చికెన్కి మసాలాలు పట్టించి నానబెట్టి ఎర్రగా నూనెలో వేపి తీసి ఇచ్చే చికెన్ పకోడీ ఎప్పుడూ సూపర్ హిట్ రెసిపీనే!!! మసాలాల్లో నానిన చికెన్ నూనెలో వేగుతుంటే వచ్చే పరిమళాన్ని ఆశ్వాదించకుండా వీధి దాటడం ఎవరి తరం కాదు.

చికెన్ పకోడీ ఎవరు చేసినా దాదాపుగా ఒకేటే తీరు. కానీ నేను తెలుగు వారి తీరు చేస్తున్నాను, రంగులు అంజినొమొటోలు కార్న్ఫ్లోర్ మైదాలు వేయకుండా. ఈ చికెన్ పకోడీ పార్టీ స్టార్టర్గా గానే కాదు పప్పుచారు, రసం, పప్పుతో నంజుడుగా కూడా చాలా బాగుంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు షేజ్వాన్ ఫ్రైడ్ చికెన్

ఆలాంటి స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెసిపీ పక్కా కొలతల్లో స్పెషల్ టిప్స్ ఇంకా స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో రెసిపీ వివరంగా ఉంది చుడండి. చేసే ముందు కచ్చితంగా టిప్స్ని ఫాలో అవుతూ చేయండి బెస్ట్ పకోడీని తయారు చేయండి.

టిప్స్

చికెన్ గురుంచి తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు :

  1. చికెన్ కచ్చితంగా కిలో ఉండేలా చూసుకోండి. బరువు ఎక్కువ తూగే కోడి త్వరగా వేగదు మసాలాలు చికెన్ పట్టవు ఇంకా ఎంత వేగినా చికెన్ లోపల రబ్బర్లా ఉంటుంది.

  2. చికెన్ ముక్కలు మీడియం కట్ చేసుకోండి. మరీ చిన్న ముక్కలు చేస్తే వేగి ఇంకా చిన్నవి అయిపోతాయి.

  3. ఇదే చికెన్ పకోడీ మీరు ఎముకలు లేని కోడి మాంసంతో కూడా చేసుకోవచ్చు.

  4. మసాలాలు పట్టించిన చికెన్ కచ్చితంగా గంట పైన నానాలి అప్పుడే మసాలాలు చికెన్లోకి ఇంకుతాయ్.

ఇలా ఉంటె చికెన్ కోటింగ్ ఊడిపోతుంది:

  1. చికెన్ పైన కోటింగ్ చిక్కగా గట్టిగా ఉండాలి, అప్పుడే నూనెలో వేసినా కోటింగ్ ఊడిపోదు. నీరు కూడా అవసరాన్ని బట్టి చెంచాలతో వేసుకోండి.

  2. నచ్చితే 2 చెంచాలు గిలకొట్టిన గుడ్డు వేసుకుంటే కోటింగ్ కచ్చితంగా చిక్కగా గట్టిగా ముక్కని పట్టి ఉంటుంది.

చికెన్ వేపే తీరు:

  1. మరిగే వేడి నూనెలో మాంసం వేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ రంగు మారే దాకా వేపుకోవాలి. అలా లేత బంగారు రంగు వచ్చే దాకా వేగితేనే ముక్క లోపలిదాకా ఉడుకుతుంది, లేదంటే పైన రంగొస్తుంది లోపల పచ్చిగా ఉండిపోతుంది.

  2. చికెన్ రంగు మారాక హాయ్ ఫ్లేమ్ మీద వేపుకుంటే కరకరలాడుతూ వేగుతుంది.

ఇంకొన్ని విషయాలు:

  1. నేను స్ట్రీట్ ఫుడ్ వారి మాదిరి రంగు అజినొమొటోలు వేయలేదు. రంగు మాట ఎలా ఉన్నా, నిజానినికి అజినొమొటో వేస్తే వచ్చే రుచి భిన్నం. నచ్చితే మీరు వేసుకోవచ్చు.

  2. మీకు స్ట్రీట్ ఫుడ్ వారి రుచి కావాలంటే మైదా కార్న్ ఫ్లోర్ వేసుకోండి. నేను కారకరలాడడానికి బియ్యం పిండి మృదుత్వానికి సెనగపిండి వేశాను

  3. ఆఖరుగా చీరిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని పల్లీలు లేదా జీడిపప్పు కూడా నూనెలో వేపి వేపుకున్న చికెన్ మీద చల్లి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది.

  4. నచ్చితే టమాటో సాస్తో సర్వ్ చేసుకోండి.

చికెన్ పకోడీ - రెసిపీ వీడియో

Street food style Chicken Pakodi | Chicken pakoda | Chicken Pakora

Street Food | nonvegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 21 mins
  • Serves 3

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kg మీడియం కట్ బోన్స్ చికెన్
  • ఉప్పు (రుచి సరిపడా)
  • 1/2 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • 1 tbsp కారం
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp వేపిన జీలకర్ర పొడి
  • 1 tbsp గరం మసాలా
  • 1 tbsp నిమ్మరసం
  • 2 Sprigs సన్నని కరివేపాకు తరుగు
  • 2 tbsp సన్నని కొత్తిమీర తరుగు
  • 1-1 1/2 tbsp బియ్యం పిండి
  • 1 tbsp సెనగ పిండి
  • 1-2 tbsp నీళ్లు
  • నూనె (వేపుకోడానికి)

విధానం

  1. చికెన్ ముక్కల్లో మిగిలిన సామానంతా వేసి చికెన్కి మసాలాలు రుద్ది రుద్ది పట్టించి కనీసం గంట లేదా రాత్రంతా ఫ్రిజ్లో ఉంచండి (ఒక్క సారి చికెన్ గురుంచి వివరాల కిశోరం టిప్స్ చూడండి)
  2. మరిగే వేడి నూనెలో మూకుడుకి సరిపోను చికెన్ వేసి మీడియం ఫ్లేమ్ మీద చికెన్ రంగు మారే దాకా వేపి తరువాత హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి. (చికెన్ వేపే తీరు కోసం టిప్స్ చుడండి)
  3. చికెన్ పకోడీ వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    SURYA
    నేను చేశాను చాలా బాగుంది 👌👌👌