సేమియా నిమ్మకాయ పులిహోర

దక్షిణ భారత దేశం వారికి పొద్దున్నే టిఫిన్ అంటే ఇడ్లీ అట్టు ఉప్మా ఎప్పుడైనా వడ. వీటన్నిటికీ ముందు రోజు నుండే పని మొదలవ్వాలి, కాబట్టి పొద్దున్నే ఏమి చెయ్యాలి అని అందరిళ్ళలో ఉండే ఆలోచనే!!!

అయినా ఎప్పుడూ చేసినవే చేస్తే తినేవారికి అవి చేసే వారికి కూడా బోరు కొడుతుంది. అందుకే ఈ సారి తక్కువ టైంలో తయారయ్యే సేమియా నిమ్మకాయ పులిహోర చేయండి సూపర్ హిట్ అయిపోతుంది. నా తీరు సేమియా పులిహోర పొడిపొడిగా ఉంటుంది గంటల తరువాత కూడా మృదువుగా ఉంటుంది.

చేసినంత సేపు పట్టదు ఖాళీ చెయ్యడానికి అని కొన్ని రెసిపీస్ గురుంచి అంటుంటాము, అలాంటి రెసిపీల్లో ఒకటి సేమియా పులిహోర లేదా సేమియా నిమ్మకాయ పులిహోర.

సేమియాతో ఉప్మా చేసినట్లే సేమియా నిమ్మకాయ పులిహోరా, కాకపోతే చేసే తీరు వేసే పదార్ధాలు భిన్నం అంతే! చేసే ముందు కింద టిప్స్ పాటిస్తూ చేయండి తప్పక పర్ఫెక్టుగా వస్తుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు ప్రసాదం పులిహోర

టిప్స్

సేమియా:

  1. ఈ రెసిపీకి వేపిన సేమియా పనికి రాదు కాబట్టి మామూలు సేమియానే వాడుకోండి.

సేమియా ఉడికించే తీరు:

  1. సేమియా కచ్చితంగా మరిగే నీళ్లలో మాత్రమే వేసి హై ఫ్లేమ్ మీద 80% మాత్రమే ఉడికించి జల్లెడలో వేసి వడకట్టి చల్లని నీళ్లు పోసేయాలి. మిగిలిన 20% తాలింపులో మగ్గిపోతుంది.

  2. సేమియా నీరు మరుగుతున్నప్పుడు వేయకపోయినా ఎక్కువ సేపు ఉడికించినా మెత్తగా సేమియా ముద్దగా అయిపోతుంది.

  3. 80% ఉడకడం అంటే సేమియాని తీసి విరిపితే మెత్తగా ఉడికి ఇంకా కొంచెం పలుకు తగులుతుండాలి అది 80% అంటే.

తాలింపు:

  1. పులిహోరలకి తాలింపు ఊపిరి లాంటిది. కచ్చితంగా తాలింపు ఎర్రగా నిదాదనంగా వేపుకోవాలి. అప్పుడే పులిహోరకి పరిమళం.

ఆఖరుగా:

  1. సేమియా తాలింపులో వేశాక పులిహోరని అట్లకాడతో ఎగరేస్తూ కలపాలి, మాములుగా అన్నం కలిపినట్లు కలిపితే సేమియా చిదురైపోతుంది.

సేమియా నిమ్మకాయ పులిహోర - రెసిపీ వీడియో

Semiya pulihora | Semiya Lemon Pulihora | How to Make Semiya Pulihora

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 15 mins
  • Total Time 16 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup సేమియా
  • 2 cups నీళ్లు
  • 1/2 tbsp పసుపు
  • ఉప్పు (కొద్దిగా)
  • 1 cup చల్లని నీళ్లు
  • తాలింపు కోసం:
  • 2.5 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp సెనగపప్పు
  • 10 జీడిపప్పు
  • 1 Sprig కరివేపాకు
  • ఇంగువ (కొద్దిగా)
  • 1 పచ్చిమిర్చి
  • 1 ఎండు మిర్చి
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 1-1.5 tbsp నిమ్మరసం

విధానం

  1. నీళ్లలో ఉప్పు పసుపు వేసి ఎసరుని తెర్ల కాగనివ్వాలి. మరుగుతున్న ఎసరు మాత్రమే సేమియా వేసి 80% ఉడికించుకోవాలి
  2. 80% ఉడికిన సేమియాని వడకట్టి చల్లని నీళ్లు పోసి జల్లెడలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి
  3. నూనె వేడి చేసి అందులో తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపుకోవాలి.
  4. తాలింపు ఎర్రగా వేగిన తరువాత పూర్తిగా చల్లారిన సేమియా కొద్దిగా కొత్తిమీర,ఉప్పు వేసి అట్ల కాడతో ఎగరేస్తూ సేమియాని టాస్ చేసుకోవాలి.
  5. సేమియా టాస్ చేశాక స్టవ్ ఆపేసి నిమ్మరసం వేసి కలుపుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments