తమిళనాడు చిలకడదుంపల పులుసు
ఘాటైన పులుసులు కారంపొడిలో చింతపండు పులుసు చిలకడదుంపల ముక్కలు వేసి సన్నని సెగ మీద చిక్కబరిచి చేసే పులుసు వేడి అన్నంతో చక్కని జోడీ.
ఏదైనా ఒక వేపుడు చేసి ఈ చిలకడదుంపల పులుసు పెట్టుకుంటే చాలు పరిపూర్ణమైన దక్షిణాది లంచ్ లేదా డిన్నర్ తయారు!!! తమిళ్లో చిలకడదుంపలని సక్కరైవల్లి అంటారు కులంబు అంటే పులుసు అని అర్ధం.
సాధారణంగా తెలుగు వారి పులుసులు చాలా సింపుల్, కాస్త పలుచగా ఉంటుంది. తమిళుల పులుసు చిక్కగా కారంగా ఘాటుగా ఉంటుంది. దక్షిణాది వారు పులుసులు ప్రియులు అందరికంటే తమిళులు మరింత ఇష్టంగా తింటారు. వారికి తప్పక ఒక కొళంబు ఉండాలి భోజనంలో!!!
ఈ చిక్కని చిలకడదుంపల పులుసు, పులుసు కారం పొడితో పాటు పర్ఫెక్ట్ కొలతలు టిప్స్తో ఉంది చుడండి.

టిప్స్
చిలకడదుంపలు:
నేను కాస్త పీచు తక్కువగా ఉండే చిలకదుంపలూ వాడాను, అందుకే ఆఖరున వేసి ముక్క మెత్తబడే ఉడికించాను.
మీరు కావాలనుకుంటే చిలకడదుంపలని 80% ఉడికించి ఆఖరున పులుసులో కలిపి మరిగించుకోవచ్చు కూడా.
చిలకదుంపల ముక్కలు ఇలా కోసుకోవాలి:
దుంప ముక్కలు ½ అంగుళం మదం ఉండాలి లేదంటే ముక్క ఎక్కువసేపు మరగాల్సిన పులుసులో కలిసిపోయి చిదురైపోతుంది. అన్నంలో కలిపినా ముద్దగా అయిపోతుంది.
సాంబార్ ఉల్లిపాయలు:
ఈ పులుసుకి సాంబార్ ఉల్లిపాయల రుచి చాలా బాగుటుంది. అందుబాటులో లేని వారు ఉల్లిపాయ పెద్ద పాయలుగా చేసి వేసుకోండి.
బెల్లం:
నిజానికి చిలకడదుంపల తీపి సరిపోతుంది. నాకు పులుసు కాస్త తియ్యగా ఉండడం ఇష్టం కాబట్టి చిన్న బెల్లం గడ్డ వేసాను.
ఆఖరుగా:
పులుసులు ఎంత నిదానంగా మరిగితే అంత రుచి. దింపడానికి ముందు కచ్చితంగా పులుసులో పిలుపుని బట్టి ఉప్పు కారం రుచి చూసి దింపేసుకోండి.
తమిళనాడు చిలకడదుంపల పులుసు - రెసిపీ వీడియో
Sweet Potato Pulusu | Sakkaraivalli Kulambu | Spicy Chilakadadumpla pulusu
Prep Time 5 mins
Cook Time 40 mins
Total Time 45 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 300 gms చిలకడదుంప ముక్కలు
-
పులుసులు కారం పొడి కోసం
- 1/2 tsp ఆవాలు
- 1/4 tsp మెంతులు
- 1 tsp జీలకర్ర
- 1/2 tsp మిరియాలు
- 1/4 cup కొబ్బరి
-
పులుసు కోసం
- 6 tbsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 4 ఎండుమిర్చి
- 25 సాంబార్ ఉల్లిపాయలు
- 2 కరివేపాకు - రెబ్బలు
- 10 -12 వెల్లులి పాయలు
- ఉప్పు
- 1 cup టమాటో ముక్కలు
- 3/4 tsp కారం
- 1 tbsp ధనియాల పొడి
- 100 -125 ml చింతపండు పులుసు (50gm చింతపండు నుండి తీసినది)
- 1/2 liter నీళ్లు
విధానం
-
పులుసులు కారం పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఆవాలు చిట్లి మెంతులు ఎర్రబడేదాకా వేపి మెత్తని పొడి చేసుకోండి.
-
నూనె వేడి చేసి ఆవాలు వేసి చితాలనివ్వాలి ఆ తరువాత ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లులి కరివేపాకు వేసి ఉల్లిపాయ మెత్తబడి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద.
-
వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు ఉప్పు వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి.
-
తరువాత కారం, ధనియాల పొడి వేసి వేపి చింతపండు పులుసు పొడి ఒక పొంగు రానివ్వాలి.
-
పొంగుతున్న పులుసులో చిలకడదుంపల ముక్కలు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 30 నిమిషాలు వదిలేయాలి. ఇంకా కాస్త బెల్లం గడ్డ కూడా వేసుకోండి (ఇది పులుసు తియ్యగా ఇష్టపడే వారికి).
-
దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి. ఈ పులుసు వేడి అన్నం నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×