పెళ్ళిళ్ళ స్టైల్ సాంబార్ సాంబార్ పొడితో
వేసేవి అవే పదార్ధాలు కానీ దక్షిణ భారత దేశంలో వందల రకాల సాంబార్లున్నాయి. ఇంటికి, కులానికి, ప్రాంతానికి ఒక్కో తీరుగా సాంబార్ కాస్తారు. అలాంటిదే ఈ పెళ్ళిళ్ళ సాంబార్! పెళ్ళిళ్ళ సాంబార్ మామూలుగా ఇంట్లో చేసే కంటే కాస్త మరింత రుచిగా చేస్తారు. ఇది తెలుగు వారి పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ రెసిపీ!
నిజానికి తెలుగు వారు చేసే సాంబార్ అంటే దాదాపుగా తమిళవారు చేసే సాంబారే! తమిళులు చేసే సాంబార్ అంటే సాంబార్ పొడి మిశ్రమం తాజా చేసే వాడతారు. కానీ తెలుగు వారు ఎక్కువగా రెడీమేడ్ సాంబార్ పొడి వేసి చేస్తారు. నేను కూడా రెడీమేడ్ సాంబార్ పొడి వాడే చేశాను!
ఈ పద్ధతిలో చేసే సాంబార్ రుచి కూడా చాలా ప్రేత్యేకంగా ఘుమఘుమలాడిపోతుంది.

టిప్స్
బెస్ట్ సాంబార్ కోసం:
- మాంచి సాంబార్ పొడి ముఖ్యం. ఇంకా సాంబార్ ఎక్కువగా మరగాలి అప్పుడు సాంబార్ రుచి పెరుగుతుంది.
కాయకూరలు:
-
సాంబార్లో వేసే కాయకూరలు కొద్దిగా కొద్దిగా వేసినా ఎక్కువ రకాల కాయకూరలు వేసుకోండి.
-
పెళ్ళిళ్ళ సాంబార్ అంటే కచ్చితంగా ములక్కాడ, సాంబార్ ఉల్లిపాయ, వంకాయ ముక్కలు, టొమాటో ముక్కలు కచ్చితంగా వేస్తారు.
-
ఇంకా కాయకూరలు కూడా చింతపండు పులుసులో పూర్తిగా మెత్తగా ఉడికిస్తే ఎక్కువసేపు మరగాల్సిన సాంబార్లో కాయకూరాలు గుజ్జుగా అయిపోతాయ్. 80% ఉడకడం అంటే గుమ్మడి లేదా కేరట్ ముక్కని ఫోర్క్తో గుచ్చితే సులభంగా చివారికంటా ఫోర్క్ వెళ్లిపోవాలి ఇంకా ఫోర్క్ పై కాయకూర ముక్క నిలిచి ఉండాలి
-
కాయ కూర ముక్కలు రకానికి 4-5 ముక్కలు కంటే ఎక్కువగా వేయకండి అంత కంటే వేస్తే మొత్తం ముక్కలుగా ఉండిపోతుంది పులుసు లేక.
-
సాంబార్ లో కాయకూర ముక్కలు కాస్త పెద్ద ముక్కలు ఉంటే ఎక్కువసేపు సాంబార్ మరిగినా ముక్కలు చిదురవ్వవు.
సాంబార్ చిక్కదనం:
- పెళ్ళిళ్ళ సాంబార్ కాస్త చిక్కగా ఉండాలి, అందుకే కందిపప్పుతో పాటు కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు లేదా నానబెట్టిన పచ్చిశెనగపప్పు వేస్తే సాంబార్కి చిక్కదనం
తాలింపు:
-
నేను తాలింపులో వెల్లులి వాడలేదు, మీకు నచ్చితే వెల్లులి వేసుకోవచ్చు
-
పెళ్ళిళ్ళ సాంబార్కి రెండు సార్లు పెట్టె తాలింపు పరిమళం చాలా బాగుంటుంది. ముందు నూనెతో ఆఖరున నెయ్యితో పెట్టె తాలింపు రుచి సాంబార్ రుచిని పెంచుతుంది
-
ఏ కారణం చేతనైనా సామాబార్ చిక్కగా అనిపిస్తే కాసిని మరిగే నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి పలుచన చేసుకోవచ్చు
పెళ్ళిళ్ళ స్టైల్ సాంబార్ సాంబార్ పొడితో - రెసిపీ వీడియో
Sambar recipe | Wedding style Sambar at home | Sambar with Sambar Powder
Prep Time 5 mins
Soaking Time 1 hr
Cook Time 30 mins
Total Time 1 hr 35 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 1/3 cup కందిపప్పు (గంటసేపు నానబెట్టినవి)
- 1/4 cup పెసరపప్పు (గంట సేపు నానబెట్టినవి)
- 1/4 tsp పసుపు
- 3 cups నీళ్ళు
- 250 ml చింతపండు పులుసు (75 గ్రాముల చింతపండు నుండి తీసినది)
- 1.5 tbsp కారం
- 2 tsp రెడీమేడ్ సాంబార్ పొడి
- ఉప్పు
- 2 tbsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 1/4 tsp మెంతులు
- 1/4 tsp ఇంగువ
- 1 రెబ్బ కరివేపాకు
- 20 సాంబార్ ఉల్లిపాయలు
- 3 ఫ్రెంచ బీన్స్ (2 ఇంచులు పొడవు)
- 4 పచ్చిమిర్చి (చీరినవి)
- 6 - 7 బూడిగా గుమ్మడి ముక్కలు
- 4 - 5 వంకాయ ముక్కలు
- 6 - 7 ములక్కడ ముక్కలు
- 7- 8 తీపి గుమ్మడి ముక్కలు
- 1/4 cup అంగుళం సైజు కేరట్ ముక్కలు
- సగం కాప్సికం ముక్కలు
- 2 టొమాటో (పెద్ద ముక్కలు)
- 550 - 600 ml నీళ్ళు
- 1 tsp ధనియాల పొడి
- 1 tbsp బెల్లం
-
తాలింపు
- 2 tsp నెయ్యి
- 1/2 tsp ఆవాలు
- 3 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 2 కరివేపాకు రెబ్బలు
- కొత్తిమీర – చిన్న కట్ట
విధానం
-
కుక్కర్లో కందిపప్పు పెసరపప్పు పసుపు నీళ్ళు పోసి కుక్కర్ మూతపెట్టి మెత్తగా ఉడికించుకోవాలి.
-
ఉడికిన పప్పుని మెత్తగా ఏనుపుకోవాలి.
-
గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేసి మెంతులు ఎర్రగా వేగనివ్వాలి తరువాత ఇంగువ కరివేపాకు వేసి వేపుకోండి.
-
వేగిన తాళింపులో సాంబార్ ఉల్లిపాయాలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి, ఆ తరువాత మిగిలిన కాయ కూర ముక్కలు అన్నీ వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3-4 నిమిషాలు మగ్గనివ్వాలి.
-
ఈ లోగా చింతపండు పులుసులో కారం సాంబార్ పొడి వేసి కలిపి ఉంచుకోండి.
-
వేగిన కాయకూర ముక్కల్లో చింతపండు పులసు పోసి 80% ఉడికించుకోవాలి (80% ఉడికించడానికి టిప్స్ చూడండి).
-
ఏనుపుకున్న పప్పు 250 ml నీళ్ళు పోసి కలిపి మూతపెట్టి 15-20 మరిగించాలి. తరువాత బెల్లం వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి.
-
తాలింపు కోసం నెయ్యి కరిగించి అందులో తాలింపు సామానంతా వేసి వేపి సాంబార్లో కలిపి కొత్తిమీర తరుగు కూడా వేసి మరో 3 నిమిషాలు మారిగిచి దింపేస్తే పెళ్ళిళ్ళ సాంబార్ రెడీ.

Leave a comment ×
7 comments