పెళ్లిళ్ల స్పెషల్ ఆలూ ఫ్రై

Curries
5.0 AVERAGE
2 Comments

ఇంట్లో ఆలూ ఉంటె చాలు ఏదో తెలియని నిశ్చింత!!! ఒక్క ఆలూ కూర చేసినా తృప్తిగా భోజనం ముగించొచ్చు. అలాంటిదే ఈ ఘుఘుమలాడే పెళ్లిళ్ల స్పెషల్ ఆలూ కర్రీ. అన్నం చపాతీ రోటీ ఎందులోకైనా సరిగ్గా సరిపోయేలా ఉంటుంది.

కొన్ని వంటకాల పరిమళాలు ఇల్లు దాటి వీధిలోకి తన్నుకొస్తుంటాయ్ అలాంటి జాబితాకి చెందినదే ఈ సింపుల్ పెళ్లిళ్ల స్టైల్ ఆలూ ఫ్రై.

ఇది సందర్భం కాకపోయినా చాలా సార్లు ఒక విషయం చెప్పాలనుకున్నది ఇప్పుడు చెబుతున్నాను. చాలా సందర్భాల్లో ఏదైనా వంటకం చూసినప్పుడు ఇది సేమ్ మేము చేసినట్లే ఉండే అనిపిస్తుంది. కానీ ఏ రెసిపీలో అయినా పదార్ధాలు వేసే కొలతలు వాటిని వేపే తీరు మీదే రుచి ఆధారపడి ఉంటుంది అది అర్ధం చేసుకుంటే ఏ రెసిపీ అయినా అచ్చం అదే తీరులో ఉంటుంది. కొన్ని రెసిపీస్కి కొన్ని పదార్ధాలు కొంత మోతాదులోనే ఉండాలి. అన్నీ మన తీరులో చేసేస్తే అన్నీ ఒకే రుచిలో ఉంటాయి.

పెళ్లిళ్ల స్పెషల్ అనగానే ఏదో చాలా ప్రత్యేకంగా ఉండదు, చాలా సింపుల్ అందరిళ్ళలో ఉండేవే కాకపోతే వేసే పదార్ధాలు వాటి కొలతలు కాస్త భిన్నం. ఆ భిన్నత్వమే ఈ ఆలూ ఫ్రై ఎంతో ప్రేత్యేకంగా నిలిపింది.

ఈ స్టైల్ ఆలూ కర్రీ నేను చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెండ్ పెళ్ళిలో తిన్నాను. చాలా నచ్చేసింది రెసిపీ. ఆ రెసిపీనే మీతో షేర్ చేస్తున్నాను.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు కందా బచ్చలి

టిప్స్

ఆలూ:

  1. దయచేసి మొలకలొచ్చిన ఆలూ లేదా పాత ఆలూ వాడకండి. అవి వాడితే దుంప తియ్యగా ఉంటుంది, రుచి బాగుండదు.

  2. ఆలూని మరీ మెత్తగా గుజ్జుగా ఉడికించకండి. దుంప మెత్తగా ఉడికిన కాస్త గట్టిగా ఉండాలి.

పెళ్లిళ్ళా రుచి రావడానికి ఇంకొన్ని టిప్స్:

నూనె:

  1. పెళ్లిళ్ల స్పెషల్ తీరు రుచి కావాలంటే కొద్దిగా నూనె ఉండాలి. ఈ కూరకి నూనె ఉంటేనే రుచి. నచ్చని వారు తగ్గించుకోవచ్చు

  2. ఈ రెసిపీలో వాడే ప్రతీ పదార్ధం తాజాగా ఉండేలా చూస్కోండి. అంటే తాజా అల్లం వెల్లులి పేస్ట్, తాజా నాటు కొత్తిమీర ఆకు తరుగు ఇలా.

సోంపు:

  1. సోంపు పరిమళం చాలా బాగుంటుంది. నచ్చని వారు లేదా అందుబాటులో లేని వారు జీలకర్ర వేసుకోవచ్చు

మటన్ మసాలా:

  1. ఈ కూర రుచంతా పరిమళం అంతా ఆఖరున వేసే మటన్ మసాలా పొడిలోనే ఉంది. లేని వారు ఇష్టలేని వారు గరం మసాలా వేసుకోవచ్చు. కానీ మటన్ మసాలా రుచి చాలా ప్రేత్యేకం అని అర్ధం చేసుకోండి.

పెళ్లిళ్ల స్పెషల్ ఆలూ ఫ్రై - రెసిపీ వీడియో

Wedding Style Aloo Fry | Potato Fry | How to make Wedding Style Aloo Fry with Tips

Curries | vegetarian
  • Prep Time 15 mins
  • Cook Time 20 mins
  • Total Time 35 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/4 Cup నూనె
  • 1 Inch దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • 1 tbsp సోంపు
  • 2 యాలకలు
  • 10-12 జీడిపప్పు
  • 1 tbsp తాజా అల్లం వెల్లులి పేస్ట్
  • 2 Springd కరివేపాకు
  • 100 gms ఉల్లిపాయ సన్నని చీలికలు
  • 4 పచ్చిమిర్చి చీలికలు
  • 2 టమాటో
  • ఉప్పు (రుచి ప్రకారం)
  • పసుపు
  • 1 tbsp ధనియాల పొడి
  • 11/4 tbsp కారం
  • 3 ఉడికించుకున్న ఆలూ
  • 1/2 Cup ఫ్రోజెన్ బఠాణీలు
  • 1 tbsp మటన్ మసాలా
  • 1/2 Cup కొత్తిమీర తరుగు

విధానం

  1. నూనే వేడి చేసి అందులో దాల్చిన చెక్కా, లవంగాలు, యాలకలు సోంపు జీడిపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి
  2. వేగిన తాలింపులో కెరివేపాకు వేసి వేపి, ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  3. ఉల్లిపాయలు పూర్తిగా మెత్తబడి రంగు మారాక, తాజా అల్లం వెల్లులి పేస్ట్ పచ్చిమిర్చి చీలికలు వేసి వేపుకోవాలి. ఆ తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా వేపుకుంటే చాలు.
  4. గుజ్జుగా అయినా టమాటోలో పసుపు ధనియాల పొడి ,కారం, ¼ కప్పు నీళ్లు పోసి మసాలాల్లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  5. నూనె పైకి తేలిన తరువాత బటాణీ, ఉప్పు వేసి 3-4 నిమిషాలు ఉడికిస్తే చాలు ఫ్రోజెన్ బటాణీ కదా మగ్గిపోతాయ్. ఆ తరువాత ఉడికించుకున్న ఆలూ కాస్త కొత్తిమీర తరుగు మటన్ మసాలా పొడి వేసి ఆలూ చిదిరిపోకుండా కలుపుకోవాలి.
  6. ఆఖరున దింపే ముందు మిగిలిన కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • P
    Pratima
    Please mention the exact brand of mutton masala you used. A picture of the pack would be great.
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Adviteeyam as you said the taste is wonderfull. My family members recognised the smell and said wow