Curries
5.0 AVERAGE
8 Comments

నాన్ వెజ్లకి ధీటుగా ఉంటూ అచ్చం మాంసం తింటున్నామా అనిపించే సింపుల్ రెసిపీ సొయా కుర్మా చేయడం ఎంతో తేలిక. ఈ ఘాటైన మసాలా సొయా కుర్మా అన్నం, రోటీలు చపాతీలు దేనితోనైనా సరైన జోడి!!!

సోయానే చాలా మంది మీల్ మేకర్ అని కూడా అంటారు. సొయా కుర్మా చాలా తీరులో చేస్తారు, దక్షిణాది వారు సాయంత్రాలు హోటళ్లలో ఇచ్చే చపాతీ కుర్మాగా సోయా మసాలా కుర్మానే చేస్తారు. ఈ సోయా కుర్మా మసాలా పరిమళంతో ఎంతో రుచిగా ఉంటుంది, ఒక్క మాట చెప్పాలంటే మాంసాహారాలకి ధీటుగా ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు సోయా ఖీమా మసాలా

కింద టిప్స్లో కూర ఏ ఏ టిప్స్తో చేస్తే కచ్చితమైన రుచిలో వస్తుందో వివరాలున్నాయి చుడండి

టిప్స్

సోయా - మీల్ మేకర్ :

  1. నేను మీడియం సైజు మిల్మేకర్ వాడాను, మీరు పెద్దవైన వాడుకోవచ్చు.

  2. మిల్మేకర్ కేవలం 15 నిమిషాలు వేడి నీళ్లలో నానబెడితే చాలు అంతకంటే ఎక్కువగా నానితే కూరలో ఉడికి చిదురైపోతాయ్

ఇలా చేస్తే కూర చేదవుతుంది :

  1. మసాలాలు ఏ మాత్రం మాడినా కూర చేదుగా అవుతుంది. కాబట్టి మసాలాలు మాడకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోండి

కసూరి మేథీ:

  1. ఆఖరున వేసిన కసూరీ మేథీ కుర్మకి మాంచి పరిమళం రుచినిస్తుంది. మీ దగ్గర కసూరీ మేథీ లేనట్లయితే తాజా మెంతి కూర ఆకు ఉల్లిపాయ వేగిన తరువాత వేసి ఎర్రగా వేపి టమాటో పేస్ట్ పోసి వేపుకోండి

సొయా కుర్మా - రెసిపీ వీడియో

Soya Kurma | Meal maker Kurma | How to make Soya Kurma

Curries | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Resting Time 15 mins
  • Total Time 36 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup మిల్మేకర్
  • 3 Cups వేడి నీళ్లు
  • ఉప్పు (కొద్దిగా)
  • మసాలా పేస్ట్ కోసం:
  • 4 యాలకలు
  • 4 లవంగాలు
  • 1/4 tbsp మిరియాలు
  • 1 Inch దాల్చిన చెక్క
  • అల్లం (చిన్న ముక్క)
  • 5 వెల్లులి
  • 2 ఉల్లిపాయ
  • 2 పచ్చిమిర్చి
  • కుర్మా కోసం:
  • 5 tbsp నూనె
  • 1/2 tbsp పసుపు
  • 1 బిర్యానీ ఆకు
  • 2 యాలకలు
  • 2 లవంగాలు
  • 1 Inch దాల్చిన చెక్క
  • 2 పచ్చిమిర్చి (చీరినవి)
  • 2 Sprigs కరివేపాకు
  • 1 Cup టమాటో పేస్ట్
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp వేపిన జీలకర్ర పొడి
  • 1/4 tbsp గరం మసాలా
  • 1 1/4 Cup నీళ్లు
  • 1/2 Cup చిలికిన పెరుగు
  • కొత్తిమీర (కొద్దిగా)
  • 1 tbsp కసూరీ మేథీ
  • 1 tbsp నిమ్మరసం

విధానం

  1. మిల్మేకర్ లో వేడి నీళ్లు ఉప్పు వేసి 15 నిమిషాలు నానబెట్టి తరువాత నీటిని పిండి పక్కనుంచుకొండి
  2. మిక్సీ జార్లో మసాలా పేస్ట్ సామాగ్రీ అంతా వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. 1 Tbsp నూనె వేడి చేసి అందులో మిల్మేకర్ కొద్దిగా పసుపు వేసి ఒక నిమిషం వేపి తీసుకోండి
  4. మిగిలిన నూనె వేడి చేసి అందులో యాలకలు లవంగాలు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి వేపుకోండి
  5. వేగిన మసాలాల్లో ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక వేగనివ్వాలి.
  6. ఉల్లిలోంచి నూనె పైకి తేలిన తరువాత టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక వేపి మిగిలిన మసాలాలు కొద్దిగా నీరు పోసి వేపుకోండి
  7. వేగిన మసాలాల్లో మిల్మేకర్ వేసి కలుపుకోవాలి, ఆ తరువాత నీరు పోసి 7-8 నిమిషాలు ఉడికించి మూత తీసి బాగా చిలికిన పెరుగు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించండి
  8. దింపే ముందు కొత్తిమీర తరుగు కసూరి మేథీ వేసి కలిపి నిమ్మరసం పిండి స్టవ్ ఆపేసి దింపేసుకుంటే ఘుమఘుమలాడే మిల్మేకర్ లేదా సొయా మసాలా కుర్మా తయారు

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

  • P
    Paranjith Rohan
    Recipe Rating:
    Hi anna, I'm ur big fan. I used to see your video since I'm in class 5th . I really love ur cooking style, I have tried many recipes from ur channel it came very nice. But, day before yesterday I have tried soya kurma curry but it was tasteless and didn't identify the taste of recipe. I don't know how did it happened. I used perfect ingredients as you said. Previous also I have tried same recipe for 5-6 times it came nice but this time it disappointed me. Can you tell me the reason. Thank you
  • B
    Bannu
    Recipe Rating:
    Good anna
  • C
    Chandu
    Recipe Rating:
    Tqq sir full details echinaru
  • C
    Chandhu
    Recipe Rating:
    Super sir Ela cheyyalo complete details echinaru Tqq sir
  • S
    Shruthi
    Recipe came out very well.i want to know why u added curd for gravy.
  • P
    Prashanth
    What does tbsp mean? Tablespoon or teaspoon. Video says teaspoon while recipe has it as tbsp.