సెనగపప్పు మినపప్పు కంది పప్పు నానబెట్టి బరకగా రుబ్బి వేసే ఈ మూడు పప్పుల మాసాల వడ క్రిస్పీ కాదు గంటల తరువాత కూడా ఎక్సట్రా క్రిస్పీగా ఉంటాయి. సాయంత్రాలు టీ తో మాంచి స్నాక్!!!

సాధారణంగా మసాలా వడ అందరికి తెలిసినదే అందరూ చేసేదే, కానీ ఈ మూడు పప్పుల మసాలా వడ ఎంతో రుచిగా ఉండడమే కాదు మరింకెంతో రుచిగా ఉంటుంది. గంటల తరువాత కూడా కారకరలాడుతూనే ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుమాసాల వడ

ఈ రెసిపీలో అందరికీ తెలిసిన మసాలా వాడే అయినా ఏ పొరపాటు చేయడం వల్ల వడలు క్రిస్పీగా రావో, ఎలా చేస్తే ఏ టిప్స్ పాటిస్తే వడ విరిగిపోకుండా కారకరలాడేట్టు వస్తాయో చాలా వివరంగా ఉంది రెసిపీ, దాని కోసం కచ్చితంగా చేసే ముందు కింద టిప్స్ చుడండి.

టిప్స్

పప్పులు నానబెట్టుకునే తీరు:

  1. ఈ వడ కరకరలాడుతూ రావాలంటే పప్పులు మరీ మెత్తగా గంటల తరబడి లేదా రాత్రంతా నానబెట్టకూడదు. కేవలం 3-4 గంటలు చాలు. అప్పుడు వడ యమ క్రిస్పీగా వస్తుంది.

పప్పు రుబ్బే తీరు:

  1. నానిన పప్పుని వడకట్టి మిక్సీలో వేసి బరకగా అంటే గోధుమ రవ్వ అంత పలుకుగా రుబ్బుకోవాలి.

  2. పప్పు రుబ్బేప్పుడు చాల కొద్దిగా నీరు వేసి రుబ్బుకోవాలి. నీరు ఎక్కువైతే వడ రాదు విరిగిపోతుంది.

  3. మసాలా వడ కరకరలాడుతూ రావాలంటే ఎప్పుడు బరకగా రుబ్బుకోవాలి. నేను పప్పుని రుబ్బుకోడానికి ఛాపర్ వాడాను, కాబట్టి ఎంత గ్రైండ్ చేసినా పప్పు బరకగానే ఉంటుంది. మీరు మిక్సీ వాడుకోదలిస్తే కొద్దికొద్దిగా పప్పు వేసి బరకగా రవ్వ మాదిరి రుబ్బుకోండి.

వడ రాకపోతే:

  1. ఈ మసాలా వడ జిగురుగా ఉండదు. కాస్త పొడి పొడిగా ఉంటుంది, కాస్త కదిపినా విరిగిపోతుంది. అందుకని గట్టిగా అదిమి వడ తట్టుకోవాలి. ఒక వేళా ఏ కారణం చేతనైన వడ రాకపోతే కొద్దిగా బియ్యం పిండి లేదా సెనగపిండి వేసుకుంటే వడ విరిగిపోకుండా వస్తుంది.

వడ వేపే తీరు:

  1. వడ మరిగే వేడి నూనెలో నెమ్మదిగా వదిలి మూడు నాలుగు నిమిషాలు కడపకండి. అప్పుడు వడ నూనెలో వేగి విరగదు.

  2. వడ నూనెలో నిదాన్మగా వేగాలి అప్పుడే పప్పు ఎర్రగా వేగి కరకరలాడుతుంది. మసాలా వడ వేగడానికి సమయం పడుతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాక వేపుకోండి, ఆ తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోండి.

మూడు పప్పుల మాసాల వడ - రెసిపీ వీడియో

Three Dal Masala Vada | Moodu Pappula Masala Vada How to Make Three Dal Masala Vada

Snacks | vegetarian
  • Prep Time 15 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 20 mins
  • Total Time 4 hrs 35 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/3 Cup మినపప్పు
  • 1/3 Cup పచ్చి సెనగపప్పు
  • 1/3 Cup కంది పప్పు
  • 1 tbsp సోంపు
  • 1 tbsp జీలకర్ర
  • 1 Inch అల్లం
  • 6-7 Cloves వెల్లులి
  • ఉప్పు
  • 3-4 పచ్చిమిర్చి
  • 1/4 Cup కొత్తిమీర తరుగు
  • 2 ఎండుమిర్చి
  • 2 Sprigs కరివేపాకు
  • 1/2 Cup ఉల్లిపాయ తరుగు
  • 1/4 Cup పుదీనా తరుగు
  • నూనె (వేపుకోడానికి)

విధానం

  1. మినపప్పు సెనగపప్పు కందిపప్పుని కలిపి నీటితో బాగా కడిగి 3-4 గంటలు నానబెట్టుకోవాలి.
  2. నాలుగు గంటలు నానబెట్టిన పప్పుని పూర్తిగా వడకట్టి జల్లెడలో వేసి రెండు నిమిషాలు వదిలేయండి
  3. ఛాపర్లో సోంపు జీలకర్ర పచ్చిమిర్చి అల్లం వెల్లులి ఎండుమిర్చి నానబెట్టిన పప్పు వేసి నీరు వేయకుండా బరకాగా గ్రైండ్ చేసి తీసుకోండి. పప్పులోంచి ఒక పిడికెడు పప్పు పక్కనుంచుకోవాలి.
  4. మరో జనాల్లో బరకగా రుబ్బుకున్న పప్పు ఉల్లి పుదీనా కొత్తిమీర ఉప్పు వేసి గట్టిగా పిండుతూ పిండి కలుపుకోండి. ఇంకా పక్కనుంచుకున్న నానిన పప్పుని కూడా వేసి కలుపుకోండి.
  5. చేతులు తడి చేసుకుని పెద్ద నిమ్మకాయ సైజు ఉందని తడి చేత్తో తట్టి మరిగే వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా వదిలేయండి.
  6. మూడు నాలుగు నిమిషాల తరువాత నెమ్మదిగా గరిటతో తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీదే ఎర్రగా వేగనివ్వాలి(మసాలా వడ వేగడానికి సమయం పడుతుంది ఓపికగా వేపుకోవాలి)
  7. ఎర్రగా వేగిన వాడని ప్లేట్లోకి తీసుకోండి. ఈ మూడు పప్పుల మసాలా వడ వేడి మీద యమా క్రిస్పీగా ఉంటాయి, చల్లారాక క్రిస్పీగా ఉంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.