సగ్గుబియ్యం బొండాలు
సాయంత్రాలు లేదా వానపడుతున్నప్పుడో వాతావరణం చల్లగా ఉన్నప్పుడో ఎప్పుడూ మిరపకాయ బజ్జీలు పకోడీలే కాదు తెలుగు వారి సగ్గుబియ్యం బొండాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి.
బయట కరరాలాడుతూ లోపల మృదువుగా తినడానికి పుల్లగా కారంగా ఎలాంటి నంజుడులు అవసరంలేకుండా తిన్నకొద్దీ తినాలనిపించే గొప్ప తెలుగు వారి స్నాక్ సగ్గుబియ్యం బొండాలు. వీటినే తెలుగు వారు సగ్గుబియ్యం చల్ల బొండాలు అని కూడా అంటారు. చల్ల అంటే మజ్జిగ తెలుగులో.
ఈ బొండాలు సాధారణంగా స్ట్రీట్ ఫుడ్గా దొరకదు కానీ వెనుకటి నుండి తెలుగు వారు ఇళ్లలో చేసుకునే రెసిపీ.
మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఎగ్ బోండా

టిప్స్
సగ్గుబియ్యం:
- ఈ పునుగులకి మీడియం లావు ఉండే సగ్గుబియ్యం మాత్రమే వాడుకోవాలి.
పెరుగు:
- పుల్లని పెరుగు రుచి చాలా బాగుటుంది ఈ పునుగులకి, పుల్లని పెరుగు వాడితే పునుగులు గుల్లగా వస్తాయ్ ఇంకా ఎంతో రుచిగా కూడా ఉంటాయి.
నీరు:
-
కప్పు సగ్గుబియ్యానికి అరా కప్పు నీళ్లు సరిగ్గా సరిపోతాయి. ఇంకా సగ్గుబియ్యం కచ్చితంగా ఐదు గంటలు కచ్చితంగా నానిలి.
-
బోండాల్లో బియ్యం పిండి కలిపాక అవసరాన్ని బట్టి చెమ్చాలతో నీటిని చిలకరించి వేసుకోవాలి. పిండి జారవ్వకూడదు. పిండి జారుగా అయితే నూనె లాగేస్తుంది
వేపే తీరు:
-
కచ్చితంగా నూనె బాగా వేడిగా ఉండాలి, అప్పుడు మాన్తా మీడియం ఫ్లేమ్లోకి పెట్టి తడి చేత్తో బొండాలు వేసుకుంటే చేతికి పిండి అంటకుండా నూనెలోకి సులభంగా బొండాలు జారుతాయ్.
-
బొండాలు అన్నీ వేశాక మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోండి. ఆ తరువాత హై ఫ్లేమ్లోకి పెట్టి వేపితే కారకరలాడుతో వేపుకోవచ్చు.
ఇంకో తీరు:
- నచ్చితే ఐదు గంటలు నానిన పిండిలో 2 గంటలు అంత కంటే ఎక్కువగా నానానబెట్టిన 2 tbsp సెనగపప్పు లేదా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి.
సగ్గుబియ్యం బొండాలు - రెసిపీ వీడియో
Sabudana Bonda | Saggubiyyam Punugulu | How to Make Sabudana Bonda
Prep Time 1 min
Soaking Time 5 hrs
Cook Time 15 mins
Total Time 5 hrs 16 mins
Serves 3
కావాల్సిన పదార్ధాలు
- 3/4 Cup సగ్గుబియ్యం
- 1 Cup పుల్లని పెరుగు
- 1/2 Cup నీళ్లు
- ఉప్పు (రుచికి సరిపడా)
- 1/4 Cup ఉల్లిపాయ తరుగు
- 2 tbsp పచ్చిమిర్చి తరుగు
- 1/2 tbsp జీలకర్ర
- 1/4 Cup బియ్యం పిండి
- 1/4 tbsp అల్లం తురుము
- కొత్తిమీర తరుగు (కొద్దిగా)
విధానం
-
సగ్గుబియ్యంలో పెరుగు నీళ్లు కలిపి ఐదు గంటలు నానబెట్టుకోండి. ఐదు గంటల తరువాత సగ్గుబియ్యం మెత్తబడుతుంది
-
ఐదు గంటల తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుకోండి.
-
అవసరాన్ని బట్టి తగినన్ని నీళ్లు చిలకరించుకోండి. పిండి కాస్త చిక్కగా ఉండాలి
-
చేతులు తడి చేసి వేడి నూనె లో చిట్టి పూనుకుల మాదిరి వేసుకోండి. రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఆ తరువాత హై ఫ్లేమ్ మీద 2 నిమిషాలు వేపి తీసుకోండి.

Leave a comment ×
1 comments