ఉప్పు ఉండలు | చిప్స్ లేని కాలంనాటి హెల్తీ స్నాక్
చిప్స్ లాంటి స్నాక్స్కి బదులు ఆరోగ్యకరమైన స్నాక్స్ కావలా? అయితే “ఉప్పు ఉండ” రెసిపీ పర్ఫెక్ట్. దక్షిణ భారతదేశం స్పెషల్ స్నాక్ “ఉప్పు ఉండ” రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి. పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఏవైనా చెప్పొచ్చుకదా అని చాలా అడుగుతుంటారు నన్ను, అయితే నిజానికి పిల్లలకి పెద్దలకి ప్రేత్యేకించి ఒక రెసిపీ తయారుచేయడం చేయడం కష్టం. అందుకే నేను ప్రేత్యేకించి ఇది పిల్లల రెసిపీ, ఇది పెద్దల కోసం అని చెప్పను. అలాగే ఈ రెసిపీ కూడా అందరి రెసిపీ అంటాను. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.
ఈ “ఉప్పు ఉండ” రెసిపీ దక్షిణ భారత దేశం అంతటా చేస్తారు. ఒక్కో ప్రాంతం ఒక్కో తీరులో. తెలుగు వారు ఉప్పిండి అని చేస్తారు, తమిళ వారు కొలుకట్టాయ్ అని చేస్తారు. తెలుగు వారు చేసే ఉప్పిండి రెసిపీ దాదాపుగా “ఉప్పు ఉండ” లాగే ఉన్నా, రూపం రుచి పూర్తిగా భిన్నం.
ఈ ఉప్పు ఉండ రెసిపీ వెనుకటి తరం వారు, ఇంకా తమిళనాడు రాష్ట్రానికి దగ్గర ఉన్న ఆంధ్రులు ఇప్పటికీ చేస్తున్నారు. కానీ తెలుగు వారు మాత్రం పుల్లని మజ్జిగతో చేస్తారు. నేను తమిళవారి పద్ధతిలోనే నీళ్ళతో వెనుకటి తెలుగువారి విధానంలో చేస్తున్నాను.
ఈ ఆరోగ్యకరమైన రెసిపీ ఎప్పుడు చేసినా రుచిగా రావడానికి చిట్టి చిట్కాలు కొన్ని ఉన్నాయి చూడండి.

టిప్స్
బియ్యం:
- దొరికితే ఉప్పుడు బియ్యం వాడుకోండి. నేను ఉప్పు ఉండ మృదువుగా ఉండాలని దోశల బియ్యం వాడాను. నచ్చితే బ్రౌన్ రైస్ కూడా వాడుకోవచ్చు.
తాలింపు:
- తాళింపులో వేసే మినపప్పు, శెనగపప్పు కొద్దిగా ఎక్కువగా వేసి కరకరలాడుతూ వేపితే ఎంతో రుచిగా ఉంటాయ్ ఉప్పు ఉండలు
ఆప్షన్స్ :
- నేను నీళ్ళతో బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేశాను, మీరు నచ్చితే నీళ్ళకి బదులు పుల్లని మజ్జిగ కూడా వాడుకోవచ్చు.
ఉప్పు ఉండలు | చిప్స్ లేని కాలంనాటి హెల్తీ స్నాక్ - రెసిపీ వీడియో
Salty Rice Balls | Healthy Snack Uppuu Undalu Recipe | How to make Salty Rice Balls
Prep Time 5 mins
Soaking Time 5 hrs
Cook Time 25 mins
Total Time 5 hrs 30 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1.5 cup బియ్యం
- నీళ్ళు/పుల్లని మజ్జిగ – తగినన్ని
- తాలింపు కోసం
- 3 tbsps నూనె
- 1 tsp ఆవాలు
- 2 tbps పచ్చి శెనగపప్పు
- 2 tbsps మినపప్పు
- 2 రెబ్బలు కరివేపాకు
- 1/2 tsp జీలకర్ర
- 2 ఎండుమిర్చి తరుగు
- 2 చిటికెళ్లు ఇంగువ
- 2 tbsp పచ్చిమిర్చి తరుగు
- 1/3 cup పచ్చి కొబ్బరి పలుకులు
-
ఉప్పు – రుచికి సరిపడ
విధానం
-
బియ్యాన్ని కడిగి 5 గంటలు నానబెట్టాలి. నానిన బియ్యాన్ని వడకట్టి నీళ్ళతో/ పుల్లని మజ్జిగతో మెత్తగా రుబ్బుకోవాలి
-
పాన్లో నూనె వేడి చేసి తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆఖరున పచ్చిమిర్చి వేసి 30 సెకన్లు మాత్రమే వేపుకోవాలి
-
వేపుకున్న తాళింపులో రుబ్బుకున్న బియ్యం పిండి ఉప్పు వేసి 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడే దాకా కలిపి దింపేసుకోవాలి
-
దింపుకున్న పిండి ముద్దలో కొబ్బరి పలుకులు వేసి వేడి మీదే చేతులకి నూనె రాసుకుని చేతి మణికట్టుతో బాగా వత్తుకోవాలి. వత్తుకున్న పిండిని నిమ్మకాయ సైజు ఉండలు చేసుకోవాలి
-
చేసుకున్న ఉండలని ఆవిరి మీద 15 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.
-
ఈ ఉండలు వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment ×