మెత్తగా ఉడికించిన కందిపప్పు అన్నం లో ఉడికించిన కూరగాయలు చింతపండు పులుసు సాంబార్ పొడి, ఉప్పు కారం వేసి తాలింపు పెట్టి చేసే సాంబార్ రైస్ లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్!!!

సాంబార్ రైస్ తెలుగు వారి కంటే తమిళులు సాంబార్ సాదంగా ఎక్కువగా తింటుంటారు. ఓపిక లేనప్పుడు తక్కువ టైంలో తృప్తినిచ్చే గొప్ప రెసిపీ చేయాలనుకుంటే సాంబార్ రైస్ పర్ఫెక్ట్. నేను సాంబార్ రైస్ని ఇరవై నిమిషాల్లో తయారయ్యే ఒక అద్భుతం అంటుంటాను. ఎందుకంటె అంత రుచిగా ఉంటుంది విస్మయ్ ఫుడ్ తీరు సాంబార్ రైస్ రెసిపీ!!!

సాంబార్ రైస్ అందరూ చేసే అందరికి తెలిసినదే కానీ వేసే పదార్ధాలు వాటి కొలతలు వండే తీరు మీదే ఆధారపడి ఉంటుంది రెసిపీ రుచంతా. నా తీరు సాంబార్ రైస్ చల్లబడినా ముద్దకట్టదు, ఎంతో రుచిగా ఉంటుంది. రెసిపీ చేసే ముందు కింద టిప్స్ వివరంగా ఉన్నాయ్ చుడండి.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ఆలూ రైస్

టిప్స్

పప్పు అన్నం వండే తీరు:

  1. బియ్యం కందిపప్పు కడిగి కనీసం గంట సేపైనా నానబెట్టుకోవాలి. అప్పుడే అన్నం మెత్తగా ఉడుకుతుంది.

  2. మెత్తగా ఉడికిన అన్నాన్ని మరీ మెత్తగా గుజ్జుగా ఎనపకండి, సాంబార్లో ఉడికికా ఇంకా గుజ్జుగా అయిపోతుంది.

కాయ కూర ముక్కలు:

  1. సాంబార్ అన్నంలో కాకరకాయ తప్ప ఏ కాయకూరైనా వేసుకోవచ్చు. కానీ కచ్చితంగా మునక్కాడ, సాంబార్ ఉల్లిపాయలు, తీపి గుమ్మడి, బెండకాయ ముక్కలు ఉండేలా చూసుకోండి. నేను 10 రకాల కూరగాయలు వాడాను. మీరు ఇంత కంటే ఎక్కువ లేదా తక్కువైనా మీకు అందుబాటులో ఉండేవి వేసుకోవచ్చు.

  2. ఎన్ని కాయకూరలైనా 275 గ్రాములకి మించకండి ఈ కొలత అన్నానికి. ఇంతకంటే ఎక్కువగా వేస్తే మొత్తం కూరగాయ ముక్కలే అయిపోతాయి రుచిగా ఉండదు అన్నం.

ఇంకొన్ని విషయాలు :

  1. సాంబార్ అన్నం పలుచన చేసుకోడానికి వేడి నీరు పోసుకోండి.

  2. చింతావులందు పులుసులో వేసుకోవాల్సిన సాంబార్ పొడి కారం ఉప్పు పసుపు వేసుకుంటే అన్నంలో సులభంగా కలిసిపోతుంది.

  3. కచ్చితంగా ఆఖరున నెయ్యి వేసుకోవాల్సిందే అప్పుడే అసలైన పరిమళం రుచి సాంబార్ అన్నంకి.

సాంబార్ రైస్ - రెసిపీ వీడియో

Sambar Rice | Sambar Saadam | How to Make Sambar Rice

Flavored Rice | vegetarian
  • Prep Time 15 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 35 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • అన్నం ఉడికించడానికి:
  • 3/4 Cup బియ్యం
  • 1/3 Cup కందిపప్పు
  • 1/2 tbsp పసుపు
  • 1 tbsp ఉప్పు
  • 1 litre నీరు
  • చింతపండు పులుసు :
  • 1/2 Cup చింతపండు పులుసు (40 gm నుండి తీసినది)
  • 1 tbsp కారం
  • 2 tbsp సాంబార్ పొడి
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1/4 tbsp పసుపు
  • 35 gms బెల్లం
  • సాంబార్ అన్నానికి:
  • 6 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1/4 tbsp మెంతులు
  • 2 ఎండుమిర్చి
  • 2 Sprigs కరివేపాకు
  • ఇంగువ (కొద్దిగా)
  • 7-8 Pieces మునక్కాడలు
  • 1/4 Cup ఉల్లిపాయ
  • 12-15 సాంబార్ ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 10 అరటికాయ ముక్కలు
  • 10 కేరట్ ముక్కలు
  • 10 Pieces చిలకడ దుంపలు
  • 6-7 Pieces బెండకాయ ముక్కలు
  • 10 Pieces ఫ్రెంచ్ బీన్స్
  • 10 Pieces తీపి గుమ్మడి ముక్కలు
  • 10 Pieces కాలీఫ్లవర్ ముక్కలు
  • 1/2 Cup టమాటో ముక్కలు
  • 1/2 litre వేడి నీరు
  • 1/4 Cup నెయ్యి
  • 1/4 Cup కొత్తిమీర తరుగు

విధానం

  1. బియ్యం కందిపప్పు కలిపి కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి.
  2. నానిన బియ్యం పప్పుని ని పసుపు ఉప్పు కుక్కర్లో వేసి మూతపెట్టి 4 విజిల్స్ రానిచ్చి స్టీమ్ పోనివ్వండి
  3. చింతపండులో వేడి నీరు పోసి నానిన తరువాత చింతగుజ్జులో సాంబార్ పొడి, కారం, ఉప్పు పసుపు వేసి కలిపి పక్కనుంచుకొంది
  4. నూనె వేడి చేసి ఆవాలు మెంతులు వేసి చిట్లనివ్వాలి. తరువాత ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి
  5. వేగిన తాలింపులో ఉల్లిపాయ ముక్కలు ఇంకా మిగిలిన కాయకూరలన్నీ వేసి కలిపి మూతపెట్టి మునక్కాడ మెత్తబడేదాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి
  6. మునక్కాడ మగ్గిన తరువాత టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు వేపి ఆ తరువాత చింతపులుసు పోసి కలిపి రెండు పొంగులు రానివ్వండి.
  7. ఆ తరువాత ఉడికిన పప్పు అన్నం వేడి నీరు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోండి
  8. దింపేసి ముందు నెయ్యి కొత్తిమీర వేసి కలిపి దింపి. వడియాలతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • S
    sanjana tanguturi
    Recipe Rating:
    Easy and very tasty recipe .I like the whole recipe .Very calm and clean.
  • S
    sanjana tanguturi
    Recipe Rating:
    Easy and very tasty recipe .I like the whole recipe .Very calm and clean.