ఇన్స్టంట్ సగ్గుబియ్యం ఇడ్లీ
నానబెట్టడం రుబ్బడం పులియబెట్టడం లాంటివేవి లేకుండా చేసే రెసిపీనే సగ్గుబియ్యం ఇడ్లీ . సింపుల్ సగ్గుబియ్యం ఇడ్లీ రెసిపీ స్టెప్ బి స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
దక్షిణ భారతదేశమంతటా ప్రతీ ఇంట టిఫిన్గా ఇడ్లీ చేస్తారంటే ఎంతలా ఇడ్లీ తింటారో అర్ధం చేసుకోవచ్చు. కానీ రాష్ట్రాన్ని బట్టి ఇడ్లీ చేసే తీరు భిన్నంగా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం ఇడ్లీ ఏ ప్రాంతానికి చెందినది కాదు, విస్మయ్ ఫుడ్ కిచెన్లో పుట్టినది.
రెసిపీ చాలా సింపుల్ పిండి పులియబెట్టడాలు, పప్పు రుబ్బడాలు లాంటివి ఏవి లేవు. ఏ చట్నీ పొడితో అయినా చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
1.సగ్గుబియ్యం: సన్న సగ్గుబియ్యం అయితే త్వరగా నానుతుంది. ఇడ్లీ త్వరగా ఉడుకుతుంది. లావు సగ్గుబియ్యం అయితే 5 సెకన్లు మిక్సీలో పల్స్ చేసి నానబెట్టుకోండి.
-
ఏ కొలతకి చేసిన మిగిలిన పదార్ధాలు అన్నీ సగ్గుబియ్యానికి సమానం.
-
ఈ ఇడ్లీ మామూలు ఇడ్లీ కంటే కొద్దిగా ఎక్కువస ఏపు స్టీమ్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసి కనీసం 5 నిిషాలు వదిలేసి ఆ తరువాత ఇడ్లీ తీసుకోవాలి.
-
ఈ ఇడ్లీ రవ్వ ఇడ్లీ మాదిరి పొడిపొడిగా అవ్వవు, మెత్తగా కొంచెం జిగురుగా ఉంటాయ్.
ఇన్స్టంట్ సగ్గుబియ్యం ఇడ్లీ - రెసిపీ వీడియో
Instant Sago Rava Idli | Saggubiyyam Idly | Saggubiyyam rava idli | No Fermentation Instant Idli | Javvarisi Idli
Prep Time 1 min
Soaking Time 15 mins
Cook Time 15 mins
Total Time 31 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup సన్న సగ్గుబియ్యం
- 1 cup వేడి నీళ్ళు సగ్గుబియ్యం నానబెట్టడానికి
- 1 cup చిలికిన పెరుగు
- 1 cup ఇడ్లీ రవ్వ
- 1 cup నీళ్ళు
- ఉప్పు – రుచికి సరిపడా
- 1/2 cup కొత్తిమీర
విధానం
-
సగ్గుబియ్యం ని నీళ్ళు పోసి బాగా కడిగి అందులో వేడి నీళ్ళు పోసి 15 నిమిషాలు వదిలేయాలి.
-
15 నిమిషాలకి సగ్గుబియ్యం సగం మగ్గిపోతుంది, ఆ తరువాత మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు ఉంచండి.
-
ఇడ్లీ ప్లేట్స్లో నెయ్యి /నూనె రాశి ఇడ్లీ పిండిని ¾ భాగం నింపి స్టీమ్ అవుతున్న ఇడ్లీ కూకర్ లో పెట్టుకోండి.
-
ఇడ్లీని 8 నిమిషాలు హై-ఫ్లేమ్ మీద లో-ఫ్లేమ్ మీద 5 నిమిషాలు స్టీమ్ చేసి స్టవ్ ఆపేసి 5 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
-
5 నిమిషాల తరువాత నీళ్ళలో ముంచిన చెంచాతో ఇడ్లీ తీసుకోవాలి. ఈ ఇడ్లీ ఏదైనా కారం పొడి లేదా చట్నీతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
4 comments