అటుకుల రవ్వ కేసరి | కేసరి చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది | ఉడిపి స్టైల్ అటుకుల రవ్వ కేసరి
ఎప్పుడైనా తీపి తినాలిపించినా పండుగలకి త్వరగా అయిపోయే ప్రసాదం చేయాలనుకున్నా ఉడిపి స్టైల్ “అటుకుల రవ్వ కేసరి” చేయండి చాలా త్వరగా అయిపోతుంది ఇంకా ఎంతో రుచిగా ఉంటుంది.
బాంబే రవ్వతో చేసే కేసరి అందరికీ తెలిసినదే అందరికీ ఇష్టమైనదే. అటుకుల రవ్వ కేసరి కూడా దాదాపుగా అంతే! కానీ రుచిలో రూపంలో చిన్న వ్యత్యాసం అంతే!
ఈ అటుకుల రవ్వ కేసరి నేను మొదటి సారి ఉడిపి వెళ్ళినప్పుడు అక్కడి సత్రాల్లో భోజనంలో ఇచ్చారు. ఉడిపిలో కృష్ణాష్టమి నాడు కూడా ఈ కేసరి చేస్తారని చెప్పారు.

టిప్స్
-
అటుకులు మందంగా ఉండేవి వాడితే కేసరిలో తినేప్పుడు రవ్వగా తెలుస్తుంది. మీకు నచ్చితే బ్రౌన్ రైస్ అటుకులు కూడా వాడుకోవచ్చు.
-
నేను పచ్చ కర్పూరం వేయలేదు నచ్చితే ఆఖరున అర చిటికెడు వేసుకోవచ్చు.
అటుకుల రవ్వ కేసరి | కేసరి చేయండి పర్ఫెక్ట్ గా వస్తుంది | ఉడిపి స్టైల్ అటుకుల రవ్వ కేసరి - రెసిపీ వీడియో
Udupi Poha Rava Kesari | Rice Flakes Rava Kesari | Poha Rava Kesari | Poha Sheera | How to make Atukula Rava Kesari
Sweets
|
vegetarian
Prep Time 2 mins
Cook Time 20 mins
Total Time 22 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup మందం అటుకులు
- 1 cup పంచదార
- 2 tbsp నెయ్యి
- 1/2 tsp యాలకలపొడి
- 1/4 tsp జీడిపప్పు
- 2 tbsp ఎండు ద్రాక్ష
- 1/4 tsp ఆరెంజ్ ఫుడ్ కలర్
- 2 cups నీళ్ళు
విధానం
-
అటుకులు రంగు మారకుండా కలుపుతూ కరకరలాడేట్టు వేపుకుని, మిక్సీలో రవ్వగా చేసుకోవాలి.
-
నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
-
అదే ముకుడులో నీళ్ళు పోసి మరగనివ్వాలి, మరుగుతున్న నీళ్ళలో అటుకుల రవ్వ వేసి ఉడకనివ్వాలి.
-
రవ్వ మెత్తగా ఉడికాక, పంచదార, రంగు, యాలకలపొడి వేసి బాగా కలిపి దగ్గర పడనిచ్చి వేపుకున్న జీడిపప్పు, కిస్మిస్స్ వేసి కలిపి దింపేసుకోండి. నచ్చితే ఆఖరున పచ్చకర్పూరం వేసుకుని దింపేసుకోండి.

Leave a comment ×
92 comments