వంకాయ పకోడీ
తెలుగు వారి పెళ్లిళ్లలో లేదా ఏ శుభ అశుభకార్యమైన భోజనాల్లో కేటరింగ్ వారు తప్పక ఇచ్చే వంటకాల్లో ఒకటి ఈ వంకాయ పకోడీ. వంకాయ బయట బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఘాటైన మసాలా గుభాళింపుతో ఉండే ఈ రెసిపీ తెలియని తినని తెలుగు వారుండరు.
తెలుగు వారు ఎంతో ఇష్టపడే ఈ వంకాయ పకోడీ భోజనాల్లో స్వీట్ హాట్ వడ్డించిన తరువాత ఏదైనా ఫ్లేవర్ రైస్ వడ్డిస్తారు ఆ తరువాత పప్పు కూర పచ్చడి వేపుళ్ళు అన్నీ వారసపెడతాయ్. ఆ తరువాత పొగలు చిమ్మే వేడి వేడి అన్నం నెయ్యి వేస్తారు చాలా మంది పప్పు అన్నంతో నంజుకు తింటారు, నాలాంటి వారు కొంచెం పప్పన్నంతో తిని కొంచెం దాచి పెరుగన్ననికి ముందు పొసే సాంబార్ అన్నంతో తింటారు.
మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు స్వీట్ కార్న్ గట్టి పకోడీ
ఈ వంకాయ పకోడీ ఏదో చాలా ప్రేత్యేకమైన రెసిపీ కాదు, కానీ వేసే పదార్ధాల కలియిక గొప్ప రుచిని చేకూరుస్తుంది. ఈ సింపుల్ రెసిపీ చేసే ముందు నేను కింద ప్రతీ పదార్ధం గురుంచి వివరంగా చెప్పే టిప్స్ పర్ఫెక్ట్ రెసిపీకి ఎంతో ఉపయోగపడతాయ్.

టిప్స్
వంకాయ:
- ఈ వంకాయ పకోడీకి లేత గింజ పాడనీ నీలం రంగు వంకాయలు అయితేనే రుచి. తెల్లవి లేదా ముదురు రంగులో ఉండే గుత్తి వంకాయలు అంత రుచిగా ఉండవు. వాడుకోదలిస్తే దొరకనప్పుడు అవీ మీరు వాడుకోండి, కానీ లేత నీలం రంగు పొడవు వంకాయలైతేనే రుచి అని అర్ధం చేసుకోండి.
ఇలా చేస్తేనే వంకాయ పకోడీ క్రిస్పీగా వస్తుంది:
-
వంకాయ పకోడీ వేసే సెనగపిండి మైదా కార్న్ ఫ్లోర్ అన్నీ ఎగరేస్తూ పట్టించాలి. నీళ్లు కూడా వంకాయల పైన చిలకరిస్తూ చెంచాతో తడి పొడిగా పట్టించాలి.
-
ఈ పకోడీ పిండి మొత్తం తడిగా ఉండదు. తడి పొడిగా ఉంటుంది, ఉండాలి. వంకాయకి కూడా పూర్తిగా పెట్టుకోదు, అక్కడక్కడ పట్టి ఇంకొంచెం వంకాయ కనిపిస్తూనే ఉంటుంది.
-
వంకాయకి కోటింగ్ ఇచ్చేప్పుడు చెంచా లేదా సలాడ్ టాసర్ వాడుకుంటే పిండి చేతికి అంటకుండా పర్ఫెక్టుగా వంకాయకి పడుతుంది.
వంకాయని వేపే తీరు:
- వంకాయ వేగడానికి సమయం పడుతుంది. కాబట్టి పకోడీ వేసి కేవలం మీడియం ఫ్లేమ్ మీదే రంగు మారే దాకా వేపుకోవాలి. వంకాయని హై ఫ్లేమ్ మీద వేపితే వంకాయ పైన రంగొస్తుంది పకోడీ కూడా కరకరలాడుతూ ఉంటుంది, కానీ వంకాయ లోపల పచ్చిగా జిగురుగా ఉంటుంది, తినలేరు.
ఆంచూర్ పొడి:
- వంకాయ పకోడీ తెసిలి తెలియాని పిలుపుతో ఉండాలి అప్పుడే రుచి అందుకే ఆంచూర్ పొడి వేశాను, ఆంచూర్ పొడి లేకుంటే ఆఖరున నిమ్మరసం పిండుకొండి.
వంకాయ పకోడీ - రెసిపీ వీడియో
Wedding style Vankaya Pakodi | Wedding style Brinjal Pakodi recipe | How to make Wedding style Vankaya Pakodi
Prep Time 10 mins
Cook Time 30 mins
Total Time 40 mins
Serves 6
కావాల్సిన పదార్ధాలు
-
వంకాయ కోటింగ్ కోసం:
- 1 Cup ఉల్లిపాయ చీలికలు
- ఉప్పు (కొద్దిగా)
- 1/4 tbsp పసుపు
- 1/2 tbsp జీలకర్ర పొడి
- 1 tbsp కారం
- 1 tbsp ధనియాల పొడి
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 1/2 kg చీరుకున్న వంకాయ ముక్కలు
- 1.5 cup సెనగపిండి
- 1/4 cup మైదా
- 1/4 cup కార్న్ ఫ్లోర్
- 1/4 cup నీళ్లు
- నూనె వేపుకోడానికి
- 1/4 cup జీడిపప్పు
- 1/4 cup వేరుశెనగగుండ్లు
-
పకోడీ టాసింగ్ కోసం:
- 2 tbsp నూనె
- 6-7 వెల్లులి
- 4 పచ్చిమిర్చి చీలికలు
- 2 Sprigs కరివేపాకు
- 1 ఉల్లిపాయ సన్నని చీలికలు
- 1/2 cup పచ్చికొబ్బరి
- 1 tbsp గరం మసాలా
- 1/2-1 tbsp కారం
- 1/4 cup కొత్తిమీర
- 1 tbsp ఆమ్ చూర్ పొడి
విధానం
-
ఉల్లిపాయల్లో ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం వెల్లులి పేస్ట్ వేసి గట్టిగా గట్టిగా పిండండి
-
తరువాత వంకాయ ముక్కలు వేసి కలుపుకోండి. ఆ తరువాత సెనగపిండి మైదా కార్న్ ఫ్లోర్ వేసి ముందు వంకాయ ముక్కలని ఎగరేస్తూ టాస్ చేసుకోండి
-
వంకాయ ముక్కలకి పొడి పిండి పట్టిన తరువాత నీళ్లు కోడి కొద్దిగా చిలకరిస్తూ స్పూన్తో కోట్ చేసుకోండి (కోటింగ్ ఎంతో ముఖ్యం ఒక్క సారి పైన టిప్స్ చుడండి)
-
మరిగే నూనెలో కొన్ని వంకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద పకోడీ కారకరలాడేట్టు వేపుకుని తీసి జల్లెడలో వేసుకోండి. అలాగే మిగిలిన పకోడీ కూడా వేసి వేపుకోండి.
-
పకోడీ వేపుకున్నాక జీడిపప్పు పల్లెలు వేపి తీసుకోండి
-
వెడల్పాటి పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లులి పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు ఉల్లిపాయ చీలికలు ఒక దాని తరువాత ఒకటి వేసి ఉల్లిపాయాలు ఎర్రగా అయ్యేదాకా వేపుకోండి
-
వేగిన తాలింపులో వంకాయ పకోడీ మిగిలిన సామాగ్రీ అంతా వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసి తీసుకోండి.
-
వడ్డించే ముందు కొద్దిగా ఆమ్‌చూర్ పౌడర్ చల్లుకోండి.

Leave a comment ×