగా కలుపుకోండి. కలుపుకున్న రవ్వని కనీసం 30 నిమిషాలు వదిలేయండి
  5. 30 నిమిషాల తరువాత తడి చేత్తో బటర్ పేపర్ మీద అరటి ఆకు మీద పల్చగా తట్టుకొండి
  6. తట్టుకున్న వడని మరిగే వేడి నూనెలో వేసి కదపకుండా వదిలేయండి ఒక నిమిషం. నిమిషం తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోండి.
  7. వడ రంగు మారుతున్నప్పుడు హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి.
  8. ఈ వడ వేడిగా ఎంతో రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.