అరటికాయ చివడ

పచ్చి అరటికాయని నూనెలోకి తురిమి ఎర్రగా కారకాలాడేట్టు వేపి తీసి అందులో వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని మసాలాలు వేసి తయారు చేసే అరటికాయ చివడా తినడం మొదలెడితే ఆపడం అసాధ్యమనే చెప్పాలి.

ఆలూ చివడా అందరికీ తెలుసు కానీ నాకెందుకో ఆలూ చివాడా కంటే అరటికాయ చివడా చాలా రుచిగా అనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ అరటికాయ చివడా పప్పు అన్నంతో, పెరుగన్నం చారన్నంతో నంజుడుగా చాలా రుచిగా ఉంటుంది.

ఆలూ చివాడా కంటే అరటికాయ చివడా ఎందుకు ఎంతో అన్నాను అంటే కారకరాలాడేట్టు రావాలంటే కొత్తవి పిండి తక్కువగా ఉండే ఆలూ కావాలి అవి అందరికీ దొరకడం కష్టం, ఇంకా ఆలూ వేగడానికి సమయం పడుతుంది. అరటికాయతో చేసే చివాడాకి ఆలూ చివాడా మాదిరి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సులభముగా దొరికేస్తాయ్, వేపుకోవడం చాలా సులభం.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుఅరటికాయ ముద్ద కూర

ఇంత సులభమైన రెసిపీ చేసే ముందు కింద టిప్స్ ఫాలో అవుతూ చేయండి ఎప్పుడు చేసినా రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది.

టిప్స్

అరటికాయ:

  1. అరటికాయ బాగా పచ్చిగా ఉండాలి. అప్పుడు కరకరలాడుతూ వస్తుంది చివడా.

వేపే తీరు:

  1. తోలు తీసుకున్న అరటికాయని పెడా రంద్రాలున్న తురుము వైపు నూనెలోకి పెట్టి తురుముకోవాలి.

  2. అరటికాయని పూర్తిగా కాకుండా కొద్దీ కొద్దిగా అంటే సగం కాయని లేదా మూకుడులో పోసుకున్న నూనెకి తగినట్లు తురుముకుని వేపుకుంటే పర్ఫెక్టుగా వేగుతుంది.

చివడా వేప్పేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి:

  1. అరటికాయని బాగా వేడెక్కిన నూనె పైకి పెట్టి తురుముకుంటుంటే చేతికి సెగ బాగా తగిలి చేతులు మండుతాయి, అందుకే తురుముకుంటున్నప్పుడు చేతులును ఊదుకుంటూ తురుముకుంటే సుఖంగా ఇబ్బంది లేకుండా తురుముకోగలరు.

ఇలా తురుముకోవచ్చా:

  1. నూనెలోకి పెట్టి తురిమి కంటే విడిగా తురుముకుని ఆ తురుముని నూనెలోకి వేసి వేపుకోవచ్చు కదా అనే ప్రశ్న వస్తుంది. అలా విడిగా తురిమితే అరటికాయ తురుము నల్లబడుతుంది, ఇంకా అరటికాయలోని జిగురు కారణంగా తురుము ఒకదానికి మరొకటి అంటుకుపోతుంది, ఆ అంటుకున్న తురుము నూనెలో వేసినా విడిపోవడానికి కష్టమవుతుంది.

ఉప్పు పసుపు నీరు:

  1. అరటికాయల తురుము వెప్పేప్పుడు కాస్త ఉప్పు పసుపు కలిపినా నీరు కొంచెం పోసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీరు వేగేప్పుడు పోస్తేనే తురుముకి ఉప్పు పడుతుంది, వేపుకున్నాక ఉప్పు కలిపితే, ఉప్పు కరగక ఇసుకలా తగులుతుంది, ఇంకా పసుపు పచ్చి వాసనా వస్తుంది.

  2. ఉప్పు పసుపు నీరు మరిగే నూనెలో పోస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, వెజ్ తాలింపులో కరివేపాకు వేసినట్లు చిట్లుతుంది అంతే!!!

అరటికాయ చివడ - రెసిపీ వీడియో

Raw Banana Chivada

Bachelors Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Serves 8

కావాల్సిన పదార్ధాలు

  • 3 పచ్చి గట్టి అరటికాయలు
  • నూనె (వేపుకోడానికి)
  • 3/4 tbsp ఉప్పు
  • 1 tbsp పసుపు
  • 1/4 cup నీరు
  • 4 Sprigs కరివేపాకు
  • 3-4 ఎండుమిర్చి
  • జీడిపప్పు (చిన్న గుప్పెడు)
  • బాదాం (కొద్దిగా)
  • 3 tbsp కిస్మిస్
  • 1 tbsp కారం
  • మిరియాల పొడి (కొద్దిగా)
  • 1/2 tbsp చాట్ మసాలా

విధానం

  1. అరటికాయల ముచ్చికలు కోసి చెక్కు తీసి పక్కనుంచుకొండి.
  2. నీళ్లలో ఉప్పు పసుపు వేసి కలిపి ఉంచుకోండి
  3. నూనెలో జీడిపప్పు, బాదాం, కిస్మిస్ విడిదిగా వేపి పక్కనుంచుకొండి
  4. బాగా వేడెక్కిన నూనె మాన్తా తగ్గించి పెద్ద రంధ్రాల తురుము వైపు చెక్కు తీసుకున్న ఆరాటకాయలోంచి సగం తురుముకోండి.
  5. అరటికాయ తురుముని నెమ్మదిగా తడితే విడిపోతుంది. అప్పుడు పసుపు ఉప్పు కలుపుకున్న నీరు చెంచా పోసి నెమ్మదిగా కలుపుతూ వేపుకోండి.
  6. అరటికాయ విడిపడిపోయాక హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసి జల్లెడలో వేసి గాలికి వదిలేయాలి. ఇలాగే మిగిలిన అరటికాయని తురిమి పసుపు నీరు చల్లి నూనెలో ఎర్రగా వేపి తీసి జల్లెడలో వేసుకోవాలి.
  7. అరటికాయ వేపుకున్నాక ఎండుమిర్చి కరివేపాకు వేపి తీసి పక్కనుంచుకొండి
  8. జల్లెడలో చల్లార్చిన అరటికాయ చివడా కరకరలాడుతూ తయారవుతుంది, అప్పుడు డ్రై ఫ్రూట్స్, చాట్ మసాలా కారం వేసి ఎగరేస్తూ పట్టించి గాలి చొరని డబ్బాలో ఉంచుకుంటే కనీసం రెండు వారాలు నిలవుంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.