మిరియాల పులుసు
ఘాటుగా పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే చిక్కని మిరియాల పులుసు అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తమిళుల ప్రేత్యేకమైన రెసిపీ, దీన్నే తమిళంలో మిలగు(మిరియాలు) కొళంబు (పులుసు) అని అంటారు. కానీ నేను సాంప్రదాయ తమిళుల తీరులో చిన్న మార్పులతో చేశా!
నేను తమిళనాడు వెళ్ళినప్పుడు తప్పక ఎంతో ఇష్టంగా అడిగి మరీ చేయించుకు తినే రెసిపీ ఈ మిరియాల పులుసు. తమిళనాడులో రోజు వారీ భోజనంలో వారు చేస్తూనే ఉంటారు. ఈ పులుసు చలికాలంలో గొంతులోకి మిరియాల ఘాటుతో దిగుతూ ఉంటె భలేగా ఉంటుంది.
మిలగు కొళంబు అన్నంతోనే కాదు అట్టు ఇడ్లీతో నంజుగుగాను చాలు బాగుటుంది. ఈ సింపుల్ పులుసు చేసే ముందు కింద టిప్స్ చుడండి.
Try this: Pepper Rasam

టిప్స్
పులుసు రుచిగా రావాలంటే:
-
పులుసులకి కాస్త నూనె ఉండాలి. ఇంకా నిదానంగా సన్నని సెగ మీద ఎక్కువసేపు మరగాలి అప్పుడే రుచి.
-
తగిన మోతాదులో చింతపండు దానికి తగినట్లుగా ఉప్పు కారాలు ఉంటేనే పులుసు రుచి.
మరి కొన్ని టిప్స్:
-
సాధారణంగా మిలగు కొళంబు కాస్త నల్లగా ఉంటుంది. నేను మిరియాలతో పాటు మిరపకాయలు, వేసాను ఇంకా కారాన్ని పులుపుని బాలన్స్ చేయడానికి పచ్చి కొబ్బరి వాడాను. అచ్చమైన తమిళనాడు పులుసులో కొబ్బరి వాడరు.
-
అసలుకైతే మొత్తంగా మిరియాలు వేసి 2-3 ఎండుమిర్చి వేస్తారు అంతే! అందుకే మిరియాల పులుసు అంత నల్లగా ఉంటుంది నచ్చితే మీరు అలాగే చేసుకోవచ్చు.
మిరియాల పులుసు - రెసిపీ వీడియో
Tamilnadu Special Pepper Kulambu | Miriyala Pulusu
Prep Time 2 mins
Cook Time 25 mins
Total Time 27 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
పులుసు పేస్ట్ కోసం
- 2 - 2.5 tsp మిరియాలు
- 5 ఎండు మిర్చి
- 2 tsp ధనియాలు
- 1/4 tsp మెంతులు
- 1 tsp బియ్యం
- 1 tsp పెసరపప్పు/సెనగపప్పు
- 1 tsp జీలకర్ర
- 1/4 cup పచ్చికొబ్బరి
- 1 రెబ్బ కరివేపాకు
-
పులుసు కోసం
- 4 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 రెబ్బ కరివేపాకు
- 125 gm సాంబార్ ఉల్లిపాయలు
- ఇంగువ - కొద్దిగా
- 7 - 8 వెల్లులి
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- 2 టమాటో ముక్కలు
- 300 ml చింతపండు పులుసు (50 gm చింతపండు నుండి తీసినది)
- 400 ml నీళ్లు
విధానం
- పులుసు కారం కోసం ఉన్న పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
- మాంచి సువాసన వస్తున్నప్పుడు పచ్చికొబ్బరి, కరివేపాకు వేసి వేపి మిక్సీ జార్లో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేడి ఆవాలు చిట్లనిచ్చి అందులో కరివేపాకు ఇంగువ వేసి వేపుకోవాలి.
- ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
- వేగిన ఉల్లిలో టమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా మగ్గనివ్వాలి.
-
మగ్గిన టొమాటోలో చింతపండు పులుసు పోసి రెండు పొంగులు రానివ్వాలి.
- పొంగుతున్న పులుసులో మిరియాల కారం పేస్ట్ నీళ్లు పోసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 15-20 నిమిషాలు మరగనివ్వాలి.
- పులుసులు ఎంత మరిగితే అంత రుచి. పులుసు చిక్కబడి మాంచి సువాసన రావాలి అప్పుడు దింపేసుకోండి.

Leave a comment ×
2 comments